Guppedantha Manasu మార్చి 14 ఎపిసోడ్: జగతిని కాలేజీ నుంచి పంపించేయడమే సమస్యకు పరిష్కారమా
గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.కాలేజీలో రూమర్స్ కి చెక్ పెట్టేలా ఏదో ఒకటి చేయండని రిషి అన్నా..జగతి మాత్రం నిర్ణయాన్ని రిషికే వదిలేస్తుంది.మార్చి 14 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు (Guppedantha Manasu ) మార్చి14 సోమవారం ఎపిసోడ్
జగతి తన రూమ్ లో కూర్చుని ఉండగా..రిషి సార్ ఈ ఫైల్ చెక్ చేయమన్నరంటూ ప్యూన్ ఇస్తాడు. ఇందులో వేరే పేపర్లు వచ్చాయి రిషి సార్ కి తిరిగివ్వు అనేసి...నేను ఇస్తానులే అంటుంది జగతి. మరోవైపు క్లాస్ టైం అయింది ఇంకా రిషి సార్ రాలేదేంటి అన్న వసుతో...నువ్వెళ్లి క్లాస్ తీసుకో అంటుంది పుష్ప. ఇంతలో పుష్ప సెల్ కి రిషి నుంచి మెసేజ్ వస్తుంది. వసు నిన్ను క్లాస్ తీసుకోమని చెప్పారంటుంది. ఆయన నాకు మెసేజ్ చేయకుండా నీకెందుకు మెసేజ్ చేశారో అంటూ విసుక్కుంటూ వెళ్లి క్లాస్ స్టార్ట్ చేస్తుంది.
Also Read: హిమ-శౌర్యని నడిపించనున్న పచ్చబొట్టు, ఇకపై కథ వేరేఉంటది
అటు లైబ్రరీలో కూర్చున్న రిషి...లెక్చరర్ల గుసగుసలు, ప్రశ్నలు గుర్తుచేసుకుంటాడు. డీబీఎస్టీ కాలేజీలో ఇదో మరకగా మిగిలిపోతుందా, అందరూ గుచ్చి గుచ్చి చూస్తుంటే తట్టుకోగలనా, డాడ్ కి డైరెక్టర్ గా ఉన్న గౌరవం తగ్గిపోతుందా అని బాధపడుతాడు. ఇంతలో జగతి అక్కడకు రావడంతో... మీరు కాలేజీకి అని రిషి అనగానే...
జగతి: కాలేజీకి రాననుకున్నారా సార్.. బాధ్యత-బంధం రెండింటినీ ఒక్కోసారి వేర్వేరుగా చూడాల్సి వస్తుంది. కాలేజీలో పని చేయడం నా బాధ్యత, ఇక రెండోది దైవనిర్ణయం.
రిషి: ఇంతలో టీ కావాలా, కాఫీ కావాలా అని లైబ్రేరియన్ వచ్చి అడగడంతో మీ పని చేయండి, మీకు అవసరం లేనివాట్లో జోక్యం చేసుకుంటున్నారెందుకు, ఎవరి పని వారు చేయండి, మీకు అప్పగించిన పనిని సిన్సియర్ గాచేయండి, అవసరం లేనివాట్లో జోక్యం చేసుకోకండి, అర్థమైంది అనుకుంటా అంటూ రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
లైబ్రేరియన్: నేను ఏమన్నానని అంత కోపం
జగతి: ఆ మాటలు మిమ్మల్ని కాదు నన్ను అనుకుంటుంది
Also Read: జగతి విషయంలో రిషి నిర్ణయాన్ని తప్పుబట్టిన వసుధార, మహేంద్ర రియాక్షన్ ఏంటి
కోపంగా బయటకు వచ్చిన రిషి...ప్రశాంతత కోసం లైబ్రరీకి వెళితే అక్కడకు వచ్చారు అనుకుంటూ వచ్చి వసుధారకి డ్యాష్ ఇస్తాడు. వసు చేతిలోంచి జారిపడిన ఫొటోలు చూసి...షార్ట్ ఫిలిం ఫొటోలు నువ్వెందుకు తీశావ్ అని అడుగుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఆర్టికల్స్ రాసినవారు ఫొటోలు అడిగారు అందుకే తీయించాను. మీటింగ్ లో చూపిద్దామని తీసుకొస్తున్నా అంటే... ఈ ఫొటోలు నా క్యాబిన్లో పెడతాను, మీటింగ్ లో వీటి ప్రస్తావన తీసుకురావొద్దని వెళ్లిపోతాడు.
మీటింగ్ రూమ్ లో కూర్చుంటారంతా...
జగతి: మిషన్ ఎడ్యుకేషన్ కి అందరి నుంచీ ప్రశంసలు వస్తున్నాయి..పత్రికల వాళ్లు మన కాలేజీని గొప్పగా పొగిడారు, ఇదంతా రిషిసార్ కి చెందుతుంది..థ్యాంక్యూ సార్
లెక్చరర్: రిషి సార్ ఇంత చిన్న వయసులో ఇన్ని సాధిస్తుంటే గ్రేట్ అనుకున్నాం....దీనికి కారణం మీరే...
జగతి: ఇందులో నా గొప్పతనం ఏముంది...
లెక్చరర్: మీ తెలివి తేటలే వచ్చాయి, మీరు గోల్డ్ మెడలిస్ట్-రిషి సార్ గోల్డ్ మెడలిస్ట్, మీకు మ్యాథ్స్ ఇష్టం, రిషి సార్ కి మ్యాథ్స్ ఇష్టం... అన్నింటికీ మీరే కారణం...
వసుధార: ఇలా అందరూ చెబితే మేడం గొప్పతనం తెలుస్తుంది అనుకుంటుంది వసుధార
మహేంద్ర: జగతి ఓవైపు పిలుస్తున్నా...చెప్పనీ జగతి..దాచిపెట్టాల్సిన అవసరం లేదు
లెక్చరర్: మీ ప్రవర్తనా విధానమే రిషి సార్ కి వచ్చింది
జగతి: మనం కాలేజీ టాపిక్ వదిలేసి వేరే టాపిక్ మాట్లాడుతున్నారు
రిషి: నాకు పని ఉంది ...మీటింగ్ అయిపోయిన తర్వాత మొత్తం డీటేల్స్ నాకు మెయిల్ చేయండి అనేసి వెళ్లిపోయి మెట్లపై కూర్చుంటాడు. ఇంతలో వసుధార రావడంతో నువ్వు వస్తావని నాకు తెలుసు, క్లాస్ వేస్తావా ఇప్పుడు
వసుధార: నేను అందుకోసం రాలేదు...అయినా మీకు నేను ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదు, సరదాగా నా బాల్యంలో సంఘటనలు మాత్రమే చెప్పాను
రిషి: అన్నీ కలిపి కొడతావ్ కదా...కొటేషన్స్, సూచనలు ఇలా అన్నీ నువ్వే చెబుతావ్ కదా
వసుధార: ఎవరేం చెప్పినా మనకంటూ ఓ ఆలోచన, విజన్ ఉంటుంది కదా...
రిషి: అంటే నాకు విజన్ లేదనా
వసుధార: నా పరిధి మేరకే నేను మాట్లాడతాను
రిషి: నువ్వు మాట్లాడుతున్నావో, తెరవెనుక మీతో మాట్లాడిస్తున్నారో
వసుధార: అలా ఎలా మాట్లాడతారు, మేడం ఎప్పుడూ అలా చెప్పరు
రిషి: అవును ఇన్నాళ్లూ నువ్వు మాట్లాడావు, ఇకపై ఈ కాలేజీలో మాట్లాడతారు
వసుధార: ఈ టాపిక్ వదిలేయండి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుదాం
రిషి: మిషన్ ఎడ్యుకేషన అన్నా మళ్లీ ఆవిడగారి గురించే మాట్లాడాలి, ఇప్పుడు నేనేం మాట్లాడలేను... ఆవిడ గారి గురించి , ఆ ప్రాజెక్ట్ గురించి అస్సలు మాట్లాడను
ఇదంతా చూసిన జగతి...మహేంద్ర రిషి ఎందుకో కోపంగా వెళుతున్నాడు ఎందుకో అడుగు అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన రిషి...తల్లిదండ్రులు ఇద్దరూ పక్కపక్కన నిల్చోవడం చూసి పిలిచినా పలకకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆపు మహేంద్ర అంటే...వెళ్లనీ జగతి ఇవన్నీ రిషికి తెలియాలి, నువ్వింకా అపురూపంగా రిషిని చూసుకోవద్దు, ప్రతి విషయాన్ని దాచుతూ రావడమే మనం చేసిన తప్పు అంటాడు మహేంద్ర. ఆ తెలుసుకునేది ఏదో బాధపడుతూ తెలుసుకోవాలా అని జగతి అంటే... కిందపడనిదే సైకిల్ తొక్కడం రానట్టే..వాడికి జీవితం అనే ప్రయాణం ఇప్పుడే మొదలైంది జగతి అంటాడు. వసుధార ఏం జరిగిందని జగతి అడిగితే..రిషి సార్ కోపానికి పెద్ద పెద్ద కారణాలు కావాలా అంటుంది.
మంగళవారం ఎపిసోడ్ లో
వసుధార పొద్దున్నే కాలేజీకి త్వరగా రా నీతో పనుందన్న మెసేజ్ చూస్తుంది. ఎందుకు సార్ రమ్మన్నారని అడగ్గా వసుధార చేతిలో ఓ లెటర్ పెట్టి మీ మేడంకి ఇవ్వు అంటాడు. ఆ లెటర్ చూసిన జగతి సీట్లోంచి లేచి వెళ్లిపోతుంది. ఏం జరిగిందో అర్థంకాని వసుధార ఆ లెటర్ చదివి తిరిగి రిషి దగ్గరకు వెళ్లి ఏంటి సార్ ఇది అని ప్రశ్నిస్తుంది. చదవలేదా, అర్థంకాలేదా అన్న రిషితో అర్థమైంది, మీ మనసులో ఏముందో అర్థమైంది అంటుంది.