1990లలో సినిమాల్లో నటించి మెప్పించిన ఆమని రెండో ఇన్నింగ్స్‌ సీరియల్స్‌లో కూడా రాణిస్తోంది



స్టార్ మా ఛానల్‌లో 2024 నవంబర్‌ నుంచి ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తోంది.



ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో లీడ్‌ రోల్ రామరాజు పాత్ర పోషించిన ప్రభాకర్‌కు భార్యగా ఆమని నటిస్తోంది. పేరు వేదవతి



ఆమని జీ తెలుగు ఛానల్‌లో వచ్చే ముత్యమంత ముద్దు సీరియల్లో కనకరత్నం పాత్ర పోషించింది.



జీ తెలుగు ఛానల్‌లో ఆమని అనే పేరుతోనే వచ్చిన సీరియల్లో మొదటిగా నటించింది.



జీ తెలుగులో వచ్చే డ్రామా జూనియర్స్ రియాలిటీ షోలో స్పెషల్ గెస్ట్‌గా ఆమని కనిపించింది.



ఆమని ప్రస్తుతం సీరియల్స్‌తోపాటు సినిమాల్లో కూడా నటిస్తోంది. 2025లో యేమైనదే పిల్లా,మేఘాలు చెప్పిన ప్రేమకథవంటి సినిమాల్లో కనిపించనుంది.



ఆమని తన సీరియల్ పనులు, వ్యక్తిగత అప్‌డేట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.



ఆమని రెమ్యూనరేషన్ గురించి కచ్చితమైన సమాచారం లేదు. కానీ ఆమె సీనియర్ నటి కావడంతో ఒక ఎపిసోడ్‌కు 15వేల నుంచి 25 వేల వరకు తీసుకునే ఛాన్స్ ఉంది



సీరియల్ నటులు సాధారణంగా నెలకు 20-25 రోజులు షూటింగ్‌లలో బిజీగా ఉంటారు. రోజువారీ పేమెంట్ సిస్టం వల్ల స్థిరమైన ఆదాయం వస్తోంది.