అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 3rd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ముక్కలైపోయిన రామరాజు కుటుంబం! వేరు కాపురం పెట్టేసిన సాగర్!

Illu Illalu Pillalu Serial Today Episode March 3rd సాగర్ నర్మదని తీసుకొని తండ్రి దగ్గర నుంచి వెళ్లిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu  Serial Today Episode సాగర్ తల్లిదండ్రులతో గొడవ పడి ఈ సమస్యకి పరిష్కారం నేను నా భార్యని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోవడం అని అంటాడు. అందరూ షాక్ అయిపోతారు. భాగ్యం, శ్రీవల్లి హ్యాపీగా ఫీలవుతారు. ధీరజ్ అలా అనొద్దు అని అంటే వెళ్లిపోవాలనే తప్పదు అని అంటాడు. నర్మద వద్దు అలా అనొద్దు అంటే నువ్వు నాతో జీవితాంతం ఉండాలి అనుకుంటే నాతో రా.. లేదంటే నేను ఒక్కడినే వెళ్లిపోతా అని అంటాడు. 

శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీబాబాయ్ పక్కకి వెళ్లి డ్యాన్స్‌లు వేస్తూ ఎంజాయ్ చేస్తారు. అప్పుడు నర్మద నన్ను కొడితే ఇప్పుడు అత్త నర్మదని కొట్టింది.. నా ఈగో సెట్ అయిపోయిందని అంటుంది. ప్రేమ వేదవతి దగ్గరకు వెళ్లి ఎందుకు అత్త నర్మద అక్కని కొట్టావ్ అంటుంది. ఏ నా కూతురి మీద కోపం వస్తే కొట్టనా.. అలాగే తనని కూడా కొట్టాను.. ఆ మాత్రం హక్కు నాకు లేదా అంటుంది. ఇక సాగర్ బట్టలు సర్దుతూ ఉంటాడు. తప్పు నీదే కదా సాగర్ పశ్చాత్తాపం కూడా లేదా అని అడుగుతుంది. ఏం మాట్లాడకుండా నాతో రా అని సాగర్ నర్మదని తిడతాడు.  

భాగ్యం భద్రావతికి కాల్ చేసి అదిరిపోయే సీన్ జరుగుతుంది  ఒకసారి బయటకు వచ్చి చూసి ఎంజాయ్ చేయండి అని అంటుంది. సాగర్ బ్యాగ్ సర్దుకొని  బయల్దేరుతుంటే వేదవతి ఆపుతుంది. ఏంట్రా ఇది మీ నాన్న అందరూ కలిసి ఉండాలి అనుకున్నారు నువ్వు ఇలా చేస్తే ఎలారా అని అడుగుతుంది. ధీరజ్ కూడా ఏంట్రా ఇది చిన్న గొడవకి ఇళ్లు వదిలి వెళ్లిపోవడం ఏంట్రా అని అడుగుతాడు. చిన్న గొడవ ఏంట్రా నేను ఉద్యోగం తెచ్చుకోవడం సమస్య.. రైస్‌మిల్లు నుంచి 5 లక్షలు తీసుకోవడం గొడవ.. ఇన్నేళ్లుగా రైస్‌మిల్లులో పని చేస్తున్నాను 5 లక్షలు తీసుకుంటే తప్పా అని అంటాడు. దానికి రామరాజు నువ్వు 5 కాదు 50 లక్షలు తీసుకున్నా పర్లేదు కానీ చెప్పకుండా తీసుకోవడం తప్పు.. దాన్ని దొంగతనం అని అంటారు అని అంటాడు. గొప్ప తండ్రి గొప్ప తండ్రి అని చెప్తారు.. అంత గొప్పగా మీరు పిల్లలకు ఏం చేశారో చెప్పండి అని సాగర్ తండ్రిని అడుగుతాడు. అందరూ షాక్  అయిపోతారు. రేయ్ నాన్నని పట్టుకొని ఏం అంటున్నావ్ అని చందు అంటాడు.
 
