అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today march 14th:అంజు కిడ్నాప్‌కు మనోహరి, రణ్‌వీర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా!

Nindu Noorella Saavasam Serial Today Episode:అమర్‌ను బ్లాక్ మెయిల్ చేయడానికి అంజు పాపను కిడ్నాప్ చేయడానికి మనోహరి, రణవీర్‌ ప్లాన్ చేస్తారు.

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్‌ లాయరుతో మందు తాగుతూ ఎలాగైనా తన బిడ్డ ఆచూకీ తెలుసుకోవాలనుకుంటాడు. అందుకోసం అంజును కిడ్నాప్‌ చేసి అమర్‌ను బ్లాక్‌ మెయిల్ చేస్తే తన బిడ్డ ఆచూకి చెప్తాడని ప్లాన్‌ చేస్తాడు. వెంటనే మనోహరికి కాల్‌ చేస్తాడు. భోజనం చేస్తున్న మనోహరి మధ్యలోనే బయటకు లాన్‌లోకి వెళ్లి ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తుంది. 

మనోహరి: ఏంటి ఈ టైంలో ఫోన్‌ చేశావు.. ప్రశాంతంగా భోజనం కూడా చేయనియ్యవా..? నెల రోజుల టైం ఇచ్చావు కదా..? అప్పుడే తొందరెందుకు 

రణవీర్‌: మనోహరి ఫోన్‌ ఎత్తగానే గ్యాప్‌ ఇవ్వకుండా వాగుతున్నావేంటి..? నన్ను మాట్లాడనివ్వవా..? 

మనోహరి: నీ కూతురు నీకు కావాలి, నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు 

రణవీర్‌: నువ్వు ఏమీ ఆలోచించాల్సిన పనిలేదు.. ఆల్రెడీ నేను లాయరు కలిసి ఒక ప్లాన్‌ చేశాం 

మనోహరి: ఏంటా ప్లాన్‌ 

రణవీర్‌: అంజు పాపను కిడ్నాప్ చేసి అమరేంద్రను బెదిరించి నా కూతురు ఎక్కడుందో తెలుసుకోవడం అదే నా ప్లాన్‌.. 

మనోహరి: మంచి ప్లాన్‌ ఆలోచించారు. ఎలాగూ నేను అడుగుతుంటే అమర్ చెప్పడం లేదు.. భాగీ, రాథోడ్‌ చెప్పనివ్వడం లేదు.. ఇలాగైనా పాప ఆచూకి తెలుస్తుందేమో చూద్దాం.. 

రణవీర్: చూద్దాం అంటే సరిపోదు.. నీకు నేను చాలా సార్లు హెల్ప్‌ చేశాను.. ఈ ప్లాన్‌ లో నువ్వు నాకు హెల్ప్‌ చేయాలి. 

మనోహరి: నేనేం చేయాలి 

రణవీర్: అంజు పాపను నువ్వే ఎత్తుకొచ్చి నాకు అప్పగించాలి 

మనోహరి: అప్పుడు నేను ఇరుక్కుంటాను.. అసలే ఆ పిల్ల చాలా తెలివైంది. 

రణవీర్‌: నేను  ఇంట్లోకి వచ్చి ఆ పిల్లను కిడ్నాప్‌ చేయలేను కదా..? 

మనోహరి: దానికి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదు నీ టైం బాగుండి కరెక్టు ప్లాన్‌ ఆలోచించావు.. రేపు ఇక్కడ హోళీ జరుగుతుంది. అనాథ ఆశ్రమం పిల్లలు వస్తున్నారు.. ఆ పిల్లలతో కలిసి ఈ పిల్లలు హోళీ ఆడబోతున్నారు.. ఆ సందర్భంలో నువ్వు వచ్చి చడీ చప్పుడు కాకుండా అంజును ఎత్తుకుపో.. ఆ పని పూర్తి అయ్యే లోపు ఇక్కడ ఎవ్వరికీ డౌటు రాకుండా నేను మానేజ్ చేస్తాను 

రణవీర్‌: ఆ సరే సరే నువ్వు ఆ ఏర్పాట్లు చూడు మిగతా పని నేను పూర్తి చేస్తాను

మనోహరి: ఇదిగో నేను మళ్లీ చెప్తున్నాను.. ఈ విషయంలో నా పేరు ఎక్కడా బయటకు రాకూడదు.. అమర్‌కు నా గురించి తెలిసిందో నువ్వు నా మాజీ మొగుడివి అని కూడా చూడకుండా నిన్ను చంపేస్తాను 

రణవీర్: ఏయ్‌ నాకు కావాల్సింది ఆస్థి. అది నాకు దక్కితే చాలు.. నిన్ను ఇరికిస్తే నాకేం వస్తుంది 

మనోహరి: అదే చెప్తున్నాను.. నన్ను ఇరికిస్తే నీకేం రాదు.. పైగా నీ ప్రాణం పోతుంది. అమర్‌తో నా పెళ్లి దగ్గర పడుతుంది. దాన్ని చెడగొట్టకు.. 

రణవీర్‌: అలాగేనే నా మాజీ భార్యామణి నీ పని నీది నా పని నాది.. రేపు కలుద్దాం 
అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు. 

మనోహరి: రేపటితో రణవీర్‌ పీడ విరగడవుతుంది. అంజును అడ్డు పెట్టుకుని అమరేంద్రతో నా  కూతురు ఎక్కడుందో చెప్పిస్తే.. ఆ పిల్లను తీసుకుని రణవీర్‌ నా దారికి అడ్డు రాకుండా వెళ్లిపోతాడు.. 

మరోవైపు 

లాయరు:  మనోహరి ఏమంటుంది సార్‌ 
అని అడగ్గానే.. ఏమంటుంది మనం తనను ఇరికించకూడదట. నా మాజీ భార్య నాతోనే చెప్తుంది. లాయరు నవ్వుతూ కలికాలం సార్‌ ఏం చేస్తాం.. అనగానే.. ఈ ఆస్థి నా చేతికి రావాలి.. ఆ తర్వాత మనోహరిని ఏదో ఒకటి చేయాలి లాయరు అంటూ కోపంగా మందు తాగుతుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget