Karthika Deepam మార్చి 26ఎపిసోడ్: తన చుట్టూ ఉన్నది తన కుటుంబమే అని జ్వాల( శౌర్య) కి తెలిసిపోయిందా

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవడంతో ఇప్పుడు వాళ్ల చుట్టూ కథ నడుస్తోంది. మార్చి 26 శనివారం 1310 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

FOLLOW US: 

కార్తీకదీపం (Karthika Deepam )మార్చి 26  శనివారం ఎపిసోడ్

సౌందర్య అల్లుడు సత్యా ఇంటికి వెళ్లిన జ్వాలా టిఫిన్ తీసుకొచ్చానని చెబుతుంది. అక్కడ పెట్టి వెళ్లు అంటే..లేదు సార్ వేడివేడిగా వడ్డిస్తాను తినండి అంటుంది. ఇంతలో ఫోన్ రింగవడంతో మీరు కూర్చోండి సార్ నేను వెళ్లి తీసుకొస్తానని వెళుతుంది. ఆ కాల్ సౌందర్య నుంచి వస్తుంది. జ్వాల వెళ్లలోగా ఆ కాల్ కట్టవుతుంది. మళ్లీ రిటన్ కాల్ చేసిన సత్య.... ఆనందరావుని హాస్పిటల్ కి తీసుకెళ్లారని తెలిసి కంగారుగా బయలుదేరుతాడు. ఆటోలో తీసుకెళతాను రండి అనడంతో ఇద్దరూ కలసి వెళతారు. ఈ సార్ వాళ్ల మావయ్యగారికి ఏం కాకుండా చూడు అని మనసులో మొక్కుకుంటుంది జ్వాల( తన తాతయ్యే అనే విషయం తెలియదు).

డాక్టర్ బాబు తర్వాత ఆ అవతారం ఎత్తిన సౌందర్య మనవడు నిరుపమ్...తాతయ్య మీ ఆరోగ్యం బాగానే ఉంది ఏమీ ఆలోచించకండి అని చెబుతాడు. నువ్వలాగే అంటావ్ ఏమైందో చెప్పు అని అడిగితే ఏమీ లేదన్న నిరుపమ్..అమ్మమ్మ ని ఉద్దేశిస్తూ తాతయ్య ఆరోగ్యం నీచేతుల్లోనే ఉంది. ఇద్దరూ హాయిగా కబుర్లు చెప్పుకోండి,హాయిగా తిరగండి అంటాడు. ఎవరున్నారు తిరగడానికి మీ అమ్మ సంగతి తెలిసిందే కదా అని ఆనందరావు అనడంతో... 
ప్రేమ్: తాతయ్య మా అమ్మ, దీపత్త, కార్తీక్ మావయ్య, శౌర్య సంగతి మరిచిపోయి హాయిగా ఉండండి అంటాడు ప్రేమ్. 
నిరుపమ్: బంధాలను మరిచిపోవడం ఏంట్రా..ఆలోచించాలి కానీ పాజిటివ్ గా ఆలోచించాలంటాడు నిరుపమ్
ప్రేమ్: పాజిటివ్ గా ఎలా ఆలోచిస్తారు, మన అమ్మ మారదు, దీపత్త-కార్తీక్  మావయ్య తిరిగి రారు, శౌర్య ఎక్కడుందో -ఎలా ఉందో తెలీదు...
హిమ: బావా ప్లీజ్ అలా అనొద్దు..శౌర్య ఎప్పటికైనా నమ్మకం నాకుంది
ప్రేమ్: నాకు లేదు
సౌందర్య: ఎంట్రా అలా పుల్లవిరిచినట్టు మాట్లాడుతున్నావ్...
ప్రేమ్: జరగని వాటిగురించి ఆశిస్తూ, ఆలోచించడం వేస్ట్.. ప్రాక్టికల్ గా ఉండాలి
నిరుపమ్: మనిషికి ప్రేమలు, ఆప్యాయతలే గొప్ప మెడిసిన్
ప్రేమ్: మెడిసిన్ ఓవర్ డోస్ అయినా, ఎక్స్పైరీ అయినా ప్రమాదం. మమ్మీ-డాడీని కలపాలని ఎందుకు అనుకోను తెలుసా..వాళ్లిద్దరూ కలసి గొడవలు పడే కన్నా విడివిడిగా ఉండి హాయిగా ఉండడం మంచిందని నా ఫీలింగ్
నిరుపమ్: నువ్వు అలా మాట్లాడి తాతయ్యని బెదరగొట్టకు
ప్రేమ్: తాతయ్య... నీ డాక్టర్ మనవడు, డాక్టర్ మనవరాలు చెప్పినట్టు మీకేం కాదు హ్యాపీగా ఉండండి...డైలీ పొద్దున్నే వస్తాను జాగింగ్ కి వెళదాం... ఇంతలో నిరుపమ్ ఇంజెక్షన్ ఇస్తుంటే హిమ కళ్లు మూసుకోవడం చూసి...ఇంజెక్షన్ అంటే భయపడే నువ్వు డాక్టర్ వి ఎలా అయ్యావో అంటాడు... తాతయ్య ధైర్యంగా ఉండండి నేను ఓ ఫోన్ కాల్ మాట్లాడి వస్తాను. ( మోడల్ కోసం వెతుకున్నాను కానీ హిమను మించిన మోడల్ ఎవరుంటారని మనసులో అనుకుంటాడు). కోట్లు పోగొట్టుకున్నట్టు మొహం అలా పెట్టుకున్నావేంటి కొంచెం నవ్వొచ్చు కదా అనేసి...నువ్వు నవ్వవ్ నాకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
హిమ: తాతయ్య మీరు ప్రశాంతంగా ఉండాలి....
ఆనందరావు: ఇంట్లో డాక్టర్స్ ఎక్కువైనా ప్రాబ్లెమ్ సౌందర్య 

Also Read: ఫ్రస్టేషన్ లోనూ ఫన్ మిస్ చేయని ఈగో మాస్టర్ రిషి , అస్సలు తగ్గని వసుధార

ఇంతలో హాస్పిటల్ దగ్గర జ్వాల ఆటోలోంచి దిగుతాడు సౌందర్య అల్లుడు సత్య.  తండ్రి పక్కనే ఉన్న జ్వాలని చూసి...
ప్రేమ్: ఏంటి డాడీ చీప్ గా ఆటోలో వచ్చారా..
జ్వాల: ఆటో చీప్ కాదు..సరసమైన ధరకి సాగిపోయే సామాన్యుడి రథం
మళ్లీ ఇద్దరూ గొడవపడతారు... తన కాలర్ పట్టుకున్న జ్వాలని ప్రేమ్ తోసేయడంతో కింద పడబోతుండగా అప్పుడే అక్కడకు వచ్చిన నిరుపమ్ పట్టుకుంటాడు. ఏంటి గొడవ అని నిరుపమ్ అనడంతో...
జ్వాల: నా ఆటోని చీప్ అంటున్నాడు..తప్పా-కాదా...
నిరుపమ్: తప్పే
జ్వాల: మనం చేసే పనిని తప్పు అంటే మండుతుందా మండదా
నిరుపమ్: ఆటోలో వచ్చారా అన్న నిరుపమ్ కి అవును ఈ అమ్మాయి తీసుకొచ్చిందని చెబుతాడు సత్య. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు...
జ్వాల: అరె ఎక్ట్రా నువ్వు ఆగు..నేను చెబుతాను 
నిరుపమ్: ఎక్స్ట్రానా భలే పేరు పెట్టావ్ వీడికి 
జ్వాల: సత్య సార్ ఇంట్లో వంట చేస్తుంటాం... ఇంతలో ఫోన్ కాల్ రావడంతో కారు అందుబాటులో లేదని తీసుకొచ్చాను. నిరుపమ్ మాటలకు పడిపోయిన జ్వాల.. డాక్టర్ సాబ్ నువ్వు సూపర్ గా మాట్లాడుతున్నావ్ అంటుంది. తప్పు నావైపు లేకపోతే ఆ దేవుడినైనా నిలదీస్తాను
నిరుపమ్: అమ్మాయిలంటే అలాగే ఉండాలి
 ఇంతలో అక్కడకు వచ్చిన హిమ ఏమైందని అంటే....హిమని చూసిన జ్వాల..ఏయ్ తింగరి నువ్వు ఇక్కడున్నావేంటని అడుగుతుంది. 
నిరుపమ్: తింగరా...ఇదేం పేరు 
జ్వాల: తనకి నేను పెట్టుకున్న పేరు డాక్టర్ సాబ్
హిమ: నేను డాక్టర్ ని
జ్వాల: మీరు డాక్టరా...
హిమ: ఏవండీ తింగరి అని పిలవొద్దండీ 
జ్వాల: జరిగినదేంటో చెబుతుంది
ప్రేమ్: మళ్లీ గొడవ పడిన ప్రేమ్ అమ్మాయిలు ఇలా ఉంటారా.. మన డాక్టరమ్మలా పద్ధతిగా ఉండాలి
నిరుపమ్: నీ మొహం అమ్మాయిలు ఇలాగే ఉండాలి..మొహమాటం లేకుండా గలగలా మాట్లాడుకుంటూ అందర్నీ కలుపుకుంటూ పోవాలి. ఇలాగే ఉండాలి తన యాటిట్యూడ్ నచ్చింది నాకు అంటూ ఏవేవో చెప్పుకుంటూ వెళిపోగా... నిరుపమ్ చేయందుకుని థ్యాంక్స్ చెబుతుంది జ్వాల...

Also Read: అప్పుడు డాక్టర్ బాబు-వంటలక్క, ఇప్పుడు డాక్టర్ సాబ్-ఆటో డ్రైవర్
ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకురావాలి నేను వెళతానంటూ అల్లుడిని అక్కడ ఉండమని చెప్పి సౌందర్య బయటకు వెళుతుంది. జ్వాల అలియాస్ శౌర్య బయట ఆటో దగ్గర నిలబడుతుంది. ఆ పక్కనుంచే రిపోర్ట్స్ తీసుకుని వెళుతుంది సౌందర్య. సార్ ఎంతసేపటికీ రాలేదేంటి అనుకుంటూ పైకి వచ్చిన జ్వాలతో..నువ్వు వెళ్లమ్మా నేను మా అబ్బాయిని డ్రాప్ చేయమని చెబుతాను అంటాడు. నేనున్నాను కదా సార్ తీసుకెళతాను అంటుంది. ఆ వెనుకే సౌందర్య ఉంటుంది...ఎపిసోడ్ ముగిసింది.

సోమవారం ఎపిసోడ్ లో
చనిపోయిన మా అమ్మా నాన్న పేరుమీద అన్నదానం చేయించాలంటూ డబ్బులు కడుతుంది జ్వాల.  ఆ వెనుకే వచ్చిన సౌందర్య చనిపోయిన మా అబ్బాయి-కోడలు పేరుమీద అన్నదానం చేయించాలంటూ...పేర్లు చెబుతుంది. ఆశ్చర్యపోయిన పూజారి ఇంతకుముందే ఆ పేర్లమీద అన్నదానం చేయాలని చెప్పి ఓ అమ్మాయి వచ్చి డబ్బులు కట్టిందని చెబుతాడు. అంటే శౌర్య వచ్చిందన్నమాట అనుకుంటూ శౌర్య శౌర్య అని అరుస్తూ గుడి అంతా తిరుగుతుంది సౌందర్య.....

Published at : 26 Mar 2022 08:56 AM (IST) Tags: karthika deepam latest episode కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Vantalakka కార్తీకదీపం Amulya Gowda Kerthi Kesav Bhat Bigg Boss Manas amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi keshav bhat Karthika Deepam 26th March Episode 1310

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Janaki Kalaganaledu మే 27 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలకు వెళ్తున్న జానకీరామచంద్రకు సునంద షాక్- స్వీట్‌ షాప్ ఓపెన్ చేస్తున్నామని ఆహ్వానం

Janaki Kalaganaledu మే 27 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలకు వెళ్తున్న జానకీరామచంద్రకు సునంద షాక్- స్వీట్‌ షాప్ ఓపెన్ చేస్తున్నామని ఆహ్వానం

Karthika Deepam మే 27(ఈ రోజు) ఎపిసోడ్: రెస్టారెంట్‌లో జ్వాలతో క్లోజ్‌గా ఉంటున్న నిరుపమ్‌- రగిలిపోతున్న హిమ

Karthika Deepam మే 27(ఈ రోజు) ఎపిసోడ్: రెస్టారెంట్‌లో జ్వాలతో క్లోజ్‌గా ఉంటున్న నిరుపమ్‌- రగిలిపోతున్న హిమ

Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్‌యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్‌గా రిజెక్ట్ చేసిన వసుధార

Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్‌యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్‌గా రిజెక్ట్ చేసిన వసుధార

టాప్ స్టోరీస్

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్‌బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!

NTR Centenary Celebrations : ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !

NTR Centenary Celebrations :   ఎన్టీఆర్ అప్పట్లోనే చేసి చూపించారు - అవినీతికి పాల్పడితే మంత్రినీ వదల్లేదు !