అన్వేషించండి

Karthika Deepam మార్చి 22 ఎపిసోడ్: తనను పెంచిన తల్లిదండ్రుల పనికోసం శౌర్య మళ్లీ సౌందర్య ఇంటికి వెళుతుందా

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 22 సోమవారం 1306 ఎపిసోడ్ సరికొత్తగా మొదలైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

కార్తీకదీపం మార్చి 22 మంగళవారం ఎపిసోడ్

ఆటో డ్రైవర్ గా ఎంట్రీ ఇచ్చిన శౌర్య వేరేవాడిని చితక్కొడుతుంది. ఈ ఆటోపై వదిలేదేలే అని రాశారంటే ఎవర్ని నాలాంటి వాళ్లనా అని అడిగితే... మళ్లీ యాక్సిడెంట్ విషయం, హిమ గురించి తలుచుకుంటుంది శౌర్య ( అమూల్య గౌడ). అమ్మా-నాన్నల్ని చంపేసిన హిమని వదిలేదేలే అనుకుంటుంది. మీ పేరేంటి అని అడిగితే 'జ్వాల' అని చెబుతుంది ( శౌర్య పేరుని జ్వాలగా మార్చుకుందన్నమాట). ఎక్కడున్నావ్..నిన్ను వదిలేదే లే అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 

అటు హిమ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. ఇంతలో మరో హీరో ఎంట్రీ ఇస్తాడు. ఇంకెవరు సౌందర్య మనో మనవడు ప్రేమ్ అన్నమాట. ఏంటి ప్రేమ్ అని హిమ మొదలెట్టేలోగా.. నువ్వేమంటావో నాకు తెలుసు, ఇంత లేటా అని అడుగుతావ్ అంతేగా అంటాడు. మీ అన్నదమ్మలు ఇద్దరూ చెరోదగ్గర ఉంటున్నారు, మీరైనా అమ్మా-నాన్నని కలపొచ్చుకదా అని సౌందర్య అంటే.. వాళ్లని కలిపే ప్రయత్నంలో మా ఇద్దరి మధ్యా గొడవలు వస్తాయేమో అంటారు ప్రేమ్-నిరుపమ్.   అక్కడకు వచ్చిన గెస్టులు రెండు కేకులు చూసి ఒక బర్త్ డేకి రెండు కేకులు ఉన్నాయేంటి అని అడుగుతారు... అది మా ఇంకో మనవరాలు కోసం అని సౌందర్య చెబితే..శౌర్య నా సిస్టర్ అంటుంది హిమ. శౌర్య నన్ను బాగా చూసుకునేది, తన ఆలోచనలు నాకన్నా ముందుండేవి అందుకే తను నాకు అక్క అని రిప్లై ఇస్తుంది హిమ. పలకరింపులు అయ్యాక  కేక్ కట్ చేస్తుంది హిమ. 

Also Read: జగతి కోసం మహేంద్ర డేరింగ్ స్టెప్, రిషి రియాక్షన్ ఎలా ఉండబోతోంది
అటు శౌర్య ( జ్వాల) బర్త్ డేని ఆటో వాళ్లంతా కలసి సెలబ్రేట్ చేయాలి అనుకుంటారు. కానీ ఇవన్నీ నాకు ఇష్టం లేదంటుంది జ్వాల. నేను పుట్టిన రోజే ఆ హిమ కూడా పుట్టింది అది ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే రోజు నేను ఆనందంగా ఉండడం నాకు నచ్చదు అనుకుంటుంది. ఇప్పుడీ కేక్ అంతా తినేయండి..రేపు నేను సెలబ్రేట్ చేసుకుంటా అంటుంది. అంతా బతిమలాడడంతో కేక్ కట్ చేస్తుంది శౌర్య అలియాస్ జ్వాల. ఆటోవెనుక వదిలేదేలే అని రాసిఉండడంపై చర్చించుకుంటారంతా. 

Also Read: ఒకరు ప్రకృతి-మరొకరు ప్రళయం, హిమ-శౌర్యగా కీర్తి కేశవ్ భట్, అమూల్య గౌడ ఎంట్రీ
కట్ చేస్తే జైల్లోంచి విడుదలవుతారు ఇంద్రుడు, చంద్రమ్మ.  ఎంతమంది మనుషులో రంగంలోకి దిగుదామా అంటుంది చంద్రమ్మ. జైల్లోంచి విడుదలైన సందర్భంగా నాకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వు, షాపింగ్ చేయించవా అని అడుగుతుంది. జైల్లో నాలుగు వేలు వెనకేశాం, మరో ఆరువేలు కావాలి పదివేలు ఉంటే పాపకి దిద్దులు కొనిద్దాం అంటుంది. అలవాటు పోయినట్టుంది చేయి వణుకుతోందంటాడు ఇంద్రుడు. చంద్రమ్మ డబ్బులు కొట్టేసి పర్స్ మళ్లీ జేబులో పెడుతుండగా జ్వాల వచ్చి పట్టుకుంటుంది. తీరా వాళ్లు కొట్టేసిన పర్స్ జైల్లో అధికారిది. దొంగతనం మానేసి బుద్ధిగా బతకండి అని చెబుతాడు. పర్స్ పడిపోందో, కొట్టేశారో నాకు తెలుసు లోపలకు పదండి అంటాడు. అడ్డుపడిన జ్వాల విడిపిస్తుంది. నువ్వెంతో ఆదర్శనవంతంగా ఉంటావ్...కానీ వీళ్ల కడుపున నువ్వెలా పుట్టావ్ అంటాడు ( శౌర్యని చిన్నప్పటి నుంచీ పెంచింది వీళ్లే). నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు వాళ్లకు వంటచేసే భార్య-భర్త కావాలంట వీళ్లని అక్కడ పనిలో పెట్టు అని సలహా ఇస్తాడు జైలర్. ఆటో వెనుక వదిలేదేలే అని ఉండడం చూసి జైలర్ కూడా అడుగుతాడు... ఎపిసోడ్ ముగిసింది...

టాప్ హెడ్ లైన్స్

Train Release Date: డిసెంబర్‌లో 'ట్రైన్' రిలీజ్... నితిన్, నాగచైతన్యకు పోటీగా విజయ్ సేతుపతి
డిసెంబర్‌లో 'ట్రైన్' రిలీజ్... నితిన్, నాగచైతన్యకు పోటీగా విజయ్ సేతుపతి
Godavari Serial Today October 13th: 'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
'గోదావరి' సీరియల్: సూర్యని లవ్ చేసి నాకు ఎలా ఐలవ్‌యూ చెప్తావ్? జానుపై సంజు ఫైర్! 50 వేలు కోసం నందు, గౌతమిల గొడవ!
Hide & Silk: రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
రొమాంటిక్ ఫిల్మ్ 'హైడ్ అండ్ సిల్క్'లో హీరోగా సుహాస్... ప్రోమో రిలీజ్
Aishwarya Pisse Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం
విడాకులు తీసుకున్న సీరియల్ హీరోయిన్... భర్తకు దూరమై ఏడాది, ఇప్పుడు వేరు కాపురం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget