Karthika Deepam మార్చి 23 ఎపిసోడ్: మేనత్త ఇంట్లో హిమకి అవమానం, మావయ్య ఇంటికి చేరిన శౌర్య-అసలు కథ ఇప్పుడే మొదలైంది
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 23 బుధవారం 1307 ఎపిసోడ్ సరికొత్తగా మొదలైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…
కార్తీకదీపం మార్చి 23 బుధవారం ఎపిసోడ్
నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు వాళ్లకు వంటచేసే భార్య-భర్త కావాలంట వీళ్లని ( ఇంద్రుడు-చంద్రమ్మ) అక్కడ పనిలో పెట్టు అని జ్వాల(శౌర్య)కి సలహా ఇస్తాడు జైలర్. ఆటో వెనుక వదిలేదేలే అని ఉండడం చూసి జైలర్ కూడా అడుగుతాడు. తప్పుచేస్తే ఎవ్వర్నీ వదిలేదేలే అని అలా రాశా అంటుంది. కేడీ దంపతుల్లారా మీ అమ్మాయిని చూసి బుద్ధి తెచ్చుకోండి అని చెబుతాడు జైలర్. మరోవైపు హిమ హాస్పిటల్లో అందరికీ స్వీట్స్ పంచుతుంది. ఇంతలో వెనుక నుంచి శౌర్య అని పిలుపు వినిపించడంతో ఆనందంగా హాస్పిటల్ అంతా వెతుకుతుంది హిమ. బయట ఓ మహిళ బాయ్ శౌర్య అనడంతో వచ్చి ఆరా తీస్తుంది. ఆమె ఎక్కడుందో అడ్రస్ చెప్పమని అడిగి తీసుకుంటుంది.
జ్వాల-హిమ: అటు జ్వాల ఆటో నడుపుతూ హిమ వల్ల తల్లిదండ్రులు చనిపోయిన విషయం గుర్తుచేసుకుని ఆ హిమని వదిలేదేలే అనుకుంటుంది. బస్తీలో అమ్మా-నేను ఎన్నో కష్టాలు పడ్డాం, నాన్న కలసిన ఆనందం కొద్దిరోజులైనా లేకుండా చేసింది, మొదట్నుంచీ అది తాతయ్య,నానమ్మ దగ్గర ఆనందంగా పెరిగింది...నేనే అందరికీ దూరమయ్యాను, నన్ను అందరి ప్రేమకి దూరం చేసి ఆ హిమ మాత్రం అందరితోనూ కలసి ఉంటోంది...ఎన్ని సంవత్సరాలైనా హిమపై కోపం తగ్గదు, పైగా రోజురోజుకీ పెరుగుతుంది..హిమా నిన్ను వదిలేదే లే అంటుంది. అటు శౌర్య అడ్రస్ తెలిసిన ఆనందంలో తనని కలిసేందుకు వెళుతుంటుంది. చిన్నప్పటి నుంచీ శౌర్యతో కలసి ఆడుకున్న రోజులు గుర్తుచేసుకుంటుంది. శౌర్య అనవసరంగా ఇంట్లోంచి వెళ్లిపోయింది, నాపై తనకు కోపం ఇంకా ఉంటుందా అని హిమ అనుకుంటే..నీపై కోపం తగ్గదు గాక తగ్గదని శౌర్య అనుకుంటుంది. ఇంతలో కారు ఆగిపోవడంతో కంగారుగా కిందకు దిగుతుంది హిమ. అదే సమయానికి అక్కడకు వస్తుంది జ్వాల (శౌర్య). ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుంటారు...
Also Read: శత్రువైతే యుద్ధం చేయాలి-ఆప్తుడు అయితే దగ్గరుండి బతిమాలాలి, గుప్పెడంత మనసులో అలజడి
జ్వాల: రోడ్డు నీ తాతదా..కారు రోడ్డుకి అడ్డంగా ఆపావ్
హిమ: కారు రిపేర్
జ్వాల: కారు రిపేర్ అయితే రోడ్డు మధ్యలో ఆపాలా... ఎక్కడో చూసినట్టుందే ఎప్పుడైనా నా ఆటో ఎక్కిందా
హిమ: ఈమెని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ మీరు కారు మెకానికా......
జ్వాల: అవును..మీ కార్ రిపేర్ అని దేవుడు మెసేజ్ చేస్తే వచ్చేశాను అంటుంది
హిమ కూల్ గా మాట్లాడుతుంటే జ్వాల మాత్రం ఫైర్ అయినట్టు మాట్లాడుతుంది. కారు స్టార్ట్ అవుతుందిలే వెళ్లి స్టార్ట్ చేయి అని చెబుతుంది. థ్యాంక్స్ చెప్పిన హిమతో అవసరం లేదంటుంది. డబ్బులేమైనా కావాలా అంటే..ఎక్కువైతే ఎవరికైనా దానధర్మాలు చేయి అని చెబుతుంది జ్వాల. ఇద్దరూ ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోతారు. హాస్పిటల్లో మహిళ ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఆ ఇంటికి వెళుతుంది. లోపల నుంచి శౌర్య అని పేరు వినిపించడంతో ఇన్నాళ్ల తర్వాత శౌర్యని కలుసుకోబుతున్నా అనుకుంటూ సంతోషంగా లోపలకు వెళుతుంది. తీరా చూస్తే చిన్న పిల్ల కనిపించేసరికి శౌర్య దొరికిందని సంతోషపడ్డాను, పుట్టినరోజున బహుమతి ఇస్తావ్ అనుకుంటే ఇలా నిరాశపరిచావ్ ఏంటని బాధపడుతుంది. నువ్వు ఎవరని ఆ ఇంట్లో మహిళ అడగడంతో శౌర్య మా అక్క చిన్నప్పుడే ఇంట్లోంచి వెళ్లిపోయింది, తనని వెతుక్కుంటూ నేను ఇక్కడకు వచ్చానంటుంది. హాస్పిటల్ కి ఎందుకు వచ్చారని అడుగితే..పాపకి కడుపునొప్పి అని వచ్చానని చెబుతుంది. ఇంజెక్షన్ చేయిమని అడిగితే అమ్మో నాకు భయం అని వెళ్లిపోతుంది.
Also Read: తనను పెంచిన తల్లిదండ్రుల పనికోసం శౌర్య మళ్లీ సౌందర్య ఇంటికి వెళుతుందా
మరోవైపు శౌర్య...ఇంద్రుడు-చంద్రమ్మతో కలసి షాపింగ్ చేస్తుంది. ఆటో అడ్డంగా ఉండటం చూసి ఎవరీ ఆటోవాలా అనుకుంటాడు ప్రేమ్. ఏంటి ఆటోపై చెయ్యేశావ్ అంటూ వాదనకు దిగుతుంది శౌర్య. కారుకి అడ్డంగా పెడితే చెయ్యేంటి కాలేస్తా అంటాడు. కాసేపు ఇద్దరూ వాదించుకుంటారు. గొడవేంటని ఇంద్రుడు అడిగితే...ఆటో అడ్డంగా పెట్టి అడ్డంగా వాదిస్తోందంటాడు ప్రేమ్. మా అమ్మాయి ఇంతే నువ్వే కాస్త సర్దుకుపోవాలి..దానికి కోపం వస్తే అంతే అంటుంది చంద్రమ్మ. ప్రేమ్ ని గుర్తుపట్టిందో ఏమో షాకింగ్ గా చూస్తుంది జ్వాల అలియాస్ శౌర్య..... ఎపిసోడ్ ముగిసింది....
రేపటి ( గురువారం) ఎపిసోడ్ లో
నిరుపమ్..హిమని ఇంటికి తీసుకొస్తాడు. ఏమ్మా ఇంకా నీ డ్రైవింగ్ సరదా అలాగే కంటిన్యూ చేస్తున్నావా అని స్వప్న అంటుంది. అత్తయ్యా అని హిమ , అమ్మా అలా ఎలా మాట్లాడతావని నిరుపమ్ అంటారు. తోడబుట్టినవాడిని పోగొట్టుకున్నామ ఇంకెలా మాట్లాడతా అంటుంది స్వర్న. మరోవైపు డైల్ ఇచ్చిన అడ్రస్ కి వెళ్లిన జ్వాలకి అక్కడ ప్రేమ్ కనిపించడంతో మళ్లీ ఇద్దరూ వాదనకు దిగుతారు.