Karthika Deepam ఏప్రిల్ 1 ఎపిసోడ్: మోనిత కొడుకు ఆనంద్ ఎంట్రీకి టైమొచ్చిందా, హిమ మాటలు విన్న శౌర్య ఏం చేయబోతోంది
బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవడంతో ఇప్పుడు వాళ్ల చుట్టూ కథ నడుస్తోంది. ఎప్రిల్ 1 శుక్రవారం 1315 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.
కార్తీకదీపం (Karthika Deepam ) ఏప్రిల్ 1 శుక్రవారం ఎపిసోడ్
ఆనందరావు- సౌందర్య
ఆనందరావు:‘ఇంట్లో సంతోషాలే లేకుండా పోయాయి’ అంటూ గతంలో జరిగినవి.. అవీ ఇవీ తలుచుకుని బాధపడతాడు. ‘తిరిగి ఇంట్లో ఆనందాలు రావాలంటే.. అది హిమ పెళ్లితోనే సాధ్యం’
సౌందర్య: శౌర్య మీరన్నట్టుగా మనల్ని చూసికూడా తప్పించుకుని తిరుగుతుందేమో, అటు హిమ మాత్రం శౌర్య కనిపించకుండా పెళ్లి మాటెత్తొద్దని స్ట్రాంగ్ గా చెప్పింది
ఆనందరావు: హిమ-శౌర్య, ప్రేమ్-నిరుపమ్ రెండుజంటలుగా మారితే సంతోషంగా ఉంటుంది
సౌందర్య: ఇప్పట్లో హిమ పెళ్లి ప్రస్తావన తీసుకురావొద్దు...పరిస్థితుల్ని బట్టి ఏం చేయాలో ఆలోచిద్దాం....
జ్వాల: మరోవైపు ఇంట్లో కూర్చుని ఆలోచిస్తున్న జ్వాల....నేను హిమ గురించి ఆలోచిస్తుంటే నాకు ఈ తింగరిది గుర్తొస్తోంది ఏంటి అనుకుంటుంది. ఇది వట్టి అమాయక పక్షిలా ఉందని హిమ మాటలన్నీ తలుచుకుని నువ్వుకుంటుంది. చిన్నప్పుడు హిమ కూడా ప్రతి విషయంలోనూ అదేంటి, ఇదేంటని అడుగుతూ ఉండేది...ఇప్పుడు ఈ తింగరిది కూడా అలాగే అడుగుతోంది. అసలే నాకు కోపం ఎక్కువ...హిమపై కోపాన్ని తింగరిదానిపై చూపిస్తానేమో.... అయినా పాపం హిమపై కోపాన్ని తింగరిదానిపై చూపించడం ఎందుకు, తను బాధపడితే డాక్టర్ సాబ్ కూడా బాధపడతాడు అనుకుంటుంది. అమ్మ నాన్నని డాక్టర్ బాబు అని పిలిచేది..నాకు తెలియకుండానే డాక్టర్ సాబ్ అని పిలుస్తున్నానేంటి...డాక్టర్ సాబ్ ని తలుచుకుంటేనే నా మనసులో ఏదో కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తోంది. ఏంటీ ఈ మాయ.... ఆ తింగరిది-డాక్టర్ సాబ్ ని చూస్తున్నప్పుడు నాకేదో కావాల్సిన వాళ్లలా అనిపిస్తోంది...ఏంటో ఈ ఫీలింగ్ నాకేమీ అర్థం కావడం లేదు....
అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇంద్రుడు-చంద్రమ్మని చూసి ఎక్కడ తిరిగివస్తున్నారు, ఇంట్లో పిల్లకి వండిపెట్టాలని తెలియదా, చేతివిద్య ప్రదర్శిస్తున్నారా ఏంటని క్వశ్చన్ చేస్తుంది. వాళ్లేదో చెప్పబోతుంటే.. అడ్డుపడిన జ్వాల ఏదో పిట్టకథ సృష్టించి చెప్పండి.... మనోహర్ సార్ మీకో అవకాశం ఇచ్చారు, ఉద్యోగం ఇప్పించారు అయినా మీరు మారరా అన్న జ్వాలతో..దొంగతనాలు మానేసే టైమ్ వచ్చింది కావాలంటే చూడు అని ఒంటిపై దెబ్బలు చూపిస్తాడు. మేం దొంగతనాలు చేయడం మానేస్తాం అని మాటివ్వడంతో...సంతోషం అంటుంది జ్వాల. రేపటి నుంచి ఆ టిఫిన్ సెంటర్ వాడిదగ్గర పనిచూసుకోండని చెబుతుంది.
Also Read: అప్పుడే అపరిచితుడు అంతలోనే రెమో, వసు ప్రేమలో మునిగిపోయిన రిషి
సౌందర్య ఇంట్లో
హిమ ఇంకా రాలేదు ఎక్కడికి వెళ్లిందో, ఇంటికి రాలేదేంటని ఆనందరావు-సౌందర్య తలుచుకుంటారు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచీ ఎప్పుడూ బెరుకుగా ఉంటోంది, ఎప్పటికి మారుతుందో ఏంటో అని బాధపడతారు. ఇంటికి లేట్ గా రావడమే కాకుండా డల్ గా వస్తోంది...ఏంటి అని అడిగినా సమాధానం చెప్పడం లేదు...మరీ గుచ్చిగుచ్చి అడిగితే బాగోదని అడగడం లేదంటుంది సౌందర్య. స్పందించిన ఆనందరావు హిమ ఎక్కడికి వెళుతుందో ఏంటో తెలుసుకోవాలంటాడు...
కట్ చేస్తే హిమ బస్తీలో వంటలక్క ఇంటి దగ్గర ఎంట్రీ ఇస్తుంది..
ఈ ఇంట్లో తల్లి, శౌర్యతో పాటూ గడిపిన క్షణాలు గుర్తుచేసుకుంటుంది. చాలా రోజులకు ఇక్కడకు వచ్చాను, మోనిత ఆంటీ ఇల్లు ఎలా ఉందో ఏంటో అనుకుంటుంది. డోర్ తీసి లైట్ వేస్తుంది. (అప్పట్లో మోనిత ఇల్లు వదిలి వెళ్లిపోతూ ఈ ఇల్లు ఎప్పటికీ డోర్ తెరిచే ఉండాలని ,ఇల్లు నీటిగా ఉంచాలని చెబుతుంది) . తండ్రి ఫొటో చూస్తూ జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. డాడీ నన్ను క్షమించండి...నేను చేసిన పొరపాటు వల్లే మీరు నాకు దూరమయ్యారు, శౌర్య నన్ను క్షమిస్తుందో లేదో తెలియదు కానీ మీరు నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను అంటూ ఫొటో ముందు దీపం పెడుతుంది. నేను చేసిన తప్పు వల్ల చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ కుమిలిపోతూనే ఉన్నాను, నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే కచ్చితంగా శౌర్యని కలవాల్సిందే, శౌర్యకోసం వెతుకుతూనే ఉన్నాను కానీ కనిపించడం లేదు..శౌర్యకి నేనంటే ఇష్టం...తనకి నాపై కోపంకూడా ఉంది. శౌర్య నన్ను క్షమిస్తుందో లేదో తెలియదు...నేను చేసిన పాపానికి శౌర్య ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను.....ఎక్కడున్నావ్ శౌర్యా అని హిమ అంటుంది....
జ్వాల: ఎక్కడుంటాను ఆటోలో ఉన్నాను... నా బతుకు అంతే కదా అని ఫోన్లో మాట్లాడుతుంది జ్వాల. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి శ్రీరాంనగర్ బస్తీకి వస్తావా అని అడుగుతాడు. శ్రీరాంనగర్ బస్తీ మాట వినగానే ఆ బస్తీలో పెరిగిన సంఘటనలు గుర్తుచేసుకుని ముసిరిపోతూ..అస్సలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఆటోలో తీసుకెళుతుంది. ఏంటో బస్తీ పేరు చెప్పగానే ఉత్సాహం వచ్చేసింది, ఆ ఇల్లు ఎలా ఉందో, అక్కడ ఎవరున్నారో అనుకుంటుంది. మరోవైపు హిమ తండ్రి కార్తీక్ ఫొటో ముందు ఏడుస్తూనే ఉంటుంది. మీరు లేని బాధ ఓవైపు-శౌర్య వెళ్లిపోయిందన్న బాధ మరోవైపు... శౌర్య కోసం వెతుకతూనే ఉన్నాం, ఎదురుచూస్తూనే ఉన్నాం అంటుంది. అటు ఆటోలోంచి దిగిన పెద్దాయనని వారణాసి, లక్ష్మణ్ అనే పేరున్న వాళ్లు ఇక్కడెవరైనా ఉన్నారా అని అడుగుతుంది. నేను ఈ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని ఆ పేరుతో ఉన్నవాళ్లెవవ్వరూ ఇక్కడ లేరంటాడు....
Also Read: తనతో ఉన్నది హిమ అని తెలుసుకున్న జ్వాల(శౌర్య) రియాక్షన్ ఎలా ఉండబోతోంది
రేపటి ( శనివారం) ఎపిసోడ్ లో
గతంలో బస్తీలో ఉన్న ఇంటికి వెళ్లిన జ్వాల.... ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయంటే ఎవరో ఈ ఇంట్లో మేల్కొనే ఉన్నారన్నమాట అనుకుంటూ వెళుతుంది. లోపల తండ్రి ఫొటో ముందు నిల్చుని దండం పెట్టుకుంటున్న హిమ...ఈ లెక్కన ఆనంద్ నా తమ్ముడు, వాడూ మా డాడీ రక్తమే అనుకుంటుంది. అక్కడ హిమని చూసి షాక్ అవుతుంది జ్వాల (శౌర్య)