By: ABP Desam | Updated at : 30 Nov 2021 08:05 PM (IST)
చిరంజీవి
'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఆస్పత్రిలో చేరడానికి ముందు ఆయనతో ఫోనులో మాట్లాడానని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. "ఆస్పత్రిలో చేరే ముందు నాతో సిరివెన్నెల 'నెలాఖరుకు వస్తాను. వచ్చిన తర్వాత మీరు చెప్పినట్టుగా చెన్నైలో అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉన్న ఆస్పత్రికి వెళ్దాం. మీరు తీసుకువెళ్లండి' అన్నారు. ఈ రోజు ఆస్పత్రి నుంచి వస్తారని అనుకున్నాను. కానీ, జీవం లేకుండా వస్తారని అసలు ఊహించలేదు. చాలా బాధగా అనిపిస్తోంది" అని కిమ్స్ ఆస్పత్రి దగ్గర చిరంజీవి మాట్లాడారు.
'సిరివెన్నెల' మరణవార్త తెలిసిన వెంటనే... ఆయన్ను చివరి చూపు చూడటం కోసం చిరంజీవి కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఈమధ్య చిరంజీవి అయ్యప్పమాల ధరించిన సంగతి తెలిసిందే. ఆయన కొత్త సినిమా ప్రారంభోత్సవానికి, ఇతర ఫంక్షన్స్ కు అయ్యప్పమాలలో హాజరయ్యారు. అయితే... కిమ్స్ ఆస్పత్రికి మాల తీసేసి వచ్చారు.
చిరంజీవి మాట్లాడుతూ "ఆస్పత్రిలో చేరే ముందు ఆయనతో అరగంట మాట్లాడాను. ఎప్పటిలా హుషారుగా, ఎనర్జీతో మాట్లాడారు. ఆయన తిరిగొస్తారని అనుకున్నాను. ఆయన నాకు ఎన్నో పాటలు రాశారు. అందులో కొన్ని పాటలు వింటుంటే తృప్తిగా ఉంటుంది. నన్ను ఎప్పుడూ మిత్రమా అని పిలిచేవారు. మేం ఒకే ఏడాది పుట్టాం. మాది ప్రత్యేక బంధం. ఆ రోజు నేను మాట్లాడినప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పక్కన ఉన్నారట. ఆ విషయం ఇప్పుడు చెప్పారు. నేను సిరివెన్నెలగారి అమ్మాయితో కూడా మాట్లాడాను. 'నాన్నగారు వచ్చేస్తారండీ' అని చెప్పారు. ఈ రోజు ఒక గొప్ప కవి వృక్షం కోల్పోయిందని చెప్పాలి. ఆయనలో శ్రీశ్రీ లో ఉన్నంత ఆవేశం ఉంది. వేటూరిలో ఉన్నటువంటి అర్థవంతమైన సాహిత్యం ఉంది. ఆయనలో అన్ని రకాల కోణాలు ఉన్నాయి. శ్రీశ్రీని, వేటూరిని కలబోసిన మనిషి అని చెప్పవచ్చు. తెలుగు సాహిత్యానికి సంబంధించి లాస్ట్ లెజెండ్... సిరివెన్నెల. ఏ పూటకు ఆ పూట, ఏ పాటకు ఆ పాట లాంటి కవి ఉంటారేమో కానీ, ఆయన లాంటి మహా కవి ఇక రారు. ఆయన లోటు ఎవరూ తీర్చలేనిది" అని అన్నారు. ఆస్పత్రి దగ్గర చిరంజీవి వెంట త్రివిక్రమ్ ఉన్నారు.
చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో చిత్రాలకు 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి పాటలు రాశారు. 'రుద్రవీణ'లో ఆయన రాసిన పాటలను ఎవరూ అంత త్వరగా మరువలేరు. చిరంజీవి కుటుంబం నుంచి హీరోలుగా వచ్చిన పవన్ కల్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తదితరుల సినిమాల్లోనూ పాటలు రాశారు.
Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
Also Read: సిరివెన్నెల రాసిన ఈ రెండు పాటలే చివరివి... ఆర్ఆర్ఆర్‌లో ఆ పాట కూడా...
Also Read: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
Also Read: సిరివెన్నెల పాట.. ప్రశ్నించే తూటా..
Also Read: వేల పాటలు రాసిన సిరివెన్నెలకు నచ్చిన పాట ఏది? నెటిజన్ల ముచ్చట్లలో ఏం చెప్పారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Son Of India in OTT: ఓటీటీలో ‘సన్ ఆఫ్ ఇండియా’, స్ట్రీమింగ్ మొదలైంది!
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
F3 Telugu Movie Song: పూజా హెగ్డేతో వెంకీ, వరుణ్ చిందులు - ‘లైఫ్ అంటే ఇట్టా ఉండాల’ సాంగ్ రిలీజ్
O2 Movie Telugu Teaser: నయన తార ‘O2’ టీజర్, ఊపిరి బిగపెట్టుకుని చూడాల్సిందే!
Astrology: మీరు నవంబరులో పుట్టారా, ఆ ఒక్క లక్షణం మార్చుకుంటే మీరే రాజు మీరే మంత్రి
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Today Panchang 18th May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వినాయక శ్లోకం