Fake IPS: అవసరానికి అయితే IAS లేకపోతే IPS - ఎంత మోసం చేశావు గురూ !
Fake IPS Crime: నకిలీ ఐఏఎస్ అధికారిని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బిల్డర్లు, వ్యాపారులను మోసం చేసి లక్షలు దోచుకున్నట్లు గుర్తించారు.

Fake IAS officer arrested : హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో నకిలీ IPS అధికారి శశికాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. IPS, IAS అధికారి అని చెప్పుకుని గత కొన్ని నెలలుగా రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులను మోసం చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకున్నట్టు పోలీస్ విచారణలో తేలింది. ఇద్దరు గన్‌మెన్లను అద్దెకు పెట్టుకుని 'స్పెషల్ ఆఫీసర్' అని చెప్పుకుంటూ బెదిరించి, పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతో పాటు, గన్‌మెన్లతో మరిన్ని బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పోలీసులు నిందితుడ్ని ఆరా తీశారు.
గన్‌మెన్లను అద్దెకు పెట్టుకుని వారితో బెదిరింపులు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు చెందిన స్పెషల్ టీమ్ ఈ కేసులో దర్యాప్తు చేపట్టింది. పోలీసుల సమాచారం ప్రకారం, శశికాంత్ హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో నివసిస్తూ, తనను IPS అధికారి అని పరిచయం చేసుకుని బిల్డర్లతో సంప్రదింపులు జరుపుతూ వచ్చాడు. స్పెషల్ ఆఫీసర్ గా తాను పనిచేస్తున్నానని చెప్పుకుని, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుమతులు, లైసెన్సులు ఇస్తానని హామీ ఇచ్చి డబ్బులు తీసుకున్నాడు. మొత్తం ఐదుగురు బిల్డర్ల నుంచి 15 లక్షలకు పైగా వసూలు చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే ఇద్దరు గన్‌మెన్లను అద్దెకు పెట్టుకుని బెదిరించేవాడు.
ప్లాన్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బుల వసూలు - తర్వాత కంటికి కనిపించడు !
ఈ మోసాలు గత మూడు నెలలుగా జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. శశికాంత్ ముందుగా బిల్డర్ల ఆఫీసులకు వెళ్లి ఫేక్ ID కార్డులు చూపించి నమ్మించేవాడు. గన్‌మెన్లు కూడా పోలీస్ యూనిఫాం ధరించి, తుపాకీలతో బెదిరించడంతో బిల్డర్లు భయపడి డబ్బు ఇచ్చేశారు. శశికాంత్ తనను సీనియర్ IPS అధికారి అని చెప్పి, మా ఫ్లాట్ ప్రాజెక్టుకు అనుమతి ఇస్తానని లక్షలు తీసుకున్నాడు. తర్వాత ఇవ్వకపోతే, గన్‌మెన్లు వచ్చి కాల్చేస్తామని బెదిరించాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసి ట్రాప్ చేశారు.నవంబర్ 25 రాత్రి శశికాంత్‌ను అతని ఫ్లాట్‌లోనే పట్టుకున్నారు.
పక్కాగా ఐపీఎస్ పేరుతో మోసం - ఊరుకుంటారా?
అరెస్టు సమయంలో ఫేక్ ID కార్డులు, IPS బ్యాడ్జ్, రూ. 2.5 లక్షల నగదు, మూడు మొబైల్ ఫోన్లు, గన్‌మెన్ల అద్దె డీటెయిల్స్ స్వాధీనం చేసుకున్నారు. గన్‌మెన్ల ఇద్దరినీ కూడా గుర్తించి ట్రాక్ చేస్తున్నారు. పోలీసులు శశికాంత్ మీద IPC సెక్షన్లు 420 (మోసం), 506 (బెదిరించడం), 384 (ఎక్స్‌టార్షన్), 34 (కాంబిన్డ్ కుట్ర) కింద కేసు నమోదు చేశారు. అదనంగా, ఆయుధాల చట్టం కింద కూడా చర్యలు తీసుకుంటారు.





















