Rohit as ambassador of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ 2026 అంబాసిడర్‌గా రోహిత్
భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టీ20 మరియు టెస్ట్ మ్యాచ్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. హిట్‌మ్యాన్ గా పేరు పొందిన రోహిత్ శర్మ... అద్భుతమైన బ్యాటింగ్ స్టైల్, కెప్టెన్సీ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు దెగ్గరియాడు. కెప్టెన్ గానే కాకుండా ఒక ప్లేయర్ గా కూడా రోహిత్ శర్మ ప్రయాణం భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉంది.
రికార్డులు క్రియేట్ చేయడం... వాటిని తిరగరాయడం రోహిత్ శర్మకు కోతేమి కాదు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే ఏ ప్లేయర్ కు దక్కని గౌవరం రోహిత్ శర్మకు దక్కింది. మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్‌కు రోహిత్ శర్మను టోర్నమెంట్ అంబాసిడర్‌గా ఐసీసీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఐసీసీ చైర్మన్ జయ్ షా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2024 టీ 20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన కెప్టెన్ ... అలాగే ఇప్పటివరకు తొమ్మిది ఎడిషన్లలో పాల్గొన్న ప్లేయర్ కంటే ఈ ఈవెంట్‌కు మంచి ప్రతినిధి మరొకరు ఉండలేరు అని పేర్కొన్నారు జయ్ షా. దాంతో రోహిత్ శర్మ అభిమానులు సంతోషంతో పొంగిపోతున్నారు.





















