అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today August 24th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: ఆర్యవర్థన్‌ ఇంటికి వచ్చిన గౌరి, శంకర్‌ - నిజం తెలిసే టైం వచ్చిందన్న జోగమ్మ

Prema Entha Madhuram Today Episode: చిరిగి పోయిన చెక్ ను మార్చుకోవడానికి ఆర్యవర్దన్ ఇంటికి గౌరి, శంకర్ రావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  రాకేష్‌..  విశ్వనాథ శర్మ అనే జ్యోతిష్యుడిని అభయ్‌ ఇంటికి తీసుకొస్తాడు. అభయ్‌ కంపెనీ బాధ్యతలు చేపట్టబోతున్నాడు కదా అందుకే ఇతన్ని తీసుకొచ్చాను. కంపెనీ బాధ్యతలు చేపట్టడానికి మంచి ముహూర్తం పెడతాడని చెప్తాడు. జెండే అభయ్‌, అకి ల జాతకం ఇస్తాడు. పంతులు వారిద్దరి జాతకాలు చూసి సోమవారం బాగుందని ఆరోజు బాధ్యతలు తీసుకుంటే యోగిస్తుందని చెప్తాడు. అభయ్‌ పంతులకు థాంక్స్‌ చెప్తే పంతులు నాకెందుకని నీ స్నేహితునికి చెప్పమని పంతులు చెప్తాడు. దీంతో అభయ్‌ ఈయన మా జెండే అంకుల్‌ మా నాన్నకు చాలా మంచి స్నేహితుడు. ఈయన లాగే నాకు రాకేష్‌ అని రాకేష్‌ను జూనియర్‌ జెండే అనొచ్చు అంటాడు. ఇంతలో యాదగిరి వస్తాడు.

యాదగిరి: తప్పు మాట్లాడుతున్నావు అభయ్‌. జెండే గారి స్థానాన్ని స్థాయిని ఎవ్వరూ అందుకోలేరు. ఆయన ఆర్యవర్ధన్‌ సారుకి స్నేహితుడు మాత్రమే కాదు. ఆయనకు రక్షణ కవచంలా నిలిచి కాపాడుకుంటూ వచ్చిన సైనికుడు. స్నేహితుడి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఆయన.

అభయ్‌: మామయ్యా ఫ్లీజ్‌.. నాకు ఫ్రెండ్ గురించి పూర్తిగా తెలుసు. ఆయన గొప్పతనం గురించి తెలుసు. ఆయనే కనక లేకపోతే మేము లేమని కూడా తెలుసు. నేనేదో జస్ట్‌  కంపేర్‌ చేశానంతే..

జెండే: అభయ్‌ తనేదో అభిమానంతో అలా మాట్లాడాడులే.. లీవ్‌ ఇట్‌..

అకి: మామయ్య చెప్పిన దాంట్లో కూడా తప్పేం లేదు కదా అన్నయ్యా.. ఫ్రెండుతో కంపేర్‌ చేయడానికి కూడా ఎవరూ సరిపోరు.

రాకేష్‌: అభయ్‌ నామీద ప్రేమతో ఏదో అలా అన్నారు. నాకంత అర్హత లేదని నాకు తెలుసు. బట్‌‌ నా ఫ్రెండ్‌ కోసం నాకు చేతనైంది చేస్తాను.

   అని చెప్పగానే అభయ్‌, రాకేష్‌ ను డిస్పపాయింట్‌ కావొద్దని వీళ్లందరూ నీ గురించి తెలుసుకునే రోజు వస్తుందని చెప్తాడు. దీంతో రాకేష్‌ పంతులుని డ్రాప్‌ చేసి వస్తానని వెళ్తాడు. అభయ్‌ కూడా యాదగిరిని తిట్టి వెళ్లిపోతాడు. తర్వాత యాదగిరి ఎమోషనల్‌గా ఫీలవుతాడు. ఇంతలో జెండే ఇప్పుడెందుకు వచ్చావని యాదగిరిని అడగ్గానే రేపు జ్యోతి వరలక్ష్మీ వ్రతం చేస్తుందని మీరు తప్పకుండా రావాలని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు శంకర్‌, గౌరి ఇద్దరు కలిసి కొత్త చెక్‌  తీసుకురావడానికి అకి వాళ్ల ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతారు.  శంకర్‌ బైక్‌ స్టార్ట్‌ చేస్తుంటే...

    సోది చెప్తూ ఒకావిడ వస్తుంది. అమ్మ లీలలు ఎవ్వరికీ అర్థం కావు. దంపతులే అయినా దంపతుల్లా నటించడం ఏంటో.. అని చెప్తూ కళ్యాణమస్తు అని శంకర్‌ గౌరిలను దీవిస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. యాదగిరి ఇంటిలోకి వస్తుంటే శంకర్‌, గౌరి బైక్‌ మీద వెళ్లిపోతారు. యాదగిరిని చూసి సోది చెప్తున్న  ఆవిడ నీ ప్రయత్నానికి అమ్మ ఆశీస్సులు ఉంటాయి అని చెప్తుంది.  ఇంతకీ శంకర్‌, గౌరి ఎక్కడికి వెళ్లారు అని యాదగిరి అడగ్గానే చెక్కు విషయం చెప్తారు. దీంతో యాదగిరి టెన్షన్‌ పడుతుంటే అమ్మ ఆజ్ఞ లేనిది ఏం జరగదు అని సోది చెప్తున్న ఆవిడ వెళ్లిపోతుంది. మరోవైపు శంకర్‌, గౌరి అకి వాళ్ల ఇంటి బయట నిలబడి మాట్లాడుకుంటారు.

శంకర్: గౌరి గారు చెక్‌ ఎలా చినిగిపోయిందని అడిగితే ఏం చెబుదాం..

గౌరి: అనుకోకుండా చిరిగిపోయిందని చెబుదాం..

శంకర్‌ : అలా చెబితే అది మన నెగ్లిజెన్సీ అనుకుంటారు.

గౌరి: మరింకేం చెప్పాలి.

శంకర్: ఏముంది మనిద్దరం గొడవపడ్డాం ఆ గొడవలో చిరిగిపోయిందని చెబుదాం.

గౌరి: మనమేమైనా చిన్న పిల్లలమా అలా చెప్పడానికి.. మనం ఇద్దరం గొడవ పడ్డామంటె ఎలా ఉంటుంది.

  అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఏదో ఒకటి చెబుదామని ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. శంకర్‌, గౌరిలను చూసిన జెండే వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించి మర్యాదగా కూర్చోబెట్టి.. ఎందుకు వచ్చారని అడుగుతాడు. దీంతో చెక్‌ గురించి చెప్తారు. జెండే సరేనని అకిని పిలుస్తానని లోపలికి వెళ్తుంటే యాదగిరి ఫోన్‌ చేసి చెప్పబోతుంటే జెండే గౌరి, శంకర్‌ లు వచ్చారని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: రేవ్ పార్టీ కేసు - ఆ షరతుతో నటి హేమపై ‘మా’ కీలక నిర్ణయం, ఇంతకీ ఏం జరిగిందంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారుఎడతెరపి లేకుండా వర్షం, డ్రాగా ముగిసిన గబ్బా టెస్ట్అలిగిన అశ్విన్, అందుకే వెళ్లిపోయాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lagacharla Incident: లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
లగచర్ల ఘటన - మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా 24 మందికి బెయిల్
KTR Letter To Revanth: అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
అవకతవకలు జరగలే, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Ashwin Retirement:
"స్పిన్ గోట్" అల్విదా, టీమిండియా బ్యాక్ బోన్ అశ్విన్
Prasad Behara Arrest: నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
నటికి వేధింపులు, ఫేమస్ యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్, 14 రోజులు రిమాండ్
Telangana TET Exam Dates: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్, ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
DHOP Song Promo: ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
ఊపు తెప్పించే ‘దోప్’ సాంగ్ వచ్చేసింది - రామ్ చరణ్, కియారా కిర్రాక్ స్టెప్స్!
Allu Arvind: శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
శ్రీతేజ్‌ను కిమ్స్‌లో పరామర్శించిన అల్లు అరవింద్ - కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ
Embed widget