అన్వేషించండి

Brahmamudi Serial Today August 24th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అడుగడుగునా అప్పును అవమానించిన ధాన్యలక్ష్మీ – వెనకేసుకొచ్చిన ఇందిరాదేవి

Brahmamudi Today Episode: వరలక్మీ వ్రతం కోసం ఇంటికి వచ్చిన అప్పును ధాన్యలక్మీ అడుగడుగున అవమానించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో సెంటిమెంట్ గా జరిగింది.

Brahmamudi Serial Today Episode:  వరలక్ష్మీ వ్రతం కోసం ఇంటికి వచ్చిన అప్పుకు  చీర కట్టుకోవాల్సిందేనని చెప్తుంది స్వప్న. ముగ్గురు అక్కాచెల్లెల మధ్య ఎమోషనల్‌ డ్రామా నడుస్తుంది. తర్వాత కావ్య బయటకు వచ్చి ఎమోషనల్‌ గా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పు, కళ్యాణ్‌ కు ప‌ద్ద‌తిగా పెళ్లి జ‌రిగితే సంతోషంగా ఈ ఇంటిలో త‌న చెల్లెలు కాపురం చేసేద‌ని అనుకుంటుంది. కావ్య క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం చూసి అప‌ర్ణ కంగారు ప‌డుతుంది. ఎప్ప‌టికైనా క‌ళ్యాణ్, అప్పులు ఇంట్లో అడుగుపెట్టేలా చేసేది నువ్వే అని కావ్య‌కు మనోధైర్యాన్ని ఇస్తుంది అపర్ణ. మరోవైపు ఇందిరాదేవితో కళ్యాణ్‌ బాధపడతాడు.

కళ్యాణ్‌: అమ్మ నా కోసం మాత్ర‌మే షాపింగ్‌ చేసి అప్పును మ‌రిచిపోయింది నాన్నమ్మ. త‌న‌కు కోడ‌లు ఉంద‌ని కూడా గుర్తించ‌డం లేదు.

ఇందిరాదేవి: అదేం లేదు కళ్యాన్‌ మీ మారిపోయింది. కాకపోతే కాస్త సమయం తీసుకుని అప్పును కూడా కోడలిగా అంగీకరిస్తుంది చూడు.

కళ్యాణ్‌: నిజంగా మారిపోయింది అయితే చిన్న చీర విష‌యానికే అప్పును అంత‌గా అవ‌మానించేది కాదు నాన్నమ్మ.

  అంటూ కళ్యాణ్‌, ఇందిరాదేవితో బాధపడుతుంటే ఇంతలో అప్పు చీర కట్టుకుని కిందకు వస్తుంది. అప్పును చూసిన ధాన్యలక్ష్మీ మనసులో తిట్టుకుంటుంది. అప్పు అసలు ఆడదానిలా కనిపించడం లేదని ఫీలవుతుంది. ఎలాగైనా అప్పు ఇంట్లోంచి వెళ్లిపోయేలా చేయాలని అనుకుంటుంది. అయితే తననే చూస్తున్న ధాన్యలక్ష్మీని చూసి అప్పు కంగారు పడుతుంది. వారిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదని అప్పుకు ధైర్యాన్నిస్తారు ఇద్దరు అక్కలు.  

    ఇంట్లో పండగ వాతావరణం ఉండటంతో ఇందిరాదేవి, అపర్ణ చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడూ ఇలాగే ఉంటే బాగుండు అని మాట్లాడుకుంటారు. అయితే అందరం ఒకే చోట ఉంటే ఈ సంతోషం ఇలాగే ఉంటుంద‌ని క‌ళ్యాణ్‌ను క‌న్వీన్స్ చేయ‌బోతాడు రాజ్‌. పూజ సామన్ల కోసం కిచెన్‌లోకి వెళ్తుంది అప్పు.

అప్పు: అత్తయ్యా.. పూజ సామాన్లు తీసుకురమ్మంటున్నారు. ఎక్కడున్నాయి..

ధాన్యలక్ష్మీ: అత్తయ్య ఎవరు నీకు. పూజకు వచ్చావు పూజ చూసుకుని వెళ్లిపో.. అంతే కానీ వరసలు పెట్టి పిలిచి దగ్గరవ్వాలనుకోకు.

 అంటూ ధాన్యలక్ష్మీ, అప్పును తిడుతుంది. తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువలకు అప్పు జ్యూస్‌ ఇస్తుంది.  జ్యూస్‌ వారి మీద పడేలా రుద్రాణి చేస్తుంది. దీంతో ధాన్యలక్ష్మీ మరోసారి అప్పును తిడుతుంది.

ధాన్యలక్ష్మీ: ఇంటికి వ‌చ్చిన ముత్తైదువ‌ల‌ను ఎలా చూసుకోవాలో తెలియ‌దా... బొత్తిగా అడివి మ‌నిషిలా ఉన్నావు.

ముత్తైదువ: మీ ఇంటికి ఉన్న పేరు ను నీ కోడలు వీధిన ప‌డేసేలా క‌నిపిస్తుంద‌ని ధాన్య‌ల‌క్ష్మి.

ధాన్యలక్ష్మీ: అవును చూస్తుంటే అలాగే కనిపిస్తుంది.  మా క‌ళ్యాణ్ కూడా తొంద‌ర‌ప‌డి అప్పును పెళ్లిచేసుకొని మా కొంప ముంచాడు.

ఇందిరాదేవి: ధాన్యలక్ష్మీ ఏం మాట్లాడుతున్నావు. అసలు ఇంటి గుట్టును పదిమందికి ప్రసాదంలా పంచుతున్నది నువ్వు. ఆవిడ గ్లాస్‌ సరిగ్గా పట్టుకోలేదు. ఇందులో నీ తప్పేం లేదులే అప్పు.

   అంటూ ఇందిరాదేవి అప్పుకు సపోర్టుగా మాట్లాడుతుంది. మీ అత్తయ్య కళ్లకు పొరలు కప్పి ఉండటంతో అది గుర్తించలేదని తిడుతుంది. ఆ త‌ర్వాత వ్ర‌తంలో ఎవ‌రి కొడుకు, కోడ‌లు వెనుకు వాళ్ల అత్త‌గారు కూర్చోవాల‌ని పంతులు చెబుతారు. అయితే అప్పు, క‌ళ్యాణ్ వెనుక కూర్చోవ‌డానికి ధాన్యలక్ష్మీ అంగీక‌రించ‌దు. దీంతో ప్ర‌కాశం వార్నింగ్ ఇవ్వ‌డంతో ధాన్యలక్ష్మీ కూర్చుంటుంది.

   వ్రతం పూర్తి అయిన తర్వాత అతిథులందరికీ అప్పు భోజనం వడ్డిస్తుంటే ధాన్యలక్ష్మీ అక్కడ కూడా అప్పును తిడుతుంది. అతిథులకు భోజనం పెడుతున్నావా? పిండం పెడుతున్నావా? ఇంత చిన్న విషయం కూడా తెలియదా అంటూ ప్రశ్నించడంతో అందరూ షాక్‌ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: షూటింగ్‌లో హీరో రవితేజాకు గాయం - వెంటనే శస్త్ర చికిత్స, డాక్ట‌ర్లు ఏం చెప్పారంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
South Korea Plane Crash: దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
దక్షిణ కొరియా విమాన ప్రమాదంలో 179 మంది మృతి, ప్రమాదానికి కారణం వెల్లడించిన అధికారులు
PM Modi Mann Ki Baat: 2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
2024లో చివరి మన్ కీ బాత్ విన్నారా - ప్రధాని మోదీ ప్రస్తావించిన కీలక విషయాలివే
Fake Court Order Scam: మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
మళ్లీ కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన స్కామర్లు - ఈసారి కోర్డు ఆర్డర్‌తో!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Anantapur News: అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
అనంతపురంలో హై అలెర్ట్ అప్లికేషన్, శివారు ప్రదేశాలలో డ్రోన్లతో నిఘా: జిల్లా ఎస్పీ
China Bullet Train: ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
ఈ రైలు వేగం గంటకు 450 కిలోమీటర్లు - అత్యాధునిక ఆవిష్కరణ చేసిన చైనా, ప్రత్యేకతలు ఇవే!
Ram Charan Unstoppable 4: బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్‌ 4'కు రామ్ చరణ్... షూటింగ్ అయ్యేది, స్ట్రీమింగ్ చేసేది ఎప్పుడంటే?
Kasturba Gandhi School: 300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
300 మందిని ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు, కస్తూర్భా గాంధీ స్కూళ్లో ఏం జరుగుతోంది
Embed widget