Chinni Serial Today September 3rd: చిన్ని సీరియల్: చిన్ని ఎవరో బాలరాజుకి తెలిసిపోయిందా? మహిలో ఆశలు రేపుతున్న లోహిత! వల్లి, దేవా ఏం చేస్తారు?
Chinni Serial Today Episode September 3rd మహికి చిన్ని ఫోన్ చేసింది అని వసంత, శ్రేయలు దేవా, వల్లికి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode శివ శుభలేఖ ఇవ్వడానికి ఓ చోట కారు ఆపుతాడు. మధు కిందకి దిగి నిల్చొంటుంది. సమీపంలోనే మధు తండ్రి బాలరాజు కార్ రిపేర్ చేస్తుంటాడు. కానీ మధు తండ్రిని చూడదు. చిన్ని శివతో కుడి కన్ను అదురుతుంది. కుడి కన్ను అదరడం మంచిది కాదు కదా అని అంటే శివ మనసులో నేనే నీకు మంచోడిని కాదు అని అనుకుంటాడు. ఇక మధు దగ్గర వెడ్డింగ్ కార్డు తీసుకొని వెళ్తాడు. 
మధు బ్యాగ్‌లో తండ్రి ఫోటో చూసి ఎమోషనల్ అవుతుంది. బాలరాజు మధుని చూస్తాడు కానీ గుర్తు పట్టలేడు. చిన్న తండ్రి ఫొటో పట్టుకొని నిన్ను కలవకుండానే నీకు చెప్పకుండానే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాన్న దయచేసి నన్ను క్షమించు అని ఫొటో పట్టుకొని అనుకుంటుంది. ఇంతలో ఫోన్ రావడంతో ఫొటో పక్కన పెట్టి మాట్లాడుతుంది. ఇంతలో ఆ ఫొటో ఎగిరి బాలరాజు ఉన్న వైపు వెళ్తుంది.

బాలరాజు కాళ్ల దగ్గర ఆ స్కెచ్ ఎగరడంతో అది చూసి తీసుకుంటాడు. ఇదేంటి నా స్కెచ్ అని షాక్ అయిపోతాడు. ఈ అమ్మాయి ఏంటి నా స్కెచ్ చూసి అంత ఫీలవుతుంది. అంటే ఈ అమ్మాయి నా చిన్నినా.. అని చాలా సంతోషపడతాడు. చిన్ని అని పిలుస్తుండగా రౌడీలు తల మీద కొట్టి బాలరాజుని తీసుకెళ్లిపోతారు. శివ వచ్చి చిన్నిని తీసుకెళ్లిపోతాడు.

మహి చిన్ని అని లోహిత చేసిన నెంబరుకి కాల్ చేస్తూనే ఉంటాడు. లోహిత సిమ్ వేయగానే మహి కాల్ వస్తుంది. ఇదేంటి వీడు ఇలా సిమ్ వేయగానే చేశాడు అనుకొని గొంతు మార్చి లోహిత మాట్లాడుతుంది. మహి సంతోషంలో చిన్ని ఏంటి ఫోన్ మాట్లాడవు.. స్విచ్ ఆఫ్ వస్తుంది.. నిన్ను కలవాలి అని అంటాడు. ఆ మాటలు అన్నీ శ్రేయ తల్లి వసంత వింటుంది. మహి ఎగ్జైట్ అయి మన లైఫ్ గురించి మాట్లాడాలి నీ లొకేషన్ పంపించు అని అంటాడు. 
లోహిత చిన్నిగా మహితో మనం కలవడం అంత ఈజీ కాదు మహి నేను ఎక్కడ ఉన్నానో ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నీకు చెప్పలేను.. ఎప్పటి పడితే అప్పుడు నేను నీతో మాట్లాడలేని పరిస్థితి.. నీతో మాట్లాడాలి అని ఉన్నా మాట్లాడలేను అని లోహిత బిజీగా ఉన్నట్లు సౌండ్ చేసి ఫోన్ కట్ చేసేస్తుంది. పాపం మహి చిన్ని చిన్ని హలో చిన్ని అని అంటూనే ఉంటాడు. మళ్లీ మళ్లీ కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. చిన్ని మనం తొందరగా కలవాలి చిన్ని అని అనుకుంటాడు.
వసంత శ్రేయని పిలిచి మహికి ఆ చిన్నీ ఆచూకి తెలిసిందా అని అడుగుతుంది. తెలిసింది ఫోన్లో మాట్లాడుకుంటున్నారని శ్రేయ చెప్పడంతో వసంత షాక్ అవుతుంది. ఇద్దరూ త్వరలోనే కలుస్తారు అలా జరగకూడదు అని అంటుంది. నాగవల్లి, దేవేంద్ర వర్మ మాట్లాడుకుంటూ ఉంటే వసంత, శ్రేయ అక్కడికి వెళ్తారు. వసంత నాగవల్లితో వదినా నా కూతురి జీవితం సర్వనాశనం అయిపోయింది.. ఆ చిన్నీ ఆచూకి మహికి తెలిసింది.. ఫోన్‌లో మాట్లాడుతున్నారని చెప్తారు. 
మహి ఇప్పటి వరకు ఫోన్‌లో మాట్లాడాడు.. ఇకపై ఇంటికి తీసుకొస్తాడని చెప్తుంది. మహి కిందకి రావడంతో నాగవల్లి విషయం అడుగుతారు. అవును అని మహి అంటాడు. ఎవరైనా చీట్ చేసుకుంటారు కదా అని దేవా అడిగితే లేదు డాడ్ చిన్నినే కాల్ చేసింది మా చిన్నప్పటి విషయాలు అన్నీ చెప్పింది. తను కచ్చితంగా చిన్నినే అని అంటాడు. ఎప్పుడు కలుస్తుందని నాగవల్లి అడిగితే ఎప్పుడు కలుస్తుందో తెలీదు కానీ ప్రస్తుతం కలవలేని స్థితిలో ఉన్నాను అని చెప్తుంది. మీరు చెప్పిన గడువులోనే తనని కలుస్తా అని మహి అంటాడు. 
మహి శ్రేయతో ఇప్పటికే నీకు చెప్పా మళ్లీ చెప్తున్నా శ్రేయ అనవసరంగా నా మీద హోప్స్ పెట్టుకోకు నా పరిస్థితి అర్థం చేసుకో ప్లీజ్ అంటాడు. శ్రేయ ఏడుస్తుంది. మహి వెళ్లిపోయిన తర్వాత శ్రేయ ఏడుస్తూ పేపర్ చింపేస్తుంది. నాగవల్లి కంట్రోల్ అని అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి అత్త బావ నన్ను పెళ్లి చేసుకోను అన్నప్పుడే నేను చావాల్సింది అయినా.. పర్లేదు ఇప్పుడు నేను చస్తా అంటుంది. దేవా కోపంగా నోర్ముయ్ ఏంటి నీ చావు నువ్వు చచ్చేది మేం అంతా చచ్చాం అనుకున్నావా అని తిట్టి తర్వాత శ్రేయతో నువ్వు మహిని ఎంత లవ్ చేస్తున్నావో మాకు తెలుసు మీ పెళ్లి చేసే బాధ్యత మాది అని అంటాడు.
నాగవల్లి మహి ఫోన్ ట్రాపింగ్ చేయమన్న అధికారులకు ఫోన్ చేసి విషయం అడుగుతుంది. చిన్ని లొకేషన్ మీ కాలేజ్ లొకేషన్ చూపించిందని ఆడియో రికార్డ్ పెడతానని అంటారు. నాగవల్లి, దేవాలు ఆ రికార్డ్ విని షాక్ అయిపోతారు. మ్యాడీకి చిన్ని గురించి పూర్తిగా తెలిసేలోపు దాని చాప్టర్ క్లోజ్ చేసేయాలి అనుకుంటుంది. 
బాలరాజుని బంధించిన రౌడీలు దేవాకి కాల్ చేసి విషయం చెప్తారు. దేవా వెంటనే వస్తామని చెప్పి నాగవల్లికి విషయం చెప్పి వెళ్తాడు. ఇక శివ తన రిలేటివ్స్‌కి చూపించాలి అని మధు ఫొటో తీసుకుంటాడు. మనసులో ఈ పొటోలో నాకు 2 కోట్లు కనిపిస్తున్నాయని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















