Karthika Deepam మార్చి 24 ఎపిసోడ్: హిమ-ప్రేమ్, జ్వాల(శౌర్య)-నిరుపమ్, కార్తీకదీపంలో సరికొత్త ప్రేమకథలు మొదలయ్యాయ్
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవడంతో ఇప్పుడు వాళ్ల చుట్టూ కథ నడుస్తోంది. మార్చి 24 గురువారం 1308 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.
కార్తీకదీపం (Karthika Deepam) మార్చి 24 గురువారం ఎపిసోడ్
ఆటో అడ్డంగా పెట్టిన జ్వాల(శౌర్య)తో ప్రేమ్ గొడవకు దిగుతాడు. ఇద్దరూ కాసేపు వాదించుకుంటారు. ఆ తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. సౌందర్య-ఆనందరావు-హిమ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. చిన్నప్పుడు దీప..తనకి శౌర్యకి అన్నం తినిపించిన విషయం గుర్తుచేసుకుంటూ అలాగే కూర్చుంటుంది హిమ. ఏమైందని సౌందర్య అడగడంతో ఏం లేదులే అనేస్తుంది. నిత్యం ఏదో లోకంలో ఉంటావేంటని సౌందర్య అంటే..చిక్ మంగుళూరులో జరిగిన సంఘటన హిమ పెద్దైనా కూడా వెంటాడుతోందంటాడు ఆనందరావు. ఇంతలో కాకి అరవడంతో... చిన్నప్పుడు శౌర్య చెప్పేది.. కాకి అరుపు వినగానే నాన్నొస్తారని ఆశగా ఎదురుచూసేదట అని...మళ్లీ శౌర్యతో సంతోషంగా ఉన్న సందర్భాలను గుర్తుచేసుకుంటుంది. శౌర్య ఎక్కడుందో ఎలా ఉందో అంటే... మన ప్రయత్నం మనం చేశాం కదా..ఇక దేవుడి దయ అని సౌందర్య అంటే..తను కావాలనే మనల్ని తప్పించుకుని తిరుగుతోందని నా అనుమానం అంటాడు ఆనందరావు. హిమ (keerthi keshav bhat) తినకుండానే ఏడుస్తూ వెళ్లిపోతుంది.
జైలర్ ఇచ్చిన ఫోన్ నంబర్ ద్వారా ఇంద్రుడు-చంద్రమ్మ పనికోసం ఓ ఇంటికి తీసుకెళుతుంది జ్వాల (amulya gowda). అది మరెవరి ఇల్లో కాదు..సౌందర్య అల్లుడు ఇల్లు...అంటే జ్వాలకి మావయ్య అన్నమాట. ఇంతలో ప్రేమ్ అక్కడకు రావడంతో మళ్లీ ఇద్దరూ వాదన పెట్టుకుంటారు. అసలు వీళ్లని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావ్ అని అడుగుతాడు. జైలర్ పంపిస్తే వచ్చారన్న తండ్రితో ...డాడ్ వీళ్లకి పనులివ్వడం లాంటి తప్పిదాలు చేయొద్దంటాడు. అసలేమైంది అంటే అని ప్రేమ్ తో జరిగిన గొడవ మొత్తం చెబుతుంది జ్వాల. ఆ తర్వాత కూడా ఇద్దరూ వాదనకు దిగుతుంటే అడ్డుపడిన మనోహర్ ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. వీళ్లని పనిలోకి తీసుకుంటే నేను ఒప్పుకోను అంటాడు ప్రేమ్. ఆల్రెడీ తీసుకున్నా కదా అనడంతో ..మీ డెసిషన్ నాకు నచ్చలేదంటాడు. మరోవైపు ఇంద్రుడు-చంద్రమ్మని ఉద్దేశించి వీళ్ల వాలకం చూస్తుంటే ఇల్లంతా ఊడ్చేసేట్టున్నారు అనుకున్న జ్వాల... వంటలు మా ఇంట్లో చేసి తీసుకొస్తాం అంటుంది. జైలర్ గా పనిచేసే మనోహర్ అంకుల్ నీకెలా తెలుసని ప్రేమ్ అడిగితే..సరదాగా మర్డర్ చేసి జైలుకి వెళ్లొచ్చాంలే అంటుంది.
Also Read: దగ్గరున్నప్పుడు విలువ తెలుసుకోలేం-దూరమయ్యాక తెలుసుకుని ఏమీ చేయలేం, మనసుని మెలిపెట్టే సన్నివేశం
అటు నిరుపమ్ (Manas)..హిమని ఇంటికి తీసుకెళతాడు. లోపలకు వచ్చేందుకు హిమ సంకోచిస్తుంటే రా అంటాడు నిరుపమ్. అత్తయ్య ఏం అంటుందో అనే భయం ఉంది నేను వెళ్లిపోతాను అనేస్తుంది. సోఫాలో కూర్చుని బుక్ చదువుతున్న స్వప్న..లోపలకి వచ్చిన హిమని చూసి నోటికి పదును మొదలెడుతుంది.
స్వప్న: ఏంట్రా లేటైంది
నిరుపమ్: హిమని కలిసొచ్చేటప్పటికి లేటైంది
స్వప్న: వచ్చేటప్పుడు కారు నువ్వు నడిపావా... తనతో డ్రైవ్ చేయించావా
నిరుపమ్: నేనే నడిపాను
స్వప్న: కొందరు సరదాగా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు తీసేశారు..
నిరుపమ్: ఏంటి మమ్మీ ఇలా మాట్లాడతావ్
స్వప్న: తోటబుట్టిన వాడిని పోగొట్టుకున్నా ఎలా మాట్లాడతాను.. ఏమ్మా హిమా బాగానే ఉన్నావా... బానే ఉంటావులే అందరకీ నీలాంటి అదృష్టం ఉండదు కదా...
నిరుపమ్: పాపం మమ్మీ తనని...
స్వప్న: తనని ఏమీ అనలేదు..నిన్ను జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను... ఎలా ఉన్నావమ్మా అని అడిగాను ఇది కూడా తప్పేనా ఏంటి...ఏమ్మా...ఇంకా నీ డ్రైవింగ్ సరదా అలాగే కంటిన్యూ చేస్తున్నావా, చేస్తూనే ఉంటావులే నీకు సరదాగానే ఉంటుంది..బంధాలు పోగొట్టుకున్న మాకు బాధగా ఉంటుంది...
హిమ: జరిగిన దానికి నేను ఇప్పటికీ కుమిలిపోతున్నాను..చచ్చిపోవాలి అనిపిస్తుంది అప్పుడప్పుడు
స్వప్న: ఏంటి హిమా..నువ్వెందుకు చావడం..నీ పని వేరే ఉందిగా..
హిమ: నేను చేసిన దానికి ఆరోజు నుంచీ ఈ రోజు వరకూ శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను..నా తప్పువల్ల రోజూ ఏడ్చేలా చేస్తూ శౌర్య ఇంట్లోంచి వెళ్లిపోయింది
స్వప్న: శౌర్య తెలివైందిలే మళ్లీ నువ్వు డ్రైవ్ చేస్తావని భయపడి పారిపోయినట్టుంది...
హిమ: అత్తయ్యా...
స్వప్న: నన్ను పదే పదే అలా పిలవకు..విడివిడిగా బతికే ఉన్నాం..టైం చాలా అయింది కానీ వెళ్లు హిమ..జాగ్రత్తగా వెళ్లు..అయిన నా పిచ్చికానీ నీకు జాగ్రత్తలు చెప్పడం ఏంటి.. నాకు మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి మాట్లాడటం రాదు..మీ నానమ్మలా... ఇంకోసారి మా ఇంటికి రాకపోతేనే సంతోషిస్తాను.... హిమ వెళుతుంది గుమ్మదాకా వెళ్లి గుడ్ నైట్ చెప్పేసి రా....
నిరుపమ్: సారీ హిమ మమ్మీ ఇలా మాట్లాడుతుందని ఊహించలేకపోయాను ..ఎపిసోడ్ ముగిసింది
Also Read: మేనత్త ఇంట్లో హిమకి అవమానం, మావయ్య ఇంటికి చేరిన శౌర్య-అసలు కథ ఇప్పుడే మొదలైంది
రేపటి ( శుక్రవారం) ఎపిసోడ్ లో
హాస్పిటల్ కి వచ్చిన జ్వాల(amulya gowda)ని చూసి చీప్ గా ఆటోలో వచ్చారా అని ప్రేమ్ (Manoj kumar)అనడంతో చీప్ గా ఏంటంటూ కాలర్ పట్టుకుంటుంది. కాలర్ పట్టుకుంటావా అని నెట్టేయడంతో కింద పడబోతున్న జ్వాలని పట్టుకుంటాడు నిరుపమ్ (Manas Nagulapalli).ఇంతలో అక్కడకు వచ్చిన హిమ(keerthi keshav bhat) ని చూసి ఏయ్ తింగరి నువ్వు ఇక్కడున్నావేంటని అడుగుతుంది జ్వాల. అసలు అమ్మాయిలు ఇలా ఉంటారా...మన డాక్టర్ హిమలా పద్ధతిగా ఉండాలంటాడు ప్రేమ్... అసలు అమ్మాయిలు ఇలాగే ఉండాలిరా తన యాటిట్యూడ్ నచ్చిందంటాడు నిరుపమ్. ఇంతలో అక్కడ కనిపించిన సౌందర్యని చూస్తూ అలాగే ఉండిపోతుంది జ్వాల.