Imran Khan Murder: ఇమ్రాన్‌ఖాన్‌ను పాక్ జైల్లో హత్య చేశారు - ఆప్ఘన్ మీడియా సంచలన ప్రకటన
Imran Khan: పాకిస్తాన్ జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేశారని ఆఫ్ఘన్ మీడియా ప్రచారం చేస్తోంది. కానీ పాకిస్తాన్ మాత్రం ఖండిస్తోంది.

ExPak PM Imran Khan Murdered In Adiala Jail: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను అడియాలా జైలులో 'రహస్యంగా' చంపేశారని అఫ్ఘాన్ మీడియా ప్రకటించింది. అయితే, పాకిస్తాన్ ప్రభుత్వం, సైనిక అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారని చెబుతోంది. ఆప్ఘన్ మీడియా చేసిన ప్రచారంతో రావల్పిండిలోని అడియాలా జైలు వద్ద వేలాది మంది పీటీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
అఫ్ఘాన్ న్యూస్ వెబ్‌సైట్ 'అఫ్ఘానిస్తాన్ టైమ్స్' మంగళవారం రాత్రి సంచలన ప్రకటన చేసింది. "పాకిస్తాన్‌లోని విశ్వసనీయ మూలాలు తెలిపిన సమాచారం ప్రకారం, పీటీఐ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ను అడియాలా జైలులో రహస్యంగా చంపేశారు. అతని శవాన్ని జైలు నుంచి బయటకు తరలించారు" అని ఆ వార్తలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలు 'కాబుల్ ఫ్రంట్‌లైన్' వంటి ఇతర అఫ్ఘాన్ మీడియా ఔట్‌లెట్లలో కూడా విస్తృతంగా ప్రచారం అయ్యాయి. 'పాకిస్తాన్ సైన్యంలోని రహస్య వ్యక్తులు' ఇచ్చిన సమాచారం అని చెప్పుకున్నారు. కానీ ఎలాంటి ఆధారాలు లేవు.
పాకిస్తాన్ అధికారులు ఈ ఆరోపణలను 'తప్పుడు వార్త'గా ఖండించారు. "ఇమ్రాన్ ఖాన్ క్షేమంగా ఉన్నాడని.. అతనికి ఎలాంటి హాని జరగలేదు. ఈ రూమర్‌లు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించడానికి ఉద్దేశించినవి" అని పాకిస్తాన్ సమాచార మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. అడియాలా జైలు సూపరింటెండెంట్ కూడా ఖాన్ ఆరోగ్యం బాగుందన్నారు. అతను తన ట్విట్టర్ ఖాతాను కూడా జైలు నుంచి నిర్వహిస్తున్నాడనే ఆరోపణలు తప్పు అని ఇస్లామాబాద్ కోర్టులో సోమవారం స్పష్టం చేశారు. పాకిస్తాన్ మొబైల్ ఆపరేటర్లు కూడా ఈ రూమర్‌లు 'ఫేక్ న్యూస్'గా గుర్తించి, వాటిని అడ్డుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ రూమర్ వల్ల పీటీఐ కార్యక్రతలు మండిపడ్డారు. మంగళవారం అడియాలా జైలు వద్ద వేలాది మంది సమావేశమై, ఖాన్ ఆరోగ్యం గురించి సమాచారం కోరుతూ నిరసనలు చేశారు. ఖాన్ సోదరి అలీమా ఖాన్, డాక్టర్ ఉజ్మా, నూరీన్ నియాజీలు జైలు గేటు వద్ద కూర్చుని ధర్నా చేశారు. అయితే, పోలీసులు వారిని బయటకు తీసుకెళ్లారు. 3 రోజులుగా మిమ్మల్ని ఇమ్రాన్ ఖాన్‌తో కలవనీయకుండా ఆపేశారు. అతనికి ఏమైందో తెలుసుకోవాలి అని అలీమా ఖాన్ మీడియా ముందు డిమాండ్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అడియాలా జైలులో ఉన్నారు. అవినీతి, రాష్ట్ర ద్రోహం వంటి 20కి పైగా కేసుల్లో అతనిక శిక్ష విధించారు. గత నెలలో అతను సైనిక అధిపతి అసీమ్ మునీర్‌పై తీవ్రంగా విమర్శించాడు. డెమోక్రసీని చీల్చి, 'అసీమ్ లా'ను రుద్దుతున్నారు" అని ఖాన్ పేరిట జైలు నుంచి ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ రూమర్‌ను నమ్మేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్‌ను బయటకు చూపించాలని డిమాండ్ చేసేవారు పెరుగుతున్నారు.





















