అన్వేషించండి
NBK111 Begins With Pooja: పూజతో మొదలైన ఎన్‌బీకే111... బాలకృష్ణ కొత్త సినిమా ఓపెనింగ్‌లో ఎవరెవరు సందడి చేశారో చూశారా?
NBK111 Opening Photos: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా 'వీర సింహా రెడ్డి' విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సినిమా ఈ రోజు పూజతో మొదలైంది.
బాలకృష్ణ కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలు
1/9

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా 'వీర సింహా రెడ్డి' వంటి సంచలన విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్తగా ఓ సినిమా మొదలైంది. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇవాళ పూజతో ఈ సినిమా మొదలైంది.
2/9

ముహూర్తపు సన్నివేశానికి బాలకృష్ణ హీరోగా పలు బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకుడు బి గోపాల్ క్లాప్ కొట్టారు.
3/9

బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
4/9

తొలి సన్నివేశానికి బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు సమిష్టిగా గౌరవ దర్శకత్వం వహించారు.
5/9

దర్శకుడు గోపీచంద్ మలినేని, నిర్మాత వెంకట సతీష్ కిలారుకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్ అందజేశారు.
6/9

బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కలయికలోని ఈ తాజా సినిమా ప్రారంభోత్సవానికి పలువురు దర్శకులు, నిర్మాతలు, ప్రముఖులు హాజరు అయ్యారు.
7/9

బాలకృష్ణ పలు చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు రాసిన సాయిమాధవ్ బుర్రా ఈ సినిమాకు పని చేస్తున్నట్లు తెలిసింది.
8/9

హిస్టారికల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార కథానాయికగా నటించనున్నారు. సింహ, జై సింహా, శ్రీ రామరాజ్యం తర్వాత వాళ్ళిద్దరి కలయికలో నాలుగవ చిత్రమిది.
9/9

బాలకృష్ణ కొత్త సినిమా ఓపెనింగ్ ఫోటోలు
Published at : 26 Nov 2025 03:36 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
బిజినెస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















