Guppedantha Manasu ఏప్రిల్ 7 ఎపిసోడ్: పరుగెడుతోందే నీకేసే వినమంటోంది తన ఊసే, రిషి రూమ్ లో వసుధార

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. మొన్నటి వరకూ మిషన్ ఎడ్యుకేషన్ రద్దు, వివాదాలు చుట్టూ సాగిన సీరియల్ ఇప్పుడు మళ్లీ లవ్ ట్రాక్ ఎక్కింది. ఏప్రిల్ 7 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంతమనసు (Guppedantha Manasu) ఎప్రిల్  7 గురువారం ఎపిసోడ్

ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదని  జగతి కంప్లైంట్ చేయడంతో రిషి తండ్రిని హాస్పిటల్ కి తీసుకెళతాడు. డాక్టర్ మళ్లీ అన్ని టెస్టులు చేయాలని చెప్పడంతో నేను బాగానే ఉన్నానంటాడు మహేంద్ర. నేను నిర్లక్ష్యంగా ఉన్నా నాకు నువ్వున్నావ్ కదా రిషి అది చాలునాకు అంటాడు.
గౌతమ్: హాస్పిటల్ బయట కూర్చున్న గౌతమ్... వసుధారకి నాకు మధ్య ఏ శక్తి అడ్డుపడుతోంది..ఇంకేం శక్తి ఆ రిషి గాడే.. ప్రేమ లేఖ ఇద్దామనుకుంటే అది నా చావుకేకలా మారింది. పెయింటింగ్  గిఫ్ట్ గా ఇధ్దామనుకున్నాను కానీ దాన్ని దాచడమే సరిపోయింది కానీ ఇవ్వడం కుదర్లేదు...ఏదో ఒకటి చేసి వసు మనసు గెలుచుకోవాలి అనుకుంటాడు.

మహేంద్రగారూ టైమ్ కి భోజనం చేయండి మందులు సరిగ్గా వేసుకోండని డాక్టర్ చెప్పడంతో..ఆ రెండు విషయాల్లో తప్ప అన్నీ పాటిస్తారని రిషి కౌంటర్ వేస్తాడు. రిషికి నేనంటే ఎంత ప్రేమో చెప్పకుండానే డాక్టర్ దగ్గరకు తీసుకొచ్చాడు..ఇప్పుడు కూడా సీరియస్ గా ఉంటాడేంటో అనుకుంటాడు. 
రిషి: ఏంటి డాడ్ అలా చూస్తున్నారు
మహేంద్ర: చూస్తాం భాయ్ నా కొడుకుని చూస్తా నీకేంటి...
రిషి: దూరంనుంచి చూడడం అవసరమా
మహేంద్ర: దూరం అయ్యేది దగ్గరవడానికే...
ఇంట్లో ఉన్న జగతి..మహేంద్ర ఎక్కడికి వెళ్లాడో అని ఆలోచనలో పడుతుంది. మహేంద్రకి కాల్ చేస్తుంది. మహేంద్ర కాల్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంటే...
రిషి: ఎవరు కాల్ చేస్తున్నారో నాకు తెలుసు, కాల్ లిఫ్ట్ చేయండి దగ్గర్లోనే ఉన్నాం వస్తున్నాం అని చెప్పండి...అన్ని విషయాలు తర్వాత చెబుదురు
మహేంద్ర: కాల్ లిఫ్ట్ చేసిన మహేంద్ర హా జగతి వస్తున్నాను దగ్గర్లోనే ఉన్నా అని సమాధానం చెబుతాడు...

Also Read: ఏ కన్నులూ చూడనీ చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే, రౌడీ బేబీకి పడిపోయిన డాక్టర్ సాబ్
ఇంటిముందు కారు ఆగడంతో కంగారుగా బయటకు వెళుతుంది జగతి. వసు నువ్వెళ్లు బయటకి అని చెప్పిన జగతి మహేంద్ర రాకకోసం గుమ్మం ముందు ఎదురుచూస్తుంది.  లోపలకు రావొచ్చుకదా అని మహేంద్ర అంటే..నేను రావడం కాదు మీరు రావాలని ఆశిస్తున్నా అంటాడు. పదండి అంకుల్ అని గౌతమ్ అంటే..నువ్వెక్కడి అని అడుగుతాడు రిషి. ఇంకా అడగడం లేదేంటా అనుకుంటాను అంకుల్ ని లోపలకు దిగబెట్టేసి వస్తానురా బాబు అని వెళతాడు గౌతమ్. మీరు నానుంచి వెళ్లిపోతూ వేసే ప్రతి అడుగూ నన్ను బాధించేదే అవుతుంది డాడ్  అంటూ బాధపడతాడు రిషి.
బయటి నుంచి రిషి హారన్ కొడుతుంటే...రిషి పిలుస్తున్నట్టున్నాడు వెళ్లు అంటాడు మహేంద్ర. వాడంతే అంకుల్ అన్న గౌతమ్... వసుధార వాడికి ఏం ఇస్తున్నావో అదే నాక్కూడా ఇవ్వు అంటాడు. 
వాడూ నేను ఒకటే కదా వాడేం తింటే నేనూ అదే తినాలి అంటాడు. వసు ఓ కప్ తీసుకెళ్లి రిషికి ఇస్తుంది. 
రిషి: ఈ మర్యాదలు నేను అడిగానా
వసుధార: అతిథి మర్యాదలు అడిగితేనే చేస్తారా ఏంటి
రిషి: ఏంటి పాయసమా
వసుధార: అది పాయసంలా కనిపిస్తోందా
రిషి: ఏదైనా కొత్త స్వీట్ ట్రై చేశావా ఏంటి..
వసుధార: అది ఐస్ క్రీం
రిషి: అవునా దాదాపు అలాగే ఉంది.. సూప్ లా, పాయసంలా ఐస్ క్రీం అనే ఈ ద్రవ పదార్థాన్ని నేను అస్వాదిస్తాను
 ఇంతలో అక్కడకు వెళ్లిన గౌతమ్ ...వసుధార ఇది అన్యాయం నాకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వాడికి పాయసం ఇస్తావా అని కప్ లాక్కుని తాగేస్తాడు...
పాయసం బావుంది వసుధార..నువ్వే చేశావా( రిషి నవ్వుకుంటాడు)...కాకపోతే కొంచెం ఐస్ క్రీం ఫ్లేవర్ లా ఉంది...
రిషి: నాకోసం తెచ్చిన పాయసాన్ని నువ్వు తాగడం ఏంటిరా తప్పుకదా...
గౌతమ్: థ్యాంక్యూ ఫర్ యువర్ పాయసం ..బై వసుధార అని చెప్పి కారెక్కుతాడు గౌతమ్..

Also Read: వెళ్లే (రిషి) ప్రతి అడుగు నీవైపేనా మళ్ళీ ప్రతి మలుపు నిను( వసు) చూపేనా
దేవయాని: ఇంట్లో పెద్ద హాల్ ఉంది, లివింగ్ రూమ్స్ ఉన్నాయి, నీ బెడ్ రూమ్ ఉంది...ఇన్ని ఉన్నా జీవితంలో మూడోవంతు కిచెన్లోనే గడుపుతావ్...మారు ధరణి...నువ్వు ఇలా అమాయకంగా ఉంటే ప్రపంచం నిన్ను గెలవనివ్వదు..నీ అభిప్రాయాలు ధైర్యంగా చెప్పు, గొంతు విప్పు..
ధరణి: ఏంటి అత్తయ్యగారు సరికొత్తగా మాట్లాడుతున్నారు
దేవయాని: ధరణితో జగతి-వసు మాట్లాడుతూనే ఉంటారు మంచి చేసుకుంటే దారికొస్తుందేమో...

ఇంతలో ఎంట్రీ ఇస్తారు గౌతమ్, రిషి....
దేవయాని: ఏంటి నాన్న లేటైంది...
గౌతమ్: ఏం లేదు పెద్దమ్మా మహేంద్ర అంకుల్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లాం
ధరణి: చినమావయ్యగారికి ఏం జరిగింది..
దేవయాని: ఎందుకంత కంగారు ఏదో జనరల్ చెకప్ కి తీసుకెళుతుంటాడు...
ఫణీంద్ర: రిషి అందరి ఆరోగ్యంమీద శ్రద్ధ చూపిస్తుంటాడు..
దేవయాని: మనల్ని కాదని వెళ్లిన మహేంద్ర ఆరోగ్యం మీద శ్రద్ధ జగతికి ఉండాలి కానీ రిషి కేంటో.
ఫణీంద్ర: అంటే అన్నానంటావ్... బయటకు వెళితే మనవాడు కాకుండా పోతాడా
రిషి: ఈ టాపిక్ ఇంతటితో వదిలేయండి..

దేవయాని ఇంటికి వెళుతుంది వసుధార
జగతి మేడం నాకు పెద్ద పని అప్పగించారు..ధరణి మేడంతో రిషి సార్ కి చెప్పించి..రిషి సార్ తో మహేంద్ర సార్ ని అడిగించి తిరిగి ఇంటికి పంపించాలని ఆలోచిస్తున్నారు. మీరు ఎంత గ్రేట్ మేడం అనుకుంటూ లోపలకు అడుగుపెడుతుంది వసుధార. ఎదురుగా దేవయాని కనిపిస్తుంది. 
దేవయాని: పాల ప్యాకెట్టు, న్యూస్ పేపర్లా పొద్దున్నే మా ఇంట్లో ఊడిపడ్డావేంటో
వసు: పాలపేకెట్టు కాఫీ అయిఉంటుంది, న్యూస్ పేపర్లో న్యూస్ పాతది అయిపోయి ఉంటుంది... మీకిప్పుడే తెల్లారిందా..

రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
ఈ పెద్దమనిషి ఎక్కడున్నాడో అనుకుంటూ రిషి రూమ్ లోకి వెళుతుంది వసుధార. టేబుల్ పై ఉన్న గోళీలు, నెమలీక చూసి గతంలో జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటుంది. ఇంతలో అక్కడకు  వస్తాడు రిషి...

Published at : 07 Apr 2022 09:28 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 7th April Episode 418

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Janaki Kalaganaledu మే 27 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలకు వెళ్తున్న జానకీరామచంద్రకు సునంద షాక్- స్వీట్‌ షాప్ ఓపెన్ చేస్తున్నామని ఆహ్వానం

Janaki Kalaganaledu మే 27 (ఈరోజు) ఎపిసోడ్: వంటల పోటీలకు వెళ్తున్న జానకీరామచంద్రకు సునంద షాక్- స్వీట్‌ షాప్ ఓపెన్ చేస్తున్నామని ఆహ్వానం

Karthika Deepam మే 27(ఈ రోజు) ఎపిసోడ్: రెస్టారెంట్‌లో జ్వాలతో క్లోజ్‌గా ఉంటున్న నిరుపమ్‌- రగిలిపోతున్న హిమ

Karthika Deepam మే 27(ఈ రోజు) ఎపిసోడ్: రెస్టారెంట్‌లో జ్వాలతో క్లోజ్‌గా ఉంటున్న నిరుపమ్‌- రగిలిపోతున్న హిమ

Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్‌యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్‌గా రిజెక్ట్ చేసిన వసుధార

Guppedantha Manasu మే 27(ఈరోజు) ఎపిసోడ్: ఐలవ్‌యూ చెప్పిన రిషి- నీది ప్రేమే కాదంటూ సింపుల్‌గా రిజెక్ట్ చేసిన వసుధార

టాప్ స్టోరీస్

NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

NTR Centenary birth celebrations :   తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !

IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

IAS Keerti Jalli :  అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి  సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?

Deepika Padukone: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్

Deepika Padukone: 'వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే' - తన పీరియడ్ స్టోరీ గురించి చెప్పిన దీపికా పదుకోన్