Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల రాసిన ఈ రెండు పాటలే చివరివి... ఆర్ఆర్ఆర్‌లో ఆ పాట కూడా...

సిరివెన్నెల కలం ఆగిపోయింది. ఆయన రాసిన పాటల్లో చివరి పాటలు ఈ రెండే.

FOLLOW US: 

తెలుగు చిత్రసీమలో మరో విషాదం... ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ చనిపోయిన వార్త ఇంకా మరిచిపోకముందే సిరివెన్నెల లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. దీంతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. సిరివెన్నెల అనారోగ్యంతో నవంబర్ 24 న హైదరాబాద్‌లోకి కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించి నవంబర్ 30 సాయంత్రం మరణించారు. చివరిగా ఆయన కలం నుంచి జాలువారిన పాటలు గురించే ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు. 

చివరి పాట అదే...
సిరివెన్నెల చివరిగా నాని  హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’సినిమాలో రెండు పాటలు రాశారు. ఆ రెండు పాటలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఆ పాటలేంటో తెలుసుకునేందుకు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ఇక విడుదలైన పాటల్లో చివరిది ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘ఉలికి విలుకాడికి’ అని మొదలయ్యే దోస్తీ సాంగ్. ఈ పాట సినిమా విడుదలకు ముందే హిట్ కొట్టింది. దోస్తీ సాంగ్ మొత్తం స్నేహం గురించి రాసినదే. ఈ పాటను హేమచంద్ర పాడారు. ఈ పాటలోని ప్రతి పదం తెలుగు పాట విలువను పెంచేలా ఉంది. 

ఉలికి విలుకాడికి తలకి ఉరితాడుకి
కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి
రవికి మేఘానికి దోస్తీ దోస్తీ

ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ఓఓ

దర దందర దందర దం దం
దర దందర దందర దం దం
దర దందర దందర దం దం
దందర దం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తి
విధిరాతకి ఎదురీతకి దోస్తి
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

దర దందర దందర దం దం
దర దందర దందర దం దం
దర దందర దందర దం దం
దందర దం దం దందం

ఆనుకోని గాలి దుమారం
చెరిపింