అన్వేషించండి
Advertisement
Chiranjeevi Lakshmi Sowbhagyavathi August 24th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీని చూసి అరవింద ఫీలింగ్ ఏంటీ? మిత్రా ఆచూకీ తెలుసుకున్న వీరన్న ఏం చేశాడు ?
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode: గుడిలో వరలక్ష్మీ వ్రతం చేస్తున్న లక్ష్మీని చూసి అరవింద షాక్‌కు గురవుతుంది. ఆమే తన కోడలు అని తెలుసుకుని ఆనందపడుతుంది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi : లక్ష్మీతో ఆలయంలో దీక్షితులు వరలక్ష్మీ వ్రతం చేయించేందుకు ఏర్పాట్లు చేశాడు. ఐదుగురు ముత్తయిధువులు కావాలని దీక్షితులు చెప్పగా...గుడికి వచ్చిన నలుగురిని బ్రతిమలాడి పూజ వద్దకు తీసుకొస్తుంది లక్ష్మీ...ఐదో వ్యక్తి కోసం ఎదురుచూస్తుండగా...అప్పుడే గుడికి అరవింద వస్తుంది. ఆ నలుగురిలో ఒక మహిళ వెళ్లి అరవిందను బ్రతిమాలి పూజ వద్దకు తీసుకొస్తుంది. అప్పటికే మహిళల కాళ్లకు పసుపురాస్తూ ఉన్న లక్ష్మీ...అరవింద రాకను గమనించదు. అరవింద కూడా లక్ష్మీ ముఖం చూడకపోవడంతో కాళ్లకు పసుపు రాయించుకుంటంది. ఇదంతా జయదేవ్ స్తంభం పక్కన దాక్కుని చూస్తుంటాడు. ఒక్కసారిగా అరవింద, లక్ష్మీ ఒకరినొకరు చూసుకుని షాక్‌కు గురవుతారు. అరవిందకు అసలు విషయం తెలియడంతో జయదేవ్ కూడా అక్కడికి వస్తాడు.
తన కళ్లముందు ఉంది లక్ష్మీయేనా లేక సంయుక్తనా అని అరవింద నిలదీస్తుంది. దీంతో దీక్షితులు నిజం చెప్పేస్తాడు. తాను లక్ష్మీయేనని వివరిస్తాడు. జయదేవ్ కూడా ఆమె లక్ష్మీయేనని ఇప్పటికైనా నీకు నిజాలు తెలియాలని చెబుతాడు
అటు లక్ష్మీ కిడ్నాప్‌లు చేసే వీరన్న వాళ్ల దగ్గరకు వెళ్లి తన భర్త ఆచూకీ గురించి అడగడంతో అతను ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. తనకు తెలిసిన వాళ్లందరికీ ఫోన్‌లు చేసి ఈ మధ్య కాలంలో ఎవరినైనా మీరు కిడ్నాప్ చేశారా అంటూ ఆరాతీస్తాడు. ఆమె భర్తను వెతికి పట్టుకుని ఇప్పటి వరకు తాము చేసిన పాపాలు కొంచెమైనా కడిగేసుకోవాలనుకుంటాడు.
లక్ష్మీని చూసి కౌగిలించుకుని అరవింద ఏడుస్తుంది.
అరవింద: నువ్వు చనిపోయావనుకుని ఏడ్వని రోజంటూ లేదమ్మా అంటూ బాధపడుతుంది. అలాగే ఏదో అద్భుతం జరిగి నువ్వు మళ్లీ మా ముందుకు వస్తావన్న ఆశాభావం కూడా ఉందంటుంది. ఇంతకాలం నీ భర్తను కుటుంబాన్ని వదిలి ఎలా ఉండగలిగావు లక్ష్మీ...
లక్ష్మీ: పరిస్థితులు నన్ను రాకుండా చేశాయి అత్తయ్యగారూ...నా కాళ్లకు ఉన్న సంకెళ్లు నన్ను రాకుండా చేశాయి..
అరవింద: నీ కాళ్లకు ఎన్ని సంకెళ్లు ఉన్నాయో నాకు తెలియదు. కానీ నువ్వు చనిపోయావాని...నువ్వు రావని తెలిశాక మా గుండెలు మాత్రం వెయ్యి ముక్కలయ్యాయి. నీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నాయి. లక్ష్మీని మాకు ఎందుకు దూరం చేశావని ఆ భగవంతున్ని ఎన్నిసార్లు నిందించానో...మా లక్ష్మీకి ఎందుకు ఇంత అన్యాయం చేశావయ్యా అని ఎన్నిసార్లు నిలదీశానో.. నేను అడిగే ఏ ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పలేదు. కానీ ఈరోజు నాకు అర్థమవుతోంది. ఇలాంటి అద్భుతాన్ని చూపించడం కోసం ఇన్నాళ్లు నిన్ను మాకు దూరంగా ఉంచాడనుకుంటా..ఇంత సంతోషాన్ని ఒకేసారి ఇవ్వడానికి ఆయన అలా చేసి ఉంటాడు. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంది. అయినా ఏంటి లక్ష్మీ ఇది నేను నీకు అంత కానిదాన్ని అయిపోయానా..? అంత అవసరం లేనిదాన్ని అయిపోయానా..?
లక్ష్మీ: అదేంటి అత్తయ్యగారు అలా అంటారు..?
అరవింద: మరికాకపోతే ఏంటి.. నువ్వు చనిపోయావని నేను ఎంత కుమిలిపోయానో నీకు తెలుసు. నేను రోజూ ఎంత బాధపడుతున్నానో నువ్వు చూస్తూనే ఉన్నావు. కానీ నీకు నిజం చెప్పాలనిపించలేదా..?
లక్ష్మీ: చెప్పాను కదా అత్తయ్యగారు...నా చుట్టూ ఉన్న పరిస్థితులు నా చేతులు కట్టేశాయి.
జయదేవ్: లక్ష్మీ ఏం చేసినా ఏదో కారణం తప్పకుండా ఉంటుందని నీకు కూడా తెలుసు కదా అరవింద...ఇప్పుడు తన ఉనికి గురించి బయటకు తెలియకపోవడమే మంచిది. అందుకే తనని తాను దాచుకుని అజ్ఞాతంలో బతుకుతోంది. అంతేకానీ నీమీద ప్రేమ లేక కాదు.
దీక్షితులు: అయినా ఆ భగవంతుడికి ఎవరిని ఎప్పుడు ఎలా కలపాలో తెలుసు...అయినా మీ మధ్య ఇంత అగాధాన్ని సృష్టించడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇప్పుడు హఠాత్తుగా కలపడానికి కూడా కారణం ఉండే ఉంటుంది. ఏది ఏమైనా మళ్లీ లక్ష్మీ తిరిగి వచ్చింది. ఇకనైనా తనను సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అరవింద
అరవింద: లక్ష్మీ.. ఇంకెప్పటికీ నిన్ను దూరం చేసుకోలేం. ఇకపై నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. ఒకసారి నిన్ను వదులుకుని తప్పు చేశాం. మళ్లీ అలాంటి పొరపాటు చేయం.
వీరన్న అందరికీ ఫోన్‌లు చేస్తూ...మిత్రాను కిడ్నాప్ చేసిన రమేశ్ వాళ్ల బ్యాచ్‌కు కూడా ఫోన్ చేస్తాడు. ఎవరినైనా కిడ్నాప్ చేశారా అని అడగ్గా...రమేశ్ మిత్రాను కిడ్నాప్ చేసిన సంగతి చెబుతారు. తనని ఏం చేయవద్దని వీరన్న వారిని కోరగా....తాను ఏం చేయలేనని మిగిలిన వాళ్లు సాయంత్రంలోగా మిత్రాను ఏదైనా చేయాలనుకుంటున్నట్లు చెబుతాడు. మిత్రాను అక్కడి నుంచి తప్పిస్తే...కావాల్సినంత డబ్బులు ఇస్తానని చెబుతాడు. వెంటనే ఈ సంగతి లక్ష్మీకి చెప్పాలని వీరన్న ఆమెకు ఫోన్ చేస్తాడు. పూజలో ఉన్న లక్ష్మీ ఆ సంగతి గమనించదు. వీరన్న పదేపదే ఫోన్ చేస్తుండటంతో లక్ష్మీ ఫోన్ చూడటంతో ఈ రోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion