India vs South Africa Test Highlights | విజయం దిశగా సౌతాఫ్రికా
గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా విజయం దిశగా ముందుకెళ్తుంది. 549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లు ఇంకా తడబడుతూనే ఉన్నారు. 549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ వెంటనే వికెట్ కోల్పోయింది. ఒక సిక్స్, ఫోర్ కొట్టి యశస్వి జైస్వాల్ .. మార్కో జాన్సెస్ చేతిలో 13 పరుగులకే ఔట్ అయ్యాడు.
కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో మొదట్లోనే వికెట్లు కోల్పోయి భారత్ ఇబ్బందుల్లో పడింది. పిచ్ స్పిన్‌కు సహకరిస్తుండడంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఎలాగైనా రోజు మొత్తం ఆడి మ్యాచ్ డ్రా చేసుకునే దిశలో ఉన్నారు భారత బ్యాటర్లు.
నాలుగో రోజు 26 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సఫారీలు 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసారు. సఫారీ బ్యాటర్లలో ట్రిస్టన్ స్టబ్స్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.





