సాగర్ తండ్రితో.. ఏ రోజు అయినా పిల్లల ఇష్టాఇష్టాలు ఏంటి అని ఆలోచించారా.. అలా ఉండండి.. ఇలా ఉండండి.. అని శాసిస్తారు.. ఎప్పటికీ మీ చేయి పట్టుకొని నడవమని మమల్ని టార్చర్ చేస్తున్నారు మీరు.. నాన్న గురించి పిచ్చిగా మాట్లాడితే చెంప పగలగొడతా అని చందు అంటాడు. దానికి సాగర్ నువ్వు నాన్న అంటే భక్తి అనుకున్నావ్.. కానీ బానిసలా బతుకుతున్నావ్ అని అంటాడు. ధీరజ్ వచ్చి ఏంట్రా నువ్వు నాన్నని అన్నయ్యని అంటున్నావ్ అంటే ఏంట్రా నువ్వు కొడతావా నన్ను అని అంటాడు. ఏంట్రా మీరు ఇంటిని రణ రంగంగా మార్చుతున్నారు అని వేదవతి అడుతుంది. దానికి సాగర్ అమ్మా మీ ఆయనకు చెప్పు అని తండ్రిని నాన్న అని కూడా అనకపోవడంతో అందరూ షాకింగ్‌గా చూస్తారు. ఏంట్రా మీ ఆయనా అని వేదవతి అంటే అవును కన్న కొడుకు ఉద్యోగం చేయడం ఇష్టం లేనప్పుడు నేను కొడుకు ఎలా అవుతాను.. అమ్మా చెప్పేది విను.. వనజ వాళ్ల కోసం వాడుకున్న 20 లక్షలు తిరిగి ఇచ్చేశాను.. అంతే మీ డబ్బు నేను వాడుకోలేదు.. నా జాబ్ నా ఇష్టం.. మీకు ఇష్టం లేదని ఎవరి కోసం మానేయాల్సిన అవసరం లేదు.. ఇక మిగతా 5 లక్షలు త్వరలోనే ఇచ్చేస్తా అని అంటాడు.

అందరూ ఎంత చెప్పినా వినకుండా సాగర్ నర్మదని తీసుకొని వెళ్లిపోతాడు. సాగర్ నర్మదని తన పుట్టింటికి తీసుకెళ్తుంటే నర్మద ఆపి.. ఇటు ఎందుకు అని అంటాడు. మీ ఇంటికి అని సాగర్ అంటే నర్మద తిడుతుంది. భార్యని తీసుకెళ్లి అత్తారింట్లో ఉంటే మీ నాన్నకి ఎంత అవమానం అని పుట్టింటికి రాను అని చెప్తుంది. భద్రావతి, విశ్వక్, సేనాపతి సాగర్ వాళ్లు వెళ్లిపోవడం చూసి చాలా సంతోషపడతారు. వాడినాశనం చూసి సంతోషపడే అవకాశం మనకి దక్కింది అని సంబర పడతారు. ధీరజ్, ప్రేమలు సాగర్‌ వాళ్లని తీసుకురావడానికి బయల్దేరుతారు. సాగర్ తన ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసి ఇళ్లు కావాలని అడుగుతూ ఉంటాడు. అందరూ ఉదయం ప్రయత్నిస్తామని అంటారు. ప్రేమ, ధీరజ్‌లు సాగర్ దగ్గరకు వచ్చి ఇంటికి వెళ్దాం పదరా.. ఇంత రాత్రి వేళ రావడమే కాకుండా వదినను తీసుకొచ్చి ఇలా రోడ్డు మీదనిలబెట్టేశావ్ ఏంట్రా అని అంటాడు. మేం ఇళ్లు చూసుకున్నాం వెళ్లిపోతాం అంటాడు సాగర్. ధీరజ్ ఎంత చెప్పినా సాగర్ వినడు.. అందరం కలిసి ఉన్న కుటుంబాన్ని ముక్కలు చేయడం కరెక్ట్ కాదురా.. నాన్నతను ఒక అనాథ అని తనకు అంటూ ఓ ఇంటి పేరు లేదని చాలా బాధ పడుతున్నారురా.. అందుకే మనందరినీ చూపించి నేను అనాథ కాదు అని అంటారురా.. ప్రాణంగా పెంచుకున్న పిల్లలు దూరం అయితే నాన్న తట్టుకోలేరు అని అంటాడు. ప్రేమ బ్యాగ్ తీసుకొని వెళ్దాం పద అంటుంది. అందరూ సాగర్‌తో వెళ్దామని అంటే  సాగర్ రాను అనేస్తాడు. రారా నీకు దండం పెట్టి బలవంతంగా తీసుకెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 14th: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
పొదరిల్లు: నారాయణ కుటుంబం గుడికి రాకుండా తాయారు ఏం చేసింది..? మహాలక్ష్మీ ఎలా దీటుగా జవాబిచ్చింది.
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 14th:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?
నువ్వులేక నేను లేను:సుందరి గురించి నిజం తెలుసుకున్న రాధ...విక్కీకి దగ్గరయ్యేందుకు దొంగచిట్టి ప్లాన్‌ ఏంటి..?
Illu Illalu Pillalu Serial Today August 14th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అయ్యో ముగ్ధ కొంప ముంచేశావే! ప్రేమ ముందే హగ్‌లు ముద్దులు!
Gundeninda Gudigantalu August 14th:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?
గుండెనిండా గుడిగంటలు:ముగ్గురు మనవళ్లపై బామ్మపెట్టిన బాధ్యత ఏంటి..?రోహిణికి ప్రభావతి వేసిన శిక్ష ఏంటి..?

వీడియోలు

Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
Embed widget