అన్వేషించండి

Pawan Kalyan Palle Panduga: గ్రామాలకు పల్లెపండుగ 2.0 తీసుకొచ్చిన పవన్ - రూ. 6787 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పల్లె పండుగ 2.0ని ప్రారంభించారు. రూ. 6787 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు జరుగుతాయి.

Deputy CM Pawan Kalyan inaugurated Palle Pandaga 2: ‘రాష్ట్రంలోని గ్రామాల ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో 'పల్లె పండగ 2.0' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్    పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా 4 వేల కిలోమీటర్లు రోడ్లు నిర్మించినట్లే, పల్లె పండగ 2.0లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.  పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా 13,326 గ్రామ పంచాయతీల పరిధిలో రూ.6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం శివకోడులో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహిరంగసభలో మాట్లాడారు. 
 
పల్లె పండగ  విజయం ఇచ్చిన స్ఫూర్తిని కొనసాగిస్తూ పల్లె పండగ 2.0 కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పవన్ తెలిపారు.   పల్లె పండగ 1.0 కార్యక్రమం ద్వారా రూ. 2,525 కోట్ల విలువైన పనులు టైం బౌండ్ విధానంలో పూర్తి చేశాం. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. పాడి రైతుల కోసం 22,500 మినీ గోకులాలు ఏర్పాటు చేశాం. మూగజీవాల దప్పిక తీర్చడానికి 15 వేల నీటి తొట్టెలు నిర్మించాం. లక్షకు పైగా నీటి కుంటలు ఏర్పాటు చేశాం.  ఇప్పుడు పల్లె పండగ 2.0 కార్యక్రమం ద్వారా రూ. 5,838 కోట్ల అంచనా వ్యయంతో 8,571 కిలోమీటర్ల కొత్త రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు.  పాత రహదారులకు పునర్నిర్మాణం చేయబోతున్నాం. రూ. 375 కోట్ల వ్యయంతో 25 వేల మినీ గోకులాలు, రూ. 16 కోట్ల అంచనాతో 157 కమ్యూనిటీ గోకులాలు ఏర్పాటు చేస్తాం. రూ. 4 కోట్ల వ్యయంతో 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశాం. పంచాయతీల పరిధిలో రూ. 406 కోట్లతో 15 వేల కొత్త అభివృద్ధి పనులు ప్రారంభిస్తాం. రూ.148 కోట్లతో డీపీఆర్సీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం చేయనున్నాం.  వీటితోపాటు కోనసీమకు అదనంగా మరో రూ.100 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. 

గత ఐదేళ్ల వైసీపీ పాలనను ఒకసారి గుర్తు చేసుకుంటే గుంతలుపడ్డ రోడ్లు, మరమ్మతులు నోచుకోని కాలువలు, పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులు గుర్తుకొస్తాయి. గత ప్రభుత్వం నుంచి మన ప్రభుత్వానికి వారసత్వంగా ఏదైనా వచ్చింది అంటే అవి అప్పులు, సమస్యలు మాత్రమే. గత ప్రభుత్వ హయాంలో నాయకుల దగ్గరకు వెళ్లి ఇది చేయండి అని అడిగే పరిస్థితి ఉండేది కాదు. మార్పు కావాలని యువత బలంగా తీసుకున్న నిర్ణయంతో ఈ రోజు ప్రభుత్వం మారిపోయింది. అభివృద్ధి పనులకు వేల కోట్లు ఖర్చు చేయగలుగుతున్నామన ిగుర్తుచేశారు.   

గత ప్రభుత్వంలా మేము దోచుకోవడం లేదు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం లేదు. సంక్షేమం పేరుతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం లేదు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నాం. అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పెన్షన్లు మీకంటే బలంగా ఇస్తున్నాం. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక తరహాలో ఇక్కడ విప్లవాలు వస్తాయని కొంతమంది నాయకులు కలలు కంటున్నారు. గత ప్రభుత్వం ఇంకో ఏడాది అధికారంలో ఉంటే అలాగే జరిగేది. కానీ అదృష్టవశాత్తు ఎలాంటి గొడవలు లేకుండానే ఓటు అనే ఆయుధంతో యువత ప్రభుత్వాన్నే మార్చేశారని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Kiran Abbavaram : ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
ఇంద్రపుత్రగా కిరణ్ అబ్బవరం - ఫస్ట్ పాన్ ఇండియా మూవీ
Embed widget