అన్వేషించండి

Karthika Deepam మార్చి 25 ఎపిసోడ్: అప్పుడు డాక్టర్ బాబు-వంటలక్క, ఇప్పుడు డాక్టర్ సాబ్-ఆటో డ్రైవర్

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవడంతో ఇప్పుడు వాళ్ల చుట్టూ కథ నడుస్తోంది. మార్చి 25 శుక్రవారం 1309 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

కార్తీకదీపం (Karthika Deepam )మార్చి 25 శుక్రవారం ఎపిసోడ్

ఒంటరిగా కూర్చున్న జ్వాల (శౌర్య ) తన చేతిపై ఉన్న పచ్చబొట్టు చూసుకుంటూ జరిగినదంతా గుర్తుచేసుకుంటుంది. 
ఎక్కడున్నావ్ హిమా..నేను నీకోసం ఇంటికి వచ్చాను..ఇల్లు వదిలేసి వెళ్లిపోయారు అన్నారు.. అంటే నేనేం కావాలి అనుకున్నారు...నేను మీకు అవసరం లేదా..నా గురించి వెతకరా..నాపై ప్రేమ లేదా..అర్థమైంది..మీరు నాకోసం వెతకలేదు..వెతికితే దొరికేదాన్నేమో.. నన్ను పట్టించుకోలేదు..నాపై మీకు ప్రేమ లేదు..నాకు అర్థమైపోయింది... అయినా అందరకీ నీపైనే ప్రేమెక్కువ..చిన్నప్పటి నుంచీ గారాబంగా పెంచారుకదా నీకేదైనా చిన్న తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా హడావుడి చేసేవారు అంత అపూరంగా చూసుకున్నారు..అమ్మా-నేను కష్టాల్లో పుట్టాం-కష్టాల్లో పెరిగాం-ఎన్నో ఏళ్ల నాన్నకి దూరంగా ఉన్నాం-అందరూ కలిశామని సంతోషించాం ఆ ఆనందం తీరకముందే నువ్వు అమ్మా-నాన్నని చంపేశావ్ ( బ్యాంగ్రౌండ్ లో ఆ సీన్స్ ప్లే అవుతూ ఉంటాయ్). నాకు అమ్మా-నాన్నని దూరం చేసి నువ్వెక్కడో నానమ్మ-తాతయ్యతో సంతోషంగా ఉంటావా..నువ్వు ఎక్కడున్నా వదిలేదేలే... నీ డ్రైవింగ్ పిచ్చితో అమ్మానాన్నని బలితీసుకున్నావ్ ...నానమ్మ తాతయ్యలు ధనవంతులు కాబట్టి నువ్వు వాళ్లతో సంతోషంగా ఉంటున్నావ్ అనుకుంటుంది.

ఇంద్రుడు-చంద్రమ్మ: ఏంటమ్మా ఇక్కడ కూర్చుని ఆలోచిస్తున్నావ్ అని అడుగుతారు ఇంద్రుడు-చంద్రమ్మ. నీ అసలు పేరు ఇప్పటివరకూ చెప్పలేదు కనీసం ఇప్పటికైనా చెప్పవా అని చంద్రమ్మ అంటే.. పిన్నీ మీకు పాప పుట్టి చనిపోయింది కదా తన పేరు జ్వాల కదా...అదే నా పేరు అని చెబుతుంది. మీ పాపే ఉండి ఉంటే నన్ను వదిలేసేవారు కదా బాబాయ్ అంటే..మా పాపే బతికిఉంటే ఇద్దర్నీ రెండు కళ్లలా చూసుకునేవారం అంటాడు ఇంద్రుడు. ఓవర్ టైమ్ డ్యూటీ చేసేవాడని అన్న ఇంద్రుడితో ఇదే వద్దన్నాఅంటుంది జ్వాల. రేపు సత్యా సార్ కి టిఫిన్ రెడీ చేయాలని ఇంద్రుడు అంటే..అన్నీ సిద్ధం చేశా అంటుంది చంద్రమ్మ. జ్వాలా నువ్వు బాధపడకు నువ్వు నాకు దేవుడిచ్చిన కూతురివి నిన్ను బాగా చూసుకుంటాం అంటుంది చంద్రమ్మ.

