News
News
X

Karthika Deepam మార్చి 29ఎపిసోడ్: రౌడీ అన్న పిలుపుతో తండ్రి డాక్టర్ బాబుని గుర్తుచేసుకుని డాక్టర్ నిరుపమ్ కి పడిపోయిన జ్వాల

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవడంతో ఇప్పుడు వాళ్ల చుట్టూ కథ నడుస్తోంది. మార్చి 30 బుధవారం 1313 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

FOLLOW US: 

కార్తీకదీపం (Karthika Deepam ) మార్చి 30 బుధవారం ఎపిసోడ్

నిరుపమ్ పొగడ్తలు గుర్తుచేసుకుంటూ మురిసిపోయిన జ్వాల..రేపు డాక్టర్ సాబ్ దగ్గరకు వెళ్లాలి అనుకుంటుంది. అయినా నాకు తనెందుకు గుర్తొస్తున్నాడు...నన్ను పొగిడినందుకా, అక్కడకు వెళితే తను నాకు పాత పరిచయంలా అనిపిస్తాడు, ఆ తింగరిదాన్ని చూస్తే హిమ గుర్తొస్తోంది అనుకుంటుంది. మరోవైపు హాస్పిటల్లో కూర్చున్న హిమ...జ్వాలనే గుర్తుచేసుకుంటూ ఉంటుంది. ఈ ఆటో అమ్మాయి గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను, నాకు పదే పదే ఎందుకు గుర్తొస్తోంది అనుకుంటుంది. సేమ్ టైమ్ లో నిరుపమ్ కూడా ఆ  ఆటో అమ్మాయిని చూస్తుంటే శౌర్యని చూసినట్టు అనిపిస్తోంది కదా అంటాడు. నా మనసులో ఉన్నమాటే నువ్వు చెప్పావ్ బావా అంటుంది హిమ. ఇంతలో డోర్ దగ్గరే జ్వాల ఉన్నట్టు ఊహించుకున్న హిమ...ఆ ఆటో అమ్మాయి నన్నే కోపంగా చూస్తున్నట్టుందని అంటుంది. అక్కడెవరూ లేరు హిమా తన గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల నీకు అలా అనిపించిందని చెబుతాడు. ఆ ఆటో అమ్మాయిని రమ్మని కబురుపెట్టానులే అంటాడు నిరుపమ్. ఇంతలో జ్వాల నిజంగానే అక్కడకు వస్తుంది.
హిమ: బావా ఈసారైనా నిజంగా వచ్చింద ఇది కూడా భ్రమేనా
జ్వాల: ఏం తింగరి ఏంటి అలా చూస్తున్నావ్
హిమ: తింగరి అన్నాదంటే నిజంగా వచ్చినట్టుంది... బావా నువ్వే శౌర్యా అని అడుగుదామా
నిరుపమ్: బావోదులే 
జ్వాల: ఏం తింగరి ఏంటలా చూస్తున్నావ్
నిరుపమ్: ఏం రౌడీ ఏంటలా చూస్తున్నావ్
జ్వాల: తన చిన్నప్పుడు తండ్రి తనని రౌడీ అని పిలిచిన విషయం గుర్తుచేసుకున్న జ్వాల..ఈ డాక్టర్ సాబ్ ని చూస్తుంటే ఎవరో దగ్గరి వాళ్లని చూసినట్టుంది
హిమ: నేనొక డాక్టర్ ని తింగరి అని పిలవొద్దు...
జ్వాల: హిమ కూడా అంతే..చిన్న వాటికే బెదిరిపోయేది...కానీ అది అమ్మానాన్నని పొట్టన పెట్టుకున్న రాక్షసి... ఓయ్ తింగరి ఇది నీ ఇలాకా, నీ హాస్పిటల్...నిన్ను నేను బెదిరిస్తుంటే నువ్వు ఎదిరించాలి, కొట్టాలి కానీ ఇలా చూస్తుంటావేంటి...
నిరుపమ్: అంత సీన్ లేదులే ఆటో అమ్మాయ్
జ్వాల: ఆటో అమ్మాయ్ కాదు...నా పేరు జ్వాల
నిరుపమ్: హిమకి ఎంత చెప్పినా వేస్ట్...నీతో పాటూ తిప్పుకుంటే మారిపోతుంది...
జ్వాల: నాలుగు రోజులు నాతోపాటూ వచ్చెయ్... నువ్వు, నీమాటా అన్నీ మారిపోతాయ్... ఎవరెవరికి ఇంజెక్షన్ ఇవ్వాలో, మందులివ్వాలో ఇచ్చెయ్
నిరుపమ్: తను ఇంజెక్షన్ ఇవ్వదు..ఇస్తే చూడదు అంత భయం....
సరే పద వెళదాం అంటూ హిమ చేయి పట్టుకుని లాక్కెళ్లిపోతుంది జ్వాల.... 

Also Read: జగతిని కాదని రిషిని సపోర్ట్ చేస్తున్న వసు, ఈక్వేషన్ సరిగా అర్థం చేసుకోలేకపోతున్న లెక్కల మాస్టారు
మరోవైపు ప్రేమ్..హిమ ఫొటో చూస్తూ కూర్చుంటాడు. ఇంతలో స్వప్న కాల్ చేయడంతో...మమ్మీ కాల్ చేస్తోంది అనుకుంటాడు. ఎలా ఉన్నావ్ అని అడిగితే  బావున్నా మమ్మీ..డాడీ ఎలా ఉన్నాడని అడగవా అంటాడు. నేను కాల్ చేసింది నువ్వు చెప్పింది వినడానికి కాదు..నేను చెప్పింది వినడానికి..ఓసారి ఇంటికొచ్చి వెళ్లు అంటుంది. ఇంటికి పిలిచినప్పుడు కూడా ప్రేమగా పిలవొచ్చు కదా అంత కమాండింగ్ ఎందుకు అంటూనే...సరే వస్తానంటూ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో తన దగ్గరకు వచ్చిన తండ్రితో... చెరో దగ్గర ఉన్నాం ఇలా అయితే ఎలా ఫజిల్స్ నింపుకోవడం మానేసి మనుషుల్ని ఎలా కలపాలో ఆలోచించండి అంటాడు. 

హిమని లాక్కెళ్లిన జ్వాల...ఆటో నడిపిస్తుంది. ఇప్పుడు ఆటో నడపడం అవసరమా అంటే..నీకు ధైర్యం నేర్పిస్తానని డాక్టర్ సాబ్ కి మాటిచ్చాను...కొత్త కొత్త పనులు చేస్తుంటే భయం పోతుంది తింగరి అని చెబుతుంది. నువ్వు ఆటో నడుపుతుంటే నేను వెనుక సీట్లో కాలుమీద కాలేసుకుని కూర్చుంటాను.... నువ్విప్పుడు ఆటోవాలా...నేను నీ పాసింజర్ ని అంటూ స్కిట్ స్టార్ట్ చేస్తారు.  జ్వాల వెనుక సీట్లో కూర్చుంటే హిమ ఆటో నడుపుతుంది. ధైర్యంగా ఎలా ఉండాలో చెబుతూ క్లాస్ తీసుకుంటుంది జ్వాల.  నేను ధైర్యంగా కూర్చున్నాను...నువ్వే నాకు ధైర్యం ఇవ్వాలి. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అనే ట్రేడ్ మార్క్ డైలాగ్ చెప్పకే అంటుంది జ్వాల... ( అప్పుడు కార్ డ్రైవింగ్ సమయంలో హిమ సేమ్ మాట అంటుంది... మొండిగా డ్రైవ్ చేయడం వల్లే యాక్సిడెంట్ అవుతుంది.....అది గుర్తుచేసుకుని ఏడుస్తుంది). ఒక్కసారిగా ఏడుస్తున్న హిమని చూసి జ్వాల కంగారుపడిపోతుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ అని క్వశ్చన్ చేస్తుంది. రోడ్డు పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ కి తీసుకెళుతుంది...అక్కడ అబ్బాయిని పిలవడంతో ఏంటి జ్వాలా అంటూ వస్తాడు. అదేంటి పేరు పెట్టి పిలుస్తున్నాడని హిమ అడిగితే... అక్కా, చెల్లి అనే బంధాలు నాకు పడవని చెబుతుంది జ్వాల..... ఎపిసోడ్ ముగిసింది.

Also Read:  జ్వాలే తమ శౌర్య అని హిమ-నిరుపమ్ గుర్తించారా, సౌందర్య రియాక్షన్ ఏంటి
రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
శౌర్య ఎక్కడున్నావే అంటూ సౌందర్య గుర్తుచేసుకుంటుంది. ఇక్కడే ఉన్నావ్ కానీ ఎప్పుడూ నానమ్మని కలవాలని అనుకోలేదా అనుకుంటూ శౌర్య ఫొటో చూస్తూ..జ్వాలని క్రాస్ చేస్తుంది. అదే ఆటోలో హిమ కళ్లుతిరిగి పడిపోయి ఉంటుంది...

Published at : 30 Mar 2022 09:20 AM (IST) Tags: karthika deepam latest episode కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ karthika Deepam Serial Today Episode Vantalakka కార్తీకదీపం Amulya Gowda Kerthi Kesav Bhat Bigg Boss Manas amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi keshav bhat Karthika Deepam 30th March Episode 1313

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu  August 8th Update: విష్ణు బుర్రలో విషం నింపుతున్న మల్లిక- జ్ఞానంబతో జానకిని తిట్టించేందుకు మల్లిక ఎత్తుగడ

Janaki Kalaganaledu August 8th Update: విష్ణు బుర్రలో విషం నింపుతున్న మల్లిక- జ్ఞానంబతో జానకిని తిట్టించేందుకు మల్లిక ఎత్తుగడ

Gruhalakshmi August 8th Update: తులసితో సామ్రాట్ వైజాగ్ టూర్- నందుతో ఇంకేం ప్రాబ్లం ఉండదని తులసికి హామీ ఇచ్చిన సామ్రాట్

Gruhalakshmi August 8th Update: తులసితో సామ్రాట్ వైజాగ్ టూర్-  నందుతో ఇంకేం ప్రాబ్లం ఉండదని తులసికి హామీ ఇచ్చిన సామ్రాట్

Devatha August 8th Update: మాధవకి చుక్కలు చూపించిన రాధ- రుక్మిణి గురించి నిజం తెలుసుకుని షాకైన సత్య

Devatha August 8th Update: మాధవకి చుక్కలు చూపించిన రాధ- రుక్మిణి గురించి నిజం తెలుసుకుని షాకైన సత్య

Ennenno Janmalabandham August 8th Update: యష్, వేద కర్టన్ లో రొమాన్స్ - ఖైలాష్ ని విడిపించేందుకు అభిమన్యు తిప్పలు

Ennenno Janmalabandham August 8th Update: యష్, వేద కర్టన్ లో  రొమాన్స్ - ఖైలాష్ ని  విడిపించేందుకు అభిమన్యు తిప్పలు

Hyper Aadi Sreemukhi : 'హైపర్' ఆది దెబ్బకు పరుగులు తీసిన శ్రీముఖి

Hyper Aadi Sreemukhi : 'హైపర్' ఆది దెబ్బకు పరుగులు తీసిన శ్రీముఖి

టాప్ స్టోరీస్

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?