Ashwin Tweet on Ind vs SA Test Match | వైరల్ అవుతున్న అశ్విన్ పోస్ట్
మొదటి టెస్ట్ మ్యాచ్ లో జరిగిన గాయం కారణంగా సఫారీలతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ కు దూరమైయ్యాడు కెప్టెన్ శుబ్మన్ గిల్. దాంతో రెండో టెస్ట్ కు రిషబ్ పంత్ కెప్టెన్ భాద్యతలను తీసుకున్నాడు. అయితే రిషబ్ తీరుపై సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. మొదటి ఇన్నింగ్స్‌లో పంత్ చాలా నిర్లక్ష్యంగా ఆడడం వల్లే వికెట్ కోల్పోయ్యాడని .. అలాగే కెప్టెన్ గా సరైన నిర్ణయాలు తీసుకోలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దాంతో నెటిజన్స్ తోపాటు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యాడు.
“రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌తో టీమ్ మళ్లీ పుంజుకుంటుంది అనే ఆశ ఉంది. కానీ మైదానంలో కనిపించిన బాడీ లాంగ్వేజ్ మాత్రం ఆశించినట్టుగా లేదు” అంటూ అశ్విన్ హార్ట్ బ్రేక్ సింబల్‌తో ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
మొదటిసారి టెస్ట్ టీమ్ కు సారధ్యం వహిస్తున్న పంత్ .. తన బ్యాటింగ్ వల్లే ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ ఎదుర్కుంటున్నాడు. వరుసగా వికెట్స్ కోల్పోతూ.. పీకల్లోతు కష్టాలో టీమ్ ఉంటె రిస్క్ షార్ట్స్ ఆడడం సరికాదు అని విశ్లేషకులు కూడా విమర్శిస్తున్నారు.





















