IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Karthika Deepam ఏప్రిల్ 8 ఎపిసోడ్: నిరుపమ్ పై ప్రేమతో హిమపై తన పగను బయటపెట్టిన రౌడీ బేబీ

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారింది. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అవడంతో ఇప్పుడు వాళ్ల చుట్టూ కథ నడుస్తోంది. ఎప్రిల్ 8 శుక్రవారం 1321 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

FOLLOW US: 

కార్తీకదీపం (Karthika Deepam ) ఏప్రిల్  8 శుక్రవారం ఎపిసోడ్

చీర కట్టుకుని వచ్చిన జ్వాల(శౌర్య)ని పొగడ్తల్లో ముంచెత్తుతాడు డాక్టర్ నిరుపమ్. తన పని మానేసి జ్వాలను చూస్తూ నిల్చున్న నిరుపమ్ తో... బావా మెడికల్ క్యాంప్ పని చూద్దామా అని సెటైర్ వేస్తుంది హిమ. ఆ తర్వాత శౌర్య గురించి ఏదైనా సమాచారం దొరికితే బావుండును అనుకుంటుంది. చిన్నప్పటి ఫొటో చూపించి అడుగుతున్నాం..ఇప్పుడెలా ఉందో ఎవ్వరికీ తెలియదు కదా అని నిరుపమ్ తో అంటుంది. అటు హిమని చూసి మురిసిపోతున్న ప్రేమ్ ని గమనిస్తుంది జ్వాల. ఏంటి నువ్వు నన్ను గమనిస్తున్నావ్ అని ప్రేమ్ అంటే... నువ్వు ఆ తింగరి ఫొటోలు తీస్తున్నావని నాకు తెలుసు అంటుంది. నేను మెడికల్ క్యాంప్ ఫొటోస్ తీస్తున్నానని డైవర్ట్ చేస్తాడు. నీకు-నాకు ఈ క్యాంప్ తో సంబంధం లేదు..అక్కడికెళ్లి బ్లడ్ డొనేట్ చేస్తే ఫ్రూట్స్ ఇస్తారని చెబుతాడు ప్రేమ్. అయితే పద ఇధ్దరం వెళ్లి రక్తదానం చేద్దాం పద... పుణ్యం నువ్వు ఉంచుకో-ఫ్రూట్స్ నాకివ్వు అని ప్రేమ్ ని లాక్కెళ్లి హిమకి అప్పగిస్తుంది జ్వాల.  హిమని చూస్తూ ప్రేమ్.....నిరుపమ్ ని చూస్తూ జ్వాల మైమరిచిపోతారు. 

Also Read: పరుగెడుతోందే నీకేసే వినమంటోంది తన ఊసే, రిషి రూమ్ లో వసుధార
నిరుపమ్: ఇంతకుమందు బ్లడ్ డొనేట్ చేశావా
జ్వాల: లేదు
నిరుపమ్: మెడికల్ క్యాంప్ కి వచ్చావా
జ్వాల: ( ఇలాంటి మెడికల్ క్యాంప్ లోనే నాన్ని కలుసుకున్నా..ఇప్పుడు బస్తీలో ఈ క్యాంప్ ఎందుకు పెట్టినట్టో అనుకుంటుంది)
నిరుపమ్: ఏం మాట్లాడవేంటి...
జ్వాల: ఏం లేదు ఏదో గుర్తొచ్చింది అనగానే... నేను ఇప్పుడే వస్తానని వెళ్లిపోతాడు నిరుపమ్...
ఏయ్ ఎక్స్ట్రా ఏం చేస్తున్నావ్ అని అరుస్తుంది. ఇప్పుడు కూడా వదలవా అనుకుంటాడు. బ్లడ్ డొనేట్ చేస్తే నిజంగా బత్తాయిలు ఇస్తారా అంటే... బస్తాలకొద్దీ ఇస్తారు బజార్లో అమ్ముకో అని రిప్లై ఇస్తాడు. నేను హిమకోసం వస్తే జ్వాల పదే పదే డిస్ట్రబ్ చేస్తోందనుకుంటాడు.

మరోవైపు హిమ శౌర్య గురించి ఎంక్వరీ చేస్తుంటుంది. తన జ్ఞాపకాలన్నీ ఇక్కడే ఉన్నాయి బావా..శౌర్య తప్పనిసరిగా బస్తీకి వస్తుందంటుంది. నువ్వు మరీ ఇలా అయిపోతావ్ ఏంటని అంటాడు. ఎందుకో బావ శౌర్య ఇక్కడే ఉందని అనిపిస్తోంది...అమ్మ కూడా నాన్నని మెడికల్ క్యాంప్ లోనే కలిసిందంటూ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది. శౌర్యని వెతకడంలో నేను కూడా నీకు సహాయం చేస్తానంటాడు నిరుపమ్. ఇంతలో ఇక్కడెవరైనా ఉన్నారా అని ప్రేమ్ పిలవడంతో... వెళ్లి నీడిల్ తీస్తుంది. లేచికూర్చున్న జ్వాలతో...కళ్లు తిరుగుతున్నాయా అని నిరుపమ్ అడిగితే... తనతో మాట్లాడిన వాళ్లకి బుర్రతిరుగుతుంది కానీ తనకి ఏం కాదులే అంటాడు ప్రేమ్.

Also Read: ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే, రౌడీ బేబీకి పడిపోయిన డాక్టర్ సాబ్
జ్వాల చేతిమీద పచ్చబొట్టు చూసి ఎవరి పేరు అది అని అడుగుతాడు నిరుపమ్. చేతిమీద హెచ్ అనే పచ్చబొట్టు ఉందంటే ఎవరిది అనుకోవాలి జ్వాల అని అడుగుతాడు ప్రేమ్. ఇంతలో అక్కడకు రాబోతూ ఆ మాట విని అక్కడే ఆగిపోతుంది హిమ. అప్పట్లో పచ్చబొట్టు పొడిపించుకున్న సీన్ గుర్తుచేసుకుంటుంది జ్వాల. అంటే జ్వాలే శౌర్యా అని అనుకుంటుంది. మీ లవర్ పేరా అని ప్రేమ్ అడిగితే...ఇక చెప్పకపోతే నిరుపమ్ కూడా అనుమానపడతాడనే ఉద్దేశంతో అసలు విషయం చెబుతుంది జ్వాల.
జ్వాల: నా చేతిపై ఉన్న పచ్చబొట్టు నా శత్రువుది
నిరుపమ్: శత్రువు పేరులోంచి అక్షరం పచ్చబొట్టు వేయించుకున్నావా
జ్వాల: ఇది పచ్చబొట్టు కాదు..నా జీవితంలో మాసిపోని మచ్చ, మానిపోని గాయం
నిరుపమ్: అంతలా ఏం తప్పు చేశారు
జ్వాల: తప్పుకాదు డాక్టర్ సాబ్ ద్రోహం, నా జీవితంలోంచి ఆనందం తీసుకెళ్లిన మనిషి
ప్రేమ్: నీ వెనుక ఇంత బాధ ఉందా...
జ్వాల: బాధ కాదు ఆవేశం ప్రతీకారం, ఇప్పటికప్పుడు నాకు ఎదురు పడతారా అని చూస్తున్నాను
ప్రేమ్: అంతగా ఏం చేశారు తెలుసుకోవచ్చా...
జ్వాల: నేను ఊపిరి తీసుకున్న ప్రతిక్షణం గుర్తుచేసుకుంటూనే ఉంటాను ...అందరితో పంచుకోలేను..నాకోపం నాకు తెలుసు, నా శత్రువుకి తెలుసు.. 
నిరుపమ్: ఎదురుపడితే ఏం చేస్తావ్...
జ్వాల: ఆ క్షణంలో నా మనసుకి ఏం అనిపిస్తే అది చేస్తాను... సంవత్సరాలుగా నాలో రగులుతున్న ప్రతీకారం మాత్రం ఊహించని విధంగా ఉంటుంది... ఆరోజు నువ్వు అడిగావ్ కదా ...ఆటోపై వదిలేదేలే అని ఎందుకు ఉందని...తనకోసమే రాశా అది...తనని ఎప్పటికీ వదిలిపెట్టను...
నిరుపమ్: ఏంటి రౌడీ ఇంతలా మండిపోతున్నావ్
జ్వాల: నాలో దాచుకున్న కోపాన్ని మాటల్లో చెప్పలేను...నా జీవితాన్ని సెకెన్లలో తారుమారు చేసిన రాక్షసిని ఎప్పటికీ వదలను...
ఇదంతా విని ఏడ్చుకుంటూ వెళ్లిపోతున్న హిమని...ఏయ్ తింగరి అని పిలుస్తుంది.... ఎపిసోడ్ ముగిసింది

Published at : 08 Apr 2022 09:05 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat Bigg Boss Manas amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam 8th April Episode 1321

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu మే 26 (ఈరోజు) ఎపిసోడ్: జానకీ,రామా వైజాగ్‌ వెళ్లొద్దన జ్ఞానాంభ- విష్ణు ప్లాన్‌తో బుక్కైన మల్లిక

Janaki Kalaganaledu మే 26 (ఈరోజు) ఎపిసోడ్: జానకీ,రామా వైజాగ్‌ వెళ్లొద్దన జ్ఞానాంభ- విష్ణు ప్లాన్‌తో బుక్కైన మల్లిక

Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న

Karthika Deepam మే 26(ఈ రోజు) ఎపిసోడ్: నిరుపమ్ చేసిన పనికి జ్వాల, హిమ హ్యాపీ- రగిలిపోతున్న శోభ, స్వప్న

Guppedantha Manasu మే 26(ఈరోజు) ఎపిసోడ్: మనసులో మాట బయటపెట్టిన రిషి- ఐ లవ్‌ యు చెప్పిన వసుధారకు సర్‌ప్రైజ్‌

Guppedantha Manasu మే 26(ఈరోజు) ఎపిసోడ్: మనసులో మాట బయటపెట్టిన రిషి- ఐ లవ్‌ యు చెప్పిన వసుధారకు సర్‌ప్రైజ్‌

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ

Janaki Kalaganaledu మే 25 (ఈరోజు) ఎపిసోడ్:పెళ్లి పేరుతో వంటల పోటీలకు బయల్దేరిన జానకీరామా- స్వీట్స్ ఆర్డర్‌ తీసుకున్న జ్ఞానాంభ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్‌లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!

IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!