Chinni Serial Today September 2nd: చిన్ని సీరియల్: మహి పదేళ్ల నిరీక్షణకు తెర.. చిన్ని నుంచి ఫోన్.. మహిలో ఆశలు రేపిన లోహిత కుట్ర!
Chinni Serial Today Episode September 2nd మహి చిన్ని గురించి వెతక్కుండా చేయడానికి లోహిత మహికి కాల్ చేసి తానే చిన్ని అని మహితో మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode నాగవల్లి మహి ఇచ్చిన యాడ్ గురించి దేవాతో చెప్పి మహి నమ్మకం నిజమైతే మనకు శ్రేయ దక్కదు. శ్రేయ, మహిలకు పెళ్లి చేయాలి. అందుకు చిన్నిని చంపాల్సిందే. మహి ఫోన్ ట్యాపింగ్‌లో పెడదాం. అప్పుడు మహికి చిన్ని కాల్ చేస్తే దాని మహి కంటే ముందు మనకు ఆ చిన్ని ఆచూకి తెలుస్తుంది అని చెప్తుంది.

దేవా తన పలుకుబడి ఉపయోగించి మహి ఫోన్ ట్యాపింగ్‌లో పెట్టి అప్డేట్స్ నాగవల్లికి పంపమని అంటాడు. మ్యాడీ ఆలోచిస్తూ ఉంటే మ్యాడీని లోహిత చూసి ఈ మ్యాడీ వరస చూస్తే చిన్ని గురించి తెలుసుకునేలా ఉన్నాడు. అప్పుటి వరకు మ్యాడీని డైవర్ట్ చేయాలి అనుకుంటుంది. అందుకు వేరే సిమ్ నుంచి మ్యాడీకి కాల్ చేసి మహి అంటూ చిన్నిలా మాట్లాడుతుంది.

అందరూ మ్యాడీ అంటే నువ్వు మహి అంటున్నావ్ అని మ్యాడీ అడుగుతాడు. దానికి లోహిత నువ్వు మహినే కదా అంటుంది. మహి చాలా సంతోషంగా అంటే నువ్వు.. నువ్వు అని అనగానే నువ్వు ఎదురు చూస్తున్న చిన్నిని అని అంటుంది. ఏంటి చిన్నీనా అని మహి చాలా ఎగ్జైట్ అవుతాడు. నాకు ఎందుకో నమ్మకం కుదరడం లేదు.. ఇప్పటి వరకు చాలా మంది ఫోన్ చేసి ఆటపట్టించారు మీరు అంతేనా అంటే లోహిత చిన్నప్పటి విషయాలు అడమని అంటుంది.

మహి లోహితకు మనం ఏ స్కూల్‌లో చదువుకున్నాం.. ఏ క్లాస్ చదువుకున్నాం.. మన ఫ్రెండ్స్ పేర్లు చెప్పు అంటే లోహిత అన్నీ చెప్తుంది. కరెక్టే కరెక్టే అని మహి చాలా చాలా సంతోషిస్తాడు. ఇక లోహిత మహితో పాము నిన్ను కాటేయబోతే నేను కాపాడాను నువ్వు నా కోసం హనుమాన్ విగ్రహం తీసుకొచ్చావ్ గుర్తుందా అని లోహిత అంటే నువ్వు చిన్నివే ఎస్ ఎస్ అని చిన్ని అని గట్టిగా అరుస్తాడు. నువ్వు నా చిన్నీవే నా చిన్నివే పదేళ్ల నుంచి నేను ఎదురు చూస్తున్న నా చిన్నివే.. ఈ పదేళ్ల నుంచి నీకోసం వెతుకుతూ నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలుదు.. ఇప్పుడు నా జీవితం స్వర్గం చేయడానికి నువ్వు వచ్చావ్. చిన్ని చెప్పు ఎక్కడ ఉన్నావ్ లొకేషన్ పెట్టు నేను వస్తా అని అంటాడు. లోహిత వెంటనే నేను మళ్లీ చేస్తాను అని ఫోన్ కట్ చేసేస్తుంది. ఇలా ఫోన్ కట్ చేసేసింది ఏంటి అని మహి అనుకొని మళ్లీ కాల్ చేస్తాడు. లోహిత సిమ్ తీసేయడంతో ఫోన్ కనెక్ట్ కాదు. మహి చాలా చాలా టెన్షన్ పడతాడు.

మహి తన ఫ్రెండ్ రాహుల్‌తో చిన్ని దొరికేసిందిరా.. నా లవ్ సక్సెస్‌రా అని సంతోషంగా చెప్తాడు. ఇక మధు అందరికీ శుభలేఖలు పంచుతుంటుంది. స్వప్న వెడ్డింగ్ కార్డులు పట్టుకున్న పేపర్‌లో మహి ఇచ్చిన యాడ్ ఉంటుంది. అది చిన్ని చూస్తే అంతే సంగతులు అని లోహిత చాలా కంగారు పడుతుంది. కింద పడిన పేపర్ లోహిత తీసి మధు చూడకుండా ఆ యాడ్ కవర్ చేసి ఇచ్చేస్తుంది. ఇంతలో మహి మధు దగ్గరకు సంతోషంగా వచ్చి మధు చేతులు పట్టుకొని గిరగిరా తిప్పేసి చాలా హ్యాపీగా ఉన్నాను పదేళ్లగా వెతుకుతున్న పర్సన్ దొరికిందని చెప్తాడు. ఎవరు ఆ పర్సన్ అని చిన్ని అడిగితే మ్యాడీ చెప్పేలోపు శివ వస్తాడు. దాంతో మహి చెప్పడు. మధు శివతో వెళ్లిపోతుంది.

శ్రేయ హర్ట్ అయి వెళ్లిపోతుంటే మహి వెనకాలే వెళ్లి శ్రేయ ఫీలవుతున్నావా.. చిన్ని కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు తెలీదు. ఇంట్లో వాళ్లు నా ప్రేమని అర్థం చేసుకోకపోయినా దయచేసి నువ్వు అయినా అర్థం చేసుకో అని చెప్తాడు. శ్రేయ ఏడుస్తుంది. అదంతా విన్ని లోహిత శ్రేయ దగ్గరకు వస్తుంది. లోహిత శ్రేయని బాధ పడొద్దని అంటుంది. చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్న బావని అదెవరో వచ్చి గద్దలా తన్నుకుపోతే ఎలా అని అంటుంది. నేను నీ బావ నీకు దక్కేలా చేస్తానని లోహిత అంటుంది. శ్రేయ చాలా సంతోషంగా ఫీలవుతుంది.

ఇక మధు శివతో శివతో వెళ్తుంటే ఓ చోట శివ కారు ఆపుతాడు. అక్కడే బాలరాజు ఓ కారు రిపేర్ చేస్తుంటాడు. శివ తన ఫ్రెండ్‌కి వెడ్డింగ్ కార్డు ఇస్తానని వెళ్తాడు. చన్ని కారు దిగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.






















