Karthika Deepam మార్చి 15 ఎపిసోడ్: మోనిత, ఆనంద్ ఎవరో హిమకి తెలిసిపోయింది, ఇప్పటి వరకూ ఓ లెక్క ఇకపై మరోలెక్క
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 15 మంగళవారం 1300 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…
కార్తీకదీపం మార్చి 15 మంగళవారం ఎపిసోడ్
సౌందర్య ఫ్యామీలీ అంతా కలసి దీప-కార్తీక్-హిమకి పిండం పెడతారు. ఎవరికి వారే వాళ్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు. మరోవైపు మోనిత కూడా కొడుకుతో కార్తీక్ కి పిండం పెట్టిస్తుంది. నేను ఏం చేసినా అది నీకోసం, నీకోసం చావుకి కూడా ఎదురెళ్లాను కానీ నన్ను, నా బిడ్డని అన్యాయం చేసి ఇలా చావుతో వెళ్లిపోతావ్ అనుకోలేదు అనుకుంటుంది. అంతా అక్కడి నుంచి వచ్చేస్తారు.
Also Read: జగతిని కాలేజీ నుంచి పంపించేయడమే సమస్యకు పరిష్కారమా
మోనిత: ఇంటికి చేరుకున్న మోనిత కార్తీక్ ఫొటో చూస్తూ తనతో హ్యాపీగా స్పెండ్ చేసిన సంఘటనలు గుర్తుచేసుకుంటుంది. నా భర్త అడుగుజాడల్లో నడుస్తానంటూ తన ఆస్తిని, బిడ్డని మొత్తం లక్ష్మణ్ కి అప్పగిస్తుంది. నా కార్తీక్ బతికి ఉన్నప్పుడు ఎప్పుడు నా ఇంటికి రాకపోయినా నేను లేని సమయంలో అయినా నా కార్తీక్ ఆత్మ ఇంటికి వచ్చి బాధపడితే నాకు అదే చాలంటుంది. బస్తీలో ఎవ్వరూ లేరేంటని మోనిత అడగడంతో ఈ మూడు రోజులూ డాక్టర్ బాబు కార్యక్రమాలు కదా అంటారు. బాబుని తీసుకోండని తీసుకోమని చెబితే...మీకు డాక్టర్ బాబు మిగిల్చిన గుర్తు కదమ్మా వదిలిపెట్టి ఎలా ఉంటారని క్వశ్చన్ చేస్తారు లక్ష్మణ్,అరుణ. ఆ మాటలకు స్పందించిన మోనిత.... నాకు జీవితాంతం మిగిలిపోయే జ్ఞాపకాలు కార్తీక్ తో ఉన్నాయి చాలు... నా బిడ్డను ఈ బస్తీకి దూరంగా తీసుకెళ్లి పెంచండి...నా విలువైన జ్ఞాపకాన్ని మీపై నమ్మకంలో మీకు వదిలేసి వెళుతున్నా అని చెప్పి మోనిత వెళ్లిపోతుంది. ( సీరియల్ నుంచి కూడా వెళ్లిపోయినట్టే)
Also Read: హిమ-శౌర్యని నడిపించనున్న పచ్చబొట్టు, ఇకపై కథ వేరేఉంటది
అటు సౌందర్య ఇంట్లో అంతా ఏడుస్తూ కూర్చుంటారు. చిక్ మంగుళూరు నుంచి ఎట్టకేలకు హైదరాబాద్ చేరిన హిమ ఇంటికి వెళుతుంటుంది.
సౌందర్య: మీరిలా నవ్వుతూ ఉంటే చూడాలి అనుకున్నా కానీ మీ నవ్వు ఫొటోలకే పరిమితమైందేంటిరా... మాకు కన్నీళ్లు మిగిల్చి మీరు ఇలా మా కంటికి కనిపించనంత దూరంగా వెళ్లిపోయార కదరా ...మేం ఏం పాపం చేశాం, చివరి చూపు కూడా చూసుకోకుండా చేశారు . మనుషుల మధ్య సంతోషం ఉండదని మనుషులే లేని చోటుకి మీరు మాత్రమే వెళ్లిపోయారా, ఏంటి దీపా ఎంత స్వార్థపరురాలివే నువ్వు అత్తమ్మా అంటూ అన్నీ నాతో చెప్పుకునే దానివి, అలాంటిది కార్తీక్ నీకు దగ్గర కాగానే నాకు దూరంగా తీసుకెళ్లిపోతావా అంటుంది. నా బిడ్డ తోడుంటే చాలని వెళ్లిపోతావా...
శౌర్య: మరోవైపు శౌర్య చిక్ మంగుళూరులో జరిగిన సంఘటనలు తలుచుకుంటుంది. అమ్మా-నాన్న పక్కన దీని ఫొటో ఎందుకని తీసేసి విసిరేస్తుంది. అప్పుడే ఎంటరైన హిమ కాళ్ల దగ్గర పడుతుంది.
రేపటి ( బుధవారం) ఎపిసోడ్ లో
అమ్మా నాన్నని మింగేసిన భూతం అది...దాని గుర్తులు ఏవీ ఇంట్లో ఉండకూడదు. అమ్మా నాన్నని మింగేసిన రాక్షసి అది నాకు ఎప్పటికీ కాదు..నేను హిమని వదిలిపెట్టను...మళ్లీ ఇంట్లో దాని పేరు ఎవ్వరు ఎత్తినా నేను మీకు దక్కను అంటుంది శైర్య. ఆ మాటలు విన్న హిమ ఇంట్లోకి అడుగుపెట్టకుండా బయటకు వెళ్లిపోతుంది. నేరుగా మోనిక ఇంటికి వెళుతుంది హిమ. అక్కడ కార్తీక్, మోనిత కలసి పూజ చేసిన ఫొటో, మోనిత చేతిలో ఆనంద్ ఫొటో చూసి షాక్ అవుతుంది.