Also Read: రిషి మనసులో మాట చెప్పి షాక్‌ ఇచ్చిన వసు, ఏం చెప్పాలో అర్థం కాక బిత్తరపోయిన మ్యాథ్స్‌ లెక్చరర్‌

హిమ: శౌర్య తెలివైంది మళ్లీ నువ్వు డ్రైవింగ్ చేస్తావేమో అని భయపడి పారిపోయిందన్న అత్తయ్య స్వప్న మాటలు గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది హిమ. నేను చేసిన తప్పువల్లే అమ్మా-నాన్నని పోగొట్టుకున్నాను , శౌర్య నువ్వే కరెక్ట్ అని కుమిలిపోతుంది. ఎక్కడున్నావ్ శౌర్య..ఎలా ఉన్నావ్...నీ కోపం తగ్గలేదా..మమ్మల్ని కలవాలని అనిపించలేదా ..ఎప్పటికైనా మనం కలుస్తాం.. అప్పుడు నీ కోపం అంతా తీర్చుకో అని ఏడుస్తుంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన సౌందర్య..హిమా ఏమైందని అడిగితే..
హిమ: చేసిన తప్పు అనుక్షణం గుర్తొస్తోంది నానమ్మా అని ఏడుస్తుంది. 
సౌందర్య: జరిగినదేదో జరిగిపోయింది అంతా మన దురదృష్టం అనుకోవడం తప్ప ఏం చేయగలం చెప్పు అంటుంది. 
హిమ: నువ్వు-తాతయ్య కూడా శౌర్య అనుకున్నట్టే మనసులో అనుకుంటున్నారు కదా నానమ్మా 
సౌందర్య: అలా ఎందుకు అనుకుంటాం...నువ్వు ఇలా బాధపడుతుంటే అమ్మా-నాన్న బాధపడతారు. రేపు అమ్మా-నాన్న పేరుమీద గుళ్లో అన్నదానం చేయిస్తున్నా 

జ్వాల: అటు జ్వాల అన్నం తింటూ అప్పట్లో కాకి మా ఇంటిపై అరువు మా నాన్న వస్తాడు అని అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. కంచంలో అన్నాన్ని ముద్దలుగా చేసి ప్లేట్లో పెడుతుంది. ఏంటమ్మా తినకుండా ఆలోచిస్తున్నావ్ అని చంద్రమ్మ అంటే తినమ్మా అంటాడు ఇంద్రుడు. ప్లేట్లో పెట్టిన రెండు ముద్దలు తీసుకెళ్లి బయట పెట్టి కావ్ కావ్ అని ఏడుస్తూ అరుస్తుంటుంది జ్వాల. ఏంటమ్మా ఈ పిచ్చి అని చంద్రమ్మ అంటే..పిచ్చి కాదు పిన్ని ఆశ అంటుంది. కాకులు అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారంటారే ఇప్పటికీ తిరిగి రానంత దూరం వెళ్లిన మా అమ్మా-నాన్నల ఆత్మల కాకుల రూపంలో చుట్టాలుగా వస్తారేమో అని ఆశ పిన్ని అంటుంది. ఈ పిల్లకి ఏం చెప్పాలయ్యా అని ఏడుస్తుంది చంద్రమ్మ. ఒక్క కాకీ రాలేదంటి పిన్నీ నేను ఏం తప్పు చేశానని అమ్మా నాన్నకి నాపై కోపం, ఒక్కసారి వచ్చి తినొచ్చు కదా పిన్నీ అని అంటుంది. కాకులకు ఏంటమ్మా గుళ్లో చాలామందికి అన్నదానం చేస్తున్నాం కదా అక్కడ అంతా కడుపునిండా తిని సంతోషంగా దీవించి వెళతారు , అమ్మా-నాన్నల ఆత్మ సంతోషిస్తుంది కదా అంటాడు ఇంద్రుడు. 

సౌందర్య ఇంట్లో
ఆనందరావు: అన్నీ తీసుకున్నావా మళ్లీ అక్కడకు వెళ్లాక అది మరిచిపోయా ఇది మరిచిపోయా అంటావ్
సౌందర్య: గుళ్లో డబ్బులు కట్టి ఎంతమందికి అన్నదానం చేయాలో చెబితే చాలు అన్నీ వాళ్లే చూసుకుంటారు
హిమ: నిరుపమ్ కి కాల్ చేసి గుడికి రమ్మని చెప్పాలా
సౌందర్య: వద్దులే హిమ వాడు అక్కడికి వస్తే వాళ్లమ్మ తిడుతుంది
హిమ: వాళ్లమ్మ ఏంటి నానమ్మ... అత్తయ్య నీ కూతురే కదా
ఆనందరావు: దీప-కార్తీక్ అలా అయిపోయారు... ఆదిత్య-శ్రావ్య అమెరికాలో ఉండిపోయారు, శౌర్య ఎక్కడుందో తెలియదు...ఉన్న ఒక్క కూతురు కళ్లముందు కనిపిస్తోంది కానీ ఎదురుపడితే కళ్లు ఉరిమి చూస్తోంది..ఏ జన్మలో ఏ పాపం చేశామో...
సౌందర్య: ఎందుకండీ బాధపడతారు...
ఆనందరావు: ఆస్తి, సంతానం అన్నీ ఇచ్చాడు కానీ దేవుడు మనశ్సాంతి ఇవ్వేలేదంటూ గుండె పట్టుకుంటాడు....
సౌందర్య: ఏమైందండీ అని అడిగిన సౌందర్య హాస్పిటల్ కి తీసుకెళుతుంది....

సౌందర్య అల్లుడి ఇంట్లో: నమస్తే సార్ అని సత్యా ఇంటికి వెళ్లిన జ్వాలా టిఫిన్ తీసుకొచ్చానని చెబుతుంది. అక్కడ పెట్టి వెళ్లు అంటే..లేదు సార్ వేడివేడిగా వడ్డిస్తాను తినండి అంటుంది. 
సత్య: జ్వాలా నువ్వు మా వాడిని ఎక్స్ట్రా అన్నప్పుడు నాకు కోపంరాదు సరికదా నవ్వొస్తుంది...
జ్వాల: ఎందుకంటే నిజంగా తను ఎక్ట్రా కాబట్టి అంటుంది
ఇంతలో ఫోన్ రింగవడంతో మీరు కూర్చోండి సార్ నేను వెళ్లి తీసుకొస్తానని వెళుతుంది. ఆ కాల్ సౌందర్య నుంచి వస్తుంది. 

Also Read: హిమ-ప్రేమ్, జ్వాల(శౌర్య)-నిరుపమ్, కార్తీకదీపంలో సరికొత్త ప్రేమకథలు మొదలయ్యాయ్
రేపటి (శనిరం) ఎపిసోడ్ లో
హాస్పిటల్ కి వచ్చిన జ్వాలని చూసి చీప్ గా ఆటోలో వచ్చారా అని ప్రేమ్ (Manoj kumar)అనడంతో చీప్ గా ఏంటంటూ కాలర్ పట్టుకుంటుంది. కాలర్ పట్టుకుంటావా అని నెట్టేయడంతో కింద పడబోతున్న జ్వాలని పట్టుకుంటాడు నిరుపమ్ (Manas Nagulapalli).ఇంతలో అక్కడకు వచ్చిన హిమని చూసి ఏయ్ తింగరి నువ్వు ఇక్కడున్నావేంటని అడుగుతుంది జ్వాల.  అసలు అమ్మాయిలు ఇలా ఉంటారా...మన డాక్టర్ హిమలా పద్ధతిగా ఉండాలంటాడు ప్రేమ్... అసలు అమ్మాయిలు ఇలాగే ఉండాలిరా తన యాటిట్యూడ్ నచ్చిందంటాడు నిరుపమ్. ఇంతలో అక్కడ  కనిపించిన సౌందర్యని చూస్తూ అలాగే ఉండిపోతుంది జ్వాల. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget