Karthika Deepam మార్చి 21 ఎపిసోడ్: ఒకరు ప్రకృతి-మరొకరు ప్రళయం, హిమ-శౌర్యగా కీర్తి కేశవ్ భట్, అమూల్య గౌడ ఎంట్రీ

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 21 సోమవారం 1305 ఎపిసోడ్ సరికొత్తగా మొదలైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

FOLLOW US: 

కార్తీకదీపం మార్చి 21 సోమవారం ఎపిసోడ్

శౌర్య ఇంట్లో కనిపించకపోవడంతో  ఇల్లంతా వెతుకుతారు. కట్ చేస్తే ఓ రోడ్డుపై నడుస్తుంటుంది శౌర్య. అమ్మానాన్న చావుకి కారణం అయిన హిమతో కలసి నేను ఉండలేను అందుకే నేను బయటకు వచ్చేశాను అనుకుంటుంది. నేను ఎక్కడికి వెళ్లాలి, బస్తీకి వెళ్లి వారణాసిని కలిస్తే...అమ్మో వద్దులే మళ్లీ నాన్నమ్మకి చెబుతాడు అనుకుంటుంది. మధ్యలో ఓ బండిని లిఫ్ట్ అడిగి సిటీ ఔట్ కట్స్ కి వెళ్లిపోతుంది. అటు సౌందర్య ఇంట్లో శౌర్య రాసిన లెటర్ తీసుకొస్తాడు ఆదిత్య. 

శౌర్య రాసిన లెటర్: నానమ్మా నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నాను, నన్ను వెతకొద్దు, అమ్మా-నాన్నని చంపిన హిమ ఉన్న ఇంట్లో నేను ఉండలేను. అందుకే నేనే వెళ్లిపోతున్నాను.  నా కళ్లముందు అమ్మా-నాన్నని హిమ చంపేసింది నానమ్మా, తన మొహం చూడటం కూడా నాకిష్టం లేదు..తనని చూస్తూ నేను ఉండలేను, తనని చూసిన ప్రతీసారీ అమ్మా-నాన్న చావే గుర్తొస్తోంది అందుకే నేను వెళ్లిపోతున్నాను..మళ్లీ చెబుతున్నాను నాకోసం వెతకొద్దు, వెతికేందుకు ప్రయత్నిస్తే నాపై ఒట్టే... అదివిన్న హిమ..తప్పుచేసింది నేనైతే నువ్వెళ్లిపోవడం ఏంటి శౌర్య అని ఏడుస్తుంది. నానమ్మా అమ్మా-నాన్నా చావుకి నేనే కారణం అని హిమ ఏడుస్తుంది. కారు తీయరా అది ఎటువెళ్లిందో ఏంటో అంటుంది సౌందర్య.

Also Read: 24 గంటలు డెడ్ లైన్, రిషి-మహేంద్రలో తగ్గేదెవరు-నెగ్గేదెవరు

ఇంద్రుడు-చంద్రమ్మతో శౌర్య: మరోవైపు శౌర్య వెళుతున్న బండిని ఆపిన కొందరు పిల్లలు అనాధలకోసం చందాలు అడుగుతారు. వాళ్లని చూసిన శౌర్య..వీళ్లలాగే నేను కూడా అనాధనే అందుకే వీళ్లతో వెళ్లిపోతాను అనుకుంటూఇ దిగుతుంది. బండిపై నుంచి దించిన తర్వాత పర్స్ చెక్ చేసుకుని నువ్వు దొంగపిల్లవేమో అని డబ్బులు చూసుకుంటున్నాం  అంటాడు. ఇంకోసారి అలా అనొద్దంటూ రాయి విసిరి కొడుతుంది. మరోవైపు చంద్రమ్మ ( హిమని కాపాడి హైదరాబాద్ చేర్చిన జంట) ఓ షాప్ దగ్గర ఓ హ్యాండ్ బ్యాగ్ లోంచి డబ్బులు కొట్టేస్తుంది. అధి చూసిన శౌర్య చంద్రమ్మని నిలదీస్తుంది. ఎంత కొట్టేశావ్ అని అడిగితే ఏవేవో చెబుతుంది చంద్రమ్మ. అవన్నీ ఎందుకు ఎంత కొట్టేశావ్ అంటే 500 అని చెబితే వంద ఇటు ఇవ్వు అని అడిగి తీసుకుంటుంది. మిగిలిన నాలుగు వందలు తీసుకొచ్చి ఇంద్రుడికి ఇస్తుండగా మరో వంద లాక్కుంటుంది శౌర్య. నన్ను ముదురు అన్నావ్ కాబట్టి ఇది తీసుకుంటున్నా అంటుంది. ఆ రెండు వందలు తీసుకెళ్లి అనాధపిల్లల కోసం కలెక్ట్ చేస్తున్న డబ్బాలో చందాగా వేస్తుంది. పోలీసుల నుంచి తప్పించుకుని వచ్చేసిన  ఇంద్రుడు-చంద్రమ్మ ..మనం తప్పించుకున్నాం కానీ మరి ఆ పాప పరిస్థితి ఏంటని తలుచుకుంటారు. శౌర్య మాత్రం పదే పదే యాక్సిడెంట్ విషయం తలుచుకుంటుంది. అటు సౌందర్య, ఆదిత్య, హిమ కలసి శౌర్యని వెతుకుతుంటారు. శౌర్య వెనుకే హిమ, ఇంద్రుడు-చంద్రమ్మ వెనుక పోలీసులు పరిగెత్తుతుంటారు. ఇంద్రుడు-చంద్రమ్మతో పాటే శౌర్య కూడా బస్సెక్కి వెళ్లిపోతుంది. సౌందర్య కారుతో పాటూ బస్ ని ఫాలో అవుతారు. బస్ కి కారు అడ్డంగా పెట్టి వెతికినా దొరకదు. శౌర్య కావాలనే మనకు దూరంగా వెళ్లిపోయిందని ఏడుస్తుంది సౌందర్య.

కొన్నేళ్ల తర్వాత...
సౌందర్య ఇంట్లో హిమ పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి. హీరోయిన్ లెవెల్లో హిమ ( మనసిచ్చి చూడు భాను(కీర్తి భట్)) ఎంట్రీ ఇస్తుంది. సౌందర్య గెటప్ కూడా మారుతుంది. అమ్మా నాన్న చావుకి కారణం నేనే... వారి చివరి కోరిక మనం కలసి ఉండాలని..అందుకే నేను వెతుకుతూనే ఉన్నాను, నేను తప్పుచేసిన ఫీలింగ్ నాతోపాటూ పెరిగి పెద్దది అవుతోంది నిన్ను కలిస్తే కానీ అది పోదేమో శౌర్య అని కన్నీళ్లు పెట్టుకుంటుంది హిమ. నానమ్మ శౌర్య ఎప్పడు కనిపిస్తుందని అడిగితే...నిద్రపోయేవాళ్లని లేపొచ్చు కానీ నిద్ర నటించేవారిని లేపలేం అన్నట్టు శౌర్య కావాలనే దొరక్కుండా తిరుగుతోంది..అంతా వెయిట్ చేస్తున్నారు కేక్ కట్ చేద్దువుగాని పద అంటుంది సౌందర్య. హిమ-శౌర్య రెండు కేకులూ హిమ కట్ చేస్తుంది. 

Also Read:''వదిలేదేలే'' అన్న శౌర్య, అక్కని ఎలాగైనా ఇంటికి తీసుకొస్తానన్న హిమ, కొత్త పాత్రలతో సరికొత్తగా

హిమ బావగా మానస్ ఎంట్రీ
హ్యాపీ బర్త్ డే డాక్టర్ హిమ అంటూ సౌందర్య మనవడు నిరుపమ్ ( మానస్) ఎంట్రీ ఇస్తాడు. శౌర్య ఫొటోనే చూస్తుండిపోయిన హిమని చూస్తూ..నేను ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాను శౌర్య ఎక్కడుందో ఏమో నిరుపమ్ అంటుంది. శౌర్య నన్ను క్షమిస్తుందా అని అడుగుతుంది. ఎప్పటికైనా శౌర్యని కలుస్తా నిరుపమ్.. తనిప్పుడు ఎలా ఉందో మనకు తెలియదు కదా హిమా..పాత ఫొటోతో వెతుకుతున్నాం...తను ఎలా ఉందో తెలియకపోయినా తన చేతిపై నా పేరులో మొదటి అక్షరం ఉంటుందని చెబుతుంది. 

శౌర్య గా అమూల్య గౌడ ఎంట్రీ
అక్కడ శౌర్య ఎవడినో కొడుతూ హీరో స్టైల్లో ఎంట్రీ ఇస్తుంది.  ఎందుకు కొట్టావ్ అని అడిగితే... ఏరా వస్తావా అంటావా ఏంట్రా వచ్చేది,  ఏమనుకుంటున్నావ్..అమ్మాయి ఆటో నడిపితే ఇంత చులకనా అని వాయించేస్తుంది. నువ్వు కావాలనే అన్నావని నాకు తెలసు..అడ్డంగా మాట్లాడితే నీపై అడ్డంగా ఆటో ఎక్కించేస్తా అంటుంది. సారీ అక్కా అనగానే వాడి కాలర్ వదిలేసి ( హిమతో గడిపిన క్షణాలు గుర్తుచేసుకుని) మళ్లీ చితక్కొడుతుంది. అక్కా, చెల్లి అనే పదాలు, ఆ బంధాలు నచ్చవ్ అంటుంది. వదిలేదే లే అని ఆటోపై రాయించుకుని మరీ కొడుతోంది ఇదేదో కొత్త కాన్సెప్ట్ లా ఉందే అనుకుంటాడు. 

Published at : 21 Mar 2022 09:24 AM (IST) Tags: karthika deepam latest episode కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Vantalakka కార్తీకదీపం Nirupam Paritala premi viswanathSobha Shetty Karthika Deepam 21th March Episode 1305

సంబంధిత కథనాలు

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు 

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు

టాప్ స్టోరీస్

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Stock Market Weekly Review: హ్యాపీ.. హ్యాపీ! 2000 లాభపడ్డ సెన్సెక్స్‌ - ఇన్వెస్టర్లకు రూ.10 లక్షల కోట్ల లాభం

Mla Balakrishna : ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ

Mla Balakrishna :  ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే ఈ తిప్పలు, వైసీపీ గుడిని గుడిలో లింగాన్ని మింగేస్తుంది - ఎమ్మెల్యే బాలకృష్ణ

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!

Airtel Network Issue: ఎయిర్‌టెల్ వినియోగదారులకు నెట్‌వర్క్ సమస్యలు - మొబైల్ డేటా కూడా పనిచేయడం లేదట!