IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Sirivennela: వేల పాటలు రాసిన సిరివెన్నెలకు నచ్చిన పాట ఏది? నెటిజన్ల ముచ్చట్లలో ఏం చెప్పారు?

ఏడాది క్రితం సోషల్‌ మీడియాలో అడుగు పెట్టిన సిరివెన్నెల  సీతారామశాస్త్రి తరచూ తన ఆలోచనలు నెటిజన్లతో పంచుకునే వారు. ఈ ఏడాది జూన్‌లో నెటిజన్లతో మనసు విప్పి మాట్లాడి ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. 

FOLLOW US: 

ప్రశ్న: త్రివిక్రమ్‌ మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అనడానికి కారణమేంటి?

సిరివెన్నెల: మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పనిచేస్తాను కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు.

ప్రశ్న: అప్పటిలో ఉన్న పాటలు సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు?

సిరివెన్నెల: ప్రతీ కాలంలోనూ పాటలూ, సినిమాలూ అన్నీ అన్నిరకాలుగానూ, ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు, భిన్నంగా ఉన్నదాని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలు ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవిచూద్దాం.

ప్రశ్న: జాను సినిమాలోని లైఫ్‌ ఆఫ్‌ రామ్‌ పాటలో మీకు నచ్చిన లైన్ ఏంటి

సిరివెన్నెల: "ఇలాగే కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతు ఉన్నా" అది నా ఆలోచనా ప్రపంచానికి కేంద్ర బిందువు.

ప్రశ్న: మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని ఎక్కువ శ్రమ కలిగించిన పాట ఏది?

సిరివెన్నెల: పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు.

ప్రశ్న:మీకు నచ్చిన సినిమా ఏది. మీ దృష్టిలో సినిమా అంటే ఏంటి?

సిరివెన్నెల: లిస్టు చాలా పెద్దది, "పిట్టభాష" సరిపోదు. ఇక - కథని చెప్పడం, చూపడం - రెండు ప్రక్రియలు. చెప్పడం సులభం, చూపడం కష్టం. సినిమా ఆ పని చేస్తుంది. కావ్యేషు నాటకం రమ్యం అని అందుకే అన్నారు. రక్తమాంసాలున్న పాత్రలతో కథని చూపడం అనే పనిచేసే సినిమా అన్నది నాకు ఇష్టం.

ప్రశ్న:ఇన్నేళ్లు మీ సాహిత్య ప్రయాణంలో మీరు ప్రయోగించిన మీరు గర్వించదగ్గ పదం 

సిరివెన్నెల: ప్రశ్న-కొడవలిలా ఉండే కుత్తుక కోస్తూ వెంటడే ప్రశ్న

ప్రశ్న:దైవాన్ని నిర్వచించాలంటే

సిరివెన్నెల: తనను తాను నిర్వచించుకోగలగాలి 

ప్రశ్న:మీ పాటల్లో మీరు గర్వించే పాట 

సిరివెన్నెల: ప్రతీ పాట గర్వించదగ్గదే. 

ప్రశ్న:వేటూరికి రాసిన పాటల్లో ఏ పాట ఇష్టం. మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం ఉందా?

సిరివెన్నెల: చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. "నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే" అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు.

ప్రశ్న: మెళకువ ఉన్నంత సేపు ఎక్కువ టైం ఏం చేస్తారు?

సిరివెన్నెల: ఈ మధ్య కాలంలో ఐపాడ్‌తో గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తాను. 

ప్రశ్న:ఫిలాసఫీ చూపులో ప్రపంచమో భూటకమా?

సిరివెన్నెల: మనని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే!

ప్రశ్న:మీరు ప్రజలకు చదవమని చెప్పే ఐదు పుస్తకాలు ఏంటి?

సిరివెన్నెల: నేను ప్రజలకు ఫలానా పుస్తకం చదవమని ఎప్పుడూ చెప్పలేదు. అది జీవితాన్ని తీవ్రమైన అక్కరతో బ్రతకడం అలవాటు చేసుకుంటే ఎప్పుడు ఏది చదవాలో, ఎప్పుడు ఏది కావాలో జీవితమే తెచ్చి ఇస్తుంది. "ఊరికే పేజీలు తిరగేసే బ్రెయిన్ లైబ్రరీలో బీరువాలాంటిది."

ప్రశ్న:ఇన్నేళ్ళుగా మిమ్మల్ని, మీ కలాన్ని నడిపిస్తున్న స్ఫూర్తి ఏంటి? 

సిరివెన్నెల: అత్యంత తీవ్రతతో ప్రతీ క్షణాన్నీ గమనించడం, ప్రతీ నిమిషంతో స్పర్ధించడం - అదే నా ప్రేరణ.

ప్రశ్న:ఏకాగ్రతకు మీ నిర్వచనం?

సిరివెన్నెల: నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం, నేను తప్ప ఇంకేం అనిపించకపోవడం.

ప్రశ్న:మీకు నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్

సిరివెన్నెల: ఒక వ్యక్తి ఉండరు, వ్యక్తీకరణ ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి గొప్పగానే చేస్తారు. ఒక్క మ్యూజిక్ విషయంలోనే కాదు, ఏ ప్రతిభా వ్యక్తీకరణకైనా ఇదే వర్తిస్తుంది.

ప్రశ్న:చెంచాడు భవసాగరాన్ని ఈదడానికి అవశ్యమైన సాధనాలేంటి ?? 

సిరివెన్నెల: ఆమాట అన్నది అమృతం సీరియల్ రూపకర్త గుణ్ణం గంగరాజు. మీ ప్రశ్నకు సమాధానం ఏమిటి అంటే - "భవసాగరాన్ని ఒక చెంచాడే అనుకోగలగడం"

ప్రశ్న:రచయితకి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి ?

సిరివెన్నెల: తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం

ప్రశ్న:ద‌ర్శ‌కుడు ఓ సంద‌ర్భాన్ని వివ‌రించిన‌ప్పుడు.. అందులో మీవైన భావాలు, అభిప్రాయాలూ జోడించాల‌ని చూస్తారా?  లేదంటే ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌లే... మీ పాట‌కు ముడిస‌రుకుగా వాడుకుంటారా?  మీ భావాలు సంద‌ర్భాన్ని డామినేట్ చేయ‌కుండా ఉండ‌డానికి మీరు చేసే ప్ర‌త్యేక‌మైన క‌స‌ర‌త్తేంటి?
 
సిరివెన్నెల: దర్శకుడు నాకు భిన్నంగా ఉన్నాడని అని అనుకోకపోవడం. అతని భావాలను, ఆలోచనలు నావిగా చేసుకుని చెప్పాలనే ప్రయత్నం చేయడం. కాస్త ఇటుఅటు అయినా ప్రతీ ఒక్కరూ మనిషే, ప్రతీ భావమూ మనిషి భావమే.

ప్రశ్న:మళ్ళీ తెలుగు సాహిత్యపు స్వర్ణ యుగం చూసేదెప్పుడు 

సిరివెన్నెల: సాహిత్యానికి ముందు తెలుగు అనో, మరోటనో చేర్చకూడదు. భాషతో సంబంధం లేనిది భావం. భావాలు అనేవి అన్ని విధాలుగానూ ఉంటాయి. ధాన్యం పొట్టుతో పాటే ఉంటుంది. దూగర దులిపి, గింజను ఏరుకోవడం ఎప్పుడూ జరగాల్సిన పనే. ఎప్పుడూ మనకు కావాల్సింది ఉంటుంది. మనం చేయాల్సింది ఏరుకోవడమే.

ప్రశ్న:దేవులపల్లి సాహిత్యంలో మీకు బాగా నచ్చిన కవిత?

సిరివెన్నెల: మ్రోయించకోయి మురళీ, మ్రోయించకోయి కృష్ణా "తియ్య తేనియ బరువు మోయలేదీ బరువు" - వివరణ అనేది దాహం తీర్చుకునేవారి పాత్రతను బట్టి, పాత్రను బట్టి ఉంటుంది.

ప్రశ్న:మీరు హేతువాది అయినప్పటికీ దేవుడు ఉన్నాడని మీరు ఎలా నమ్ముతారు ?

సిరివెన్నెల: నేనున్నాను గనుక!

ప్రశ్న:రచయితలు-  సాంఘీకీకరణ ( socialization) పైన మీ అభిప్రాయం ఏమిటి? 

సిరివెన్నెల: "సరిగా చూస్తున్నదా నీ మది... గదిలో నువ్వే కదా ఉన్నది... చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది" No man is island

ప్రశ్న:మీరు రాసిన పాటల్లో మీకు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిన రెండు పాటలు చెప్పండి 

సిరివెన్నెల: "నా పాట పంచామృతం నా గానాన గీర్వాణి స్నానాలు శాయంగ"
"సృష్టి కావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించితిని"

ప్రశ్న:కొంతమంది గాయకులు మీ పాటలను ఖూనీ చేసినట్టు గానీ, సంగీత దర్శకులు ఆ విషయాన్ని విస్మరించిరించినట్టు గానీ మీకెప్పుడైనా అనిపించిందా ? 

సిరివెన్నెల: బియ్యంలో రాళ్ళు ఏరుకుని వండుకుంటాం, అన్నంలో తగిలిన రాళ్ళను పక్కన తీసిపెట్టి తింటాం. "చూపులను అలా తొక్కుకు వెళ్ళకు" అని మీకూ తెలుసు, ఎవరినో ఎందుకు నిందించడం


ప్రశ్న:యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం? నిజమా? 

సిరివెన్నెల: తప్పే! మృగాలను అవమానించకూడదు.


ప్రశ్న:ప్రేమ పాటలు అద్భుతంగా రాసే మీకు, కావలసిన  ప్రేరణ, స్ఫూర్తి ఎవరి నుండి కలుగుతుంది?

సిరివెన్నెల: బ్రతుకంతా ప్రేమే! ప్రేమ నుంచే ప్రేమ వస్తుంది!


ప్రశ్న:పాటలో ' నిరాశ / నిస్పృహ లు ' వ్యక్తపరిచే  సందర్భంలో కూడా, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ను దాటి ఓ ఆశావాద కోణం కూడా ఇనుమడింపజేస్తూ వచ్చారు. ఆ తూకం పాటించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా ?

సిరివెన్నెల: కాలం గాయాన్ని మాన్పుతుంది అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉధృతిని మోతాదు మించనివ్వం. "నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండ ఉండగలమా"

ప్రశ్న:మీరు యూత్ కి ఇచ్చే సందేశం ఏంటి?

సిరివెన్నెల: యూత్ అనేది ఏజ్ కాదు. అదొక ఫేజ్. అదొక స్టేజ్. అది తెలుసుకుంటే - Youth itself is a message.

ప్రశ్న:సిరివెన్నెల గారు పాటల రచయిత కాకపోయి ఉంటే?

సిరివెన్నెల: జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది.

ప్రశ్న:తెలుగు భాష గొప్ప తనం ఏంటి??

సిరివెన్నెల: ఏ భాష ప్రత్యేకత ఆ భాషదే! అసలు సమస్య ఏమిటంటే మనుషులందరినీ కలపాల్సినటువంటి భాష... "లు" తగిలించుకుని ఇన్నిగా ఎందుకుండాలి?

ప్రశ్న:మీకు బాగా నచ్చిన పుస్తకం 

సిరివెన్నెల: నా స్వల్ప అనుభవానికి సంబంధించి ఇష్టమైనవి రెండు పుస్తకాలు. ఒకటి భగవద్గీత, రెండు - ఖలీల్ జిబ్రాన్ రాసిన "ద ప్రాఫెట్"

ప్రశ్న:మీకు బాగా నచ్చిన కవి ఎవరు?

సిరివెన్నెల:  వాల్మీకి

ప్రశ్న: కాశీ పట్నం రామారావుపై గురించి చెప్పండి?

సిరివెన్నెల: కథా యజ్ఞానికి ప్రధాన ఋత్విజుడు కాళీపట్నం రామారావు మాస్టారు. జీవితం అంతటినీ కథ అనే సాహితీ ప్రక్రియకు అంకితం చేసిన మహా వ్యక్తి. కథని పదికాలాల పాటు పచ్చగా ఉంచడానికి పెంచడానికి తన యాగఫలాన్ని ధారపోసి వెళ్లారు.

అడపాదడపా ఇలా కలుసుకుని మాటా మాటా అనుకుందాం!  బావుంటుంది!!! అన్నారు. కానీ.... ఇలా సాహిత్యపు తోటలో మనల్ని వదిలేసి అస్తమించిపోయాడీ రాత్రి సూరీడు. 

 

Published at : 30 Nov 2021 06:04 PM (IST) Tags: Siramasastry Sirivennela Siramasastry

సంబంధిత కథనాలు

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Chiru Vs Vikram: బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ - ఎవరైనా తగ్గుతారా?

Akira Nandan: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్

Akira Nandan: 'ఆర్ఆర్ఆర్' సాంగ్ కి పియానో వాయించిన అకీరా నందన్ - వీడియో వైరల్

Upcoming Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోయే సినిమాలివే!

Upcoming Movies: ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోయే సినిమాలివే!

Pawan Kalyan: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

Pawan Kalyan: పిల్లలతో పవన్ కళ్యాణ్, ‘నిజమైన జర్నీ ఇప్పుడే మొదలవుతుంది’ - రేణు దేశాయ్ పోస్ట్!

Vijay Devarakonda Samantha Injured?: విజయ్ దేవరకొండ, సమంతకు ఎటువంటి గాయాలు కాలేదు

Vijay Devarakonda Samantha Injured?: విజయ్ దేవరకొండ, సమంతకు ఎటువంటి గాయాలు కాలేదు
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Congress Task Force 2024: టాస్క్ ఫోర్స్ టీమ్‌ను ప్రకటించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా G 23 నేతలకు కాంగ్రెస్ షాక్

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Bindu Madhavi: బాత్రూమ్ లో బిందు మాధవి స్మోకింగ్ - నిజమేనా?

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

Quad Summit 2022: భారత్‌, అమెరికా బంధం మరింత పటిష్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం- జపాన్‌లో మోదీతో బైడెన్‌

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో