Sirivennela Family Thanks KCR: 'సిరివెన్నెల' కుటుంబానికి అండగా ఉంటామన్న తెలంగాణ ప్రభుత్వం... కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పిన కుటుంబ సభ్యులు
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్)కు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, బుధవారం ఉదయం 'సిరివెన్నెల' అంత్యక్రియలకు హాజరయ్యారు. దివంగత గేయ రచయిత పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అందించే సాయం గురించి శ్రీనివాస్ యాదవ్ ప్రసావించడంతో పాటు తమ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన ధైర్యాన్ని ఇచ్చారని... ఈ సందర్భంగా ఆయనకు, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని 'సిరివెన్నెల' సభ్యులు తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, ఏపీ ప్రభుత్వానికి సైతం 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి బిల్లులను ఏపీ ప్రభుత్వమే చెల్లించింది. ఆస్పత్రికి తాము కట్టిన అడ్వాన్స్ సైతం వెనక్కి తిరిగి ఇప్పించారని సిరివెన్నెల కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
సిరివెన్నెల అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో గల మహాప్రస్థానంలో ముగిశాయి. ఆయన పెద్ద కుమారుడు సాయి వెంకట యోగేశ్వర శర్మ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు ఫిల్మ్ నగర్‌లో గల ఫిల్మ్ ఛాంబర్‌లో సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శన కోసం 'సిరివెన్నెల' భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజశేఖర్ - జీవిత దంపతులు సహా పలువురు సినీ ప్రముఖులు... ఏపీ మంత్రి పేర్ని నాని, తెలంగాణ మంత్రి తన్నీరు హరీశ్ రావు తదితర రాజకీయ ప్రముఖులు 'సిరివెన్నెల'కు నివాళులు అర్పించారు.
'సిరివెన్నెల' మరణించిన నేపథ్యంలో బుధవారం విడుదల కావాల్సిన పాటలను 'భీమ్లా నాయక్', 'రాధే శ్యామ్' చిత్ర బృందాలు విడుదల చేయలేదు. 'రాధే శ్యామ్' పాటను గురువారం విడుదల చేయనున్నట్టు తెలిపారు. 'భీమ్లా నాయక్' పాటను ఎప్పుడు విడుదల చేస్తారన్నది ఇంకా క్లారిటీ లేదు. డిసెంబర్ 3న జరగాల్సిన 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని సైతం వాయిదా వేశారు.
Also Read: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
Also Read: సీతారాముడూ.. నిన్ను గుర్తు చేసుకుంటూ బతికేస్తాం, పోయిరా నేస్తం.!
Also Read: తెలుగు అక్షరానికి పాటలతో స్వరాభిషేకం చేసిన సిరివెన్నెలకు ఇదే సిని"మా" నివాళి
Also Read: నా కంటే రెండు నెలలే పెద్దవాడు.. తనికెళ్ల భరణి కన్నీళ్లు.. ఓదార్చడం త్రివిక్రమ్ వల్ల కూడా కాలేదు!
Also Read: 'సిరివెన్నెల' కోసం అయ్యప్పమాల తీసి మరీ వచ్చిన చిరంజీవి... ఆస్పత్రిలో చేరడానికి ముందు ఫోనులో మాట్లాడగా!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి