తెలుగు సీరియల్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఉన్న నటుల్లో ప్రభాకర్ ఒకడు.
ప్రభాకర్ 1990 నుంచి టీవీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు . చాణక్య, రుతురాగాలు, అన్నా చెల్లెల్లు, ముద్దు బిడ్డ వంటి హిట్ సీరియల్స్‌లో నటించారు.
చాలా కాలం నుంచి తన నటనతో ఆకట్టుకుంటున్న ప్రభాకర్‌ను బుల్లితెర మెగాస్టార్ అని పిలుచుకుంటారు.
ఈటీవీ సీరియల్స్‌తో చాలా ఫేమస్ అయినందున ఆయన్ని ఈటీవీ ప్రభాకర్ అని కూడా పిలుస్తారు.
ప్రభాకర్ కేవలం నటుడుగానే కాకుండా సీరియల్స్ నిర్మాతగా, ETV క్రియేటివ్ హెడ్‌గా కూడా పనిచేశారు. ఆయన 120కు మించిన సినిమాల్లో నటించారు.
ప్రభాకర్ ప్రస్తుతం జీ తెలుగు చానల్లో చామంతి సీరియల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్ జనవరి 1, 2025న ప్రారంభమైంది .
చామంతి సీరియల్లో ప్రభాకర్ గ్రామీణ కుటుంబ తల్లిదండ్రుల్లో ఒకరిగా నటిస్తున్నారు. ఈ సీరియల్లో మేఘన లోకేశ్, ఆశిష్ చక్రవర్తి, మౌనిక వంటివారు నటిస్తున్నారు.
ప్రభాకర్ స్టార్ మా ఛానల్‌లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సీరియల్ నవంబర్ 12, 2024న ప్రారంభమైంది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రభాకర్, ఆమని భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఇది రెండు కుటుంబాల మధ్య జరిగే కుటుంబ అనుబంధాల కథ.
ప్రభాకర్ సీరియల్స్‌లో నటించినందుకు ఒక్కరోజుకు 35,000 నుంచి 40,000 రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటుల్లో ఒకరు.
ప్రభాకర్ భార్య మలయజ యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తోంది. షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తోంది. కొడుకు చంద్రహాస్ హీరోగా పరిచయమయ్యాడు. కూతురు దివిజ కూడా సినిమాల్లో నటిస్తోంది.