Guppedantha Manasu ఏప్రిల్ 6 ఎపిసోడ్: వెళ్లే (రిషి) ప్రతి అడుగు నీవైపేనా మళ్ళీ ప్రతి మలుపు నిను( వసు) చూపేనా

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొన్నటి వరకూ మిషన్ ఎడ్యుకేషన్ రద్దు, వివాదాలు చుట్టూ సాగిన సీరియల్ ఇప్పుడు మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కింది. ఏప్రిల్ 6 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంతమనసు (Guppedantha Manasu) ఎప్రిల్  5 బుధవారం ఎపిసోడ్

క్లాస్ రూమ్: చెప్పిన లెసనే మళ్లీ చెబుతున్నారని వసుధార అనడంతో..మనకు రాగానే సరిపోదు కదా వేరేవాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా అని క్లాస్ వేస్తాడు రిషి. మనకు వచ్చింది కదా అని  ఏ లెక్కనీ నెగ్లెట్ చేయకూడదు (సాధన), మనకు వచ్చినా మనం సాధన చేసినా పక్కవాళ్లకు కూడా బోధన చేయాలి(బోధన) దానిద్వారా మనకు ప్రాక్టీస్ అవుతుంది, మనకు రానివి ఏంటో నోట్ చేసుకుని క్లాస్ రూమ్ లో అడగాలి (శోధన). క్లాస్ రూమ్ లో అన్నీ వచ్చినట్టే అనిపిస్తాయి కానీ ఎగ్జామ్ హాల్ కి వెళ్లగానే మైండ్ బ్లాక్ అయిపోతాయి... పై మూడు పాటించకపోతే మనకు వేదన తప్పదని వసుని ఉద్దేశించి క్లాస్ వేస్తాడు. ఈ రూల్స్ అన్నీ నాకోసమే పెట్టినట్టున్నారని నాకు అర్థమైందని అనుకుంటుంది వసుధార. వసుని చూస్తూ క్లాస్ రూమ్ లోంచి బయటకు వెళ్లిపోతాడు.... 

రిషి క్యాబిన్: క్యాబిన్ కి వెళ్లేసరికి అక్కడ కూర్చుని ఉంటుంది వసుధార. ఏంటో నాకోసం కాపలా కాస్తోంది అనుకుంటూ ఎక్సూజ్ మీ మేడం లోపలకు రావొచ్చా అంటాడు. ఇది మీ క్యాబినే కదా నన్ను అడుగుతారేంటన్న వసుధారతో...మీరు నా క్యాబిన్లో కూర్చుని ఆట్లాడుకుంటుంటే ఇది నా క్యాబినో కాదో అని డౌట్ వచ్చిందంటాడు. వసుని కూర్చోమంటే కూర్చోవడం లేదని రిషి లేచి నిల్చుంటాడు. అప్పుడు కూర్చుంటుంది వసుధార...
వసుధార: రెండు డౌట్స్ సార్..
రిషి: డౌట్స్ క్లాస్ రూమ్ లో అడగాలి
వసుధార: మిషన్ ఎడ్యుకేషన్ మీటింగ్ కి ఎందుకు రాలేదు..
రిషి: మొదటి దానికి సమాధానం చెప్పాక రెండోది అడుగుతావా...ఇద్దరు డైరెక్టర్స్ ని అపాయింట్ చేశాను..ఇక నా పెత్తనం అవసరమా అంటాడు
వసుధార: రిషి సార్ మేడం అన్న మాటలు విన్నారా లేదా క్యాజువల్ గా అంటున్నారా....
రిషి: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ స్వతంత్ర సంస్థగా మారింది..ఆ పని జగతి మేడం, డాడ్ చూసుకుంటారు..నాపై ఎక్కువ ఆధారపడొద్దు...
వసుధార: నేను మీకు ఈ ప్రాజెక్ట్ కి అసిస్టెంట్ గా ఉన్నానా లేదా...
రిషి: ప్రాజెక్టులో నేను పనిచేయనని చెప్పను కానీ నా పాత్ర తగ్గిపోతుంది...అసిస్టెంట్ ఉద్యోగంలో ఉండాలో వద్దో నిర్ణయం నీకే వదిలేస్తున్నా... ప్రాజెక్టు పనులే కాకుండా ఆఫీస్ వర్క్ లో హెల్ప్ చేయొచ్చు కానీ మీ మేడంతో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లు. ప్రాజెక్ట్ పనే కాదు నీ చదువుమీద కూడా దృష్టిపెట్టు...

Also Read: మనసులోనే నిలిచిపోకే మైమరపుల మధురిమా- ప్రేమను చెప్పే క్షణం కోసం ప్రేమ్, జ్వాల ఎదురుచూపులు

ఏదో కవర్ పట్టుకుని రిషి క్యాబిన్ కి వెళ్లిన జగతి ఆ కవర్ టెబుల్ పై పడేస్తుంది. 
రిషి: ఏంటి మేడం అవి
జగతి: మహేంద్ర ట్యాబ్లెట్స్ సార్..తను ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదు, ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు..  
రిషి: కూర్చోండి మేడం
జగతి: పర్లేదు సార్...
రిషి: మీరు చెప్పి దగ్గరుండి...
జగతి: సారీ సార్ అడ్డొస్తున్నాను...ఒక్కోసారి నా మాట వింటున్నారు, ఒక్కోసారి వినరు..ఇవన్నీ శరీరానికి ఇచ్చే మందులు..మహేంద్ర మనసుకి మందులు కావాలి... మహేంద్ర తను నా ఇంటికి మా ఆయనగా వచ్చారు కానీ మా ఆయన అక్కడ సంతోషంగా లేరు...మా అబ్బాయిని మిస్సవుతున్నారు...మా ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం...నాకు దూరంగా 20ఏళ్లకి పైగా ఉన్నారు కానీ అప్పుడింత బాధపడలేదు.. మా అబ్బాయికి దూరమై ఇప్పుడు భరించలేకపోతున్నారు. ఆయన ఆరోగ్యమే నా ఆరోగ్యం, ఆయన ఆనందమే నా ఆనందం సార్... ఓ క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ అంతా ఒకే రకంగా ఫాస్ట్ గా ఉండరు కదా సార్( సేమ్ డైలాగ్ క్లాస్ లో చెప్పినవిషయం రిషి గుర్తుచేసుకుంటాడు). అందరూ అనుకుంటున్నట్టు ఈ రోజుల్లో అందరూ దూసుకెళుతున్నట్టు మహేంద్ర ఉంరు, అలా ఆలోచించరు, ఓ చిన్న పిల్లాడి మనసు తనది..మహేంద్ర సంతోషంగా ఉండాలి...తను అందర్నీ వదిలేసి వచ్చి ఒంటరిగా మారిపోయారు...తను తన కొడుకు దగ్గర ఉంటే ఆనందంగా ఉంటారు సార్..తనెప్పుడు రెక్కలు కట్టేసిన పక్షిలా ఉన్నారు...కట్టేసిన ఆ రెక్కల్ని మీరే విప్పాలి...మీ హెల్ప్ కోసం వచ్చాను...మనుషుల మధ్య దూరం ఎంత దూరమో మనసుల మధ్య భారం ఎంత భారమో నాకు బాగా తెలుసు సార్...దయచేసి మహేందర్ని తన కొడుకు దగ్గరకు చేర్చండి సార్...కాలేజీలో పర్సనల్ విషయాలు మాట్లాడినందుకు నన్ను క్షమించండి సార్ అనేసి జగతి వెళ్లిపోతుంది...

జగతి వెళ్లిపోయిన తర్వాత గౌతమ్ కి కాల్ చేసిన రిషి ఏదో చెబుతాడు. ఈ రిషి గాడు ఈ మధ్య మరీ ఓవర్ చేస్తున్నాడు, నాకు పనులు చెబుతున్నాడు లేనిపోని డ్యూటీలు వేస్తున్నాడు... అయినా వీడికి నేను ఎందుకు భయపడాలి...నేనొచ్చింది వసుధార కోసం...వీడేమో వసుధార పనులు తప్ప అన్ని పనులు చెబుతుంటాడు అనుకుంటాడు. వసుని తలుచుకోగానే ఎదురొచ్చింది ఈరోజు ఏదో శకునంలా ఉంది అనుకుంటాడు. మీతో పాటూ నేను వచ్చేవాడిని వసుధార కానీ నాకో పని పడింది అంటాడు గౌతమ్.  మీ అబ్బాయి నాకు అన్ని పనులు చెబుతున్నారని గౌతమ్ చెప్పడంతో కంప్లైట్స్ వినను గౌతమ్,పొగడ్తలు వింటాను అంటుంది జగతి. ఇంతకీ ఏం చెప్పాడు రిషి అని అడిగితే... మహేంద్ర అంకుల్ ని తీసుకుని రమ్మని చెప్పాడంటాడు. జగతి-వసుధార వెళ్లిపోతుంటే నా కార్ అంటూ పరిగెత్తుతాడు. ఏంటిది గౌతమ్ నాకు చెప్పకుండా వెళ్లిపోతున్నారని అడుగుతాడు. అవును అంకుల్ మీ ప్రోగ్రాం మారింది...రిషి ఓ చోటుకి తీసుకుని రమ్మన్నాడని చెబుతాడు గౌతమ్..

Also Read: ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో, రిషి-వసుది సేమ్ ఫీలింగ్

జగతి-వసు: రిషి సార్ మహేందర్ సార్ ని ఎక్కడికి తీసుకువెళుతున్నట్టు... మహేంద్ర సార్ కి ఇష్టం లేకుండా బలవంతంగా ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదు కదా
జగతి: నాకన్నా-మహేంద్ర కన్నా రిషిని నువ్వే బాగా అర్థం చేసుకున్నావ్...మరి నువ్వేంటి తక్కువగా మాట్లాడతున్నావ్...
వసు: రిషి సార్ గాలిలాంటివారు.. అప్పుడే చల్లగా ఉంటారు, అప్పుడే వేడెక్కుతారు, వడగాలి, సుడిగాలి...ఇన్ని రకాల మధ్య ఆలోచించడం కష్టం
జగతి:మా అబ్బాయిపై కోపం వచ్చినట్టుంది...ఏం జరిగింది
వసు: రిషి సార్ ఏం చేయాలి అనుకుంటారో అర్థంకాదు...మనం అడిగినా ఆయన చెప్పరు...
జగతి:మీ ఇద్దరూ తోడు దొంగలే...ఇద్దరూ బాగానే అర్థం చేసుకుంటారు..బయటకు చిలిపి తగాదాలు పెట్టుకుంటారు...ఏం జరిగిందో నువ్వే చెబుతావ్ లే వసు అనుకుంటుంది జగతి

అటు హాస్పిటల్ కి చేరుకుంటారు మహేంద్ర, గౌతమ్... రిషి ఇక్కడకు ఎందుకు వచ్చాం అని మహేంద్ర అడిగితే డాక్టర్ అపాయింట్ మెంట్ తీసుకున్నా అయ్యాక మాట్లాడుదాం అంటాడు రిషి.  
మహేంద్ర: నాకేమైందని హాస్పిటల్ కి తీసుకొచ్చావ్... జస్ట్ జనరల్ చెకప్ అంతే అంటాడు.

రేపటి(గురువారం) ఎపిసోడ్ లో
ఇంటి బయట కార్లో ఉన్న రిషికి ఓ కప్ తీసుకొచ్చి చేతిలో పెడుతుంది వసుధార. పాయసమా అంటాడు రిషి..కాదు సార్ ఐస్ క్రీం అంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన గౌతమ్... పాయసం వాడొక్కడికే ఇస్తావా అంటూ లాక్కుని తాగేస్తాడు. అరేయ్ పాయసం నాక్కూడా ఉంచు అని వసుని ఆటపట్టిస్తాడు రిషి... 

Published at : 06 Apr 2022 09:47 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 6th April Episode 417

సంబంధిత కథనాలు

Guppedantha Manasu మే 24(ఈరోజు) ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర

Guppedantha Manasu మే 24(ఈరోజు) ఎపిసోడ్: వసుధారకు అసలు సంగతి చెప్పడానికి రెడీ అయిన రిషి- వెడ్డింగ్‌ డిజైన్ చేసిన మహేంద్ర

Janaki Kalaganaledu మే 24 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీ సంగతి తెలుసుకొని జ్ఞానాంభ ఆగ్రహం- అత్తయ్యను ఎలా ఒప్పించాలో తెలియక తలపట్టుకున్న జానకి

Janaki Kalaganaledu మే 24 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీ సంగతి తెలుసుకొని జ్ఞానాంభ ఆగ్రహం- అత్తయ్యను ఎలా ఒప్పించాలో తెలియక తలపట్టుకున్న జానకి

Karthika Deepam మే 24 ఎపిసోడ్: శోభ పిలిచిందని వెళ్లిపోయిన నిరుపమ్- ఫీల్ అవుతూ కూర్చున్న జ్వాల

Karthika Deepam మే 24 ఎపిసోడ్: శోభ పిలిచిందని వెళ్లిపోయిన నిరుపమ్- ఫీల్ అవుతూ కూర్చున్న జ్వాల

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్

Karthika Deepam మే 19 ఎపిసోడ్: సౌందర్యకు కాల్ చేసి అసలు విషయం చెప్పేసిన జ్వాల- హిమలో మళ్లీ టెన్షన్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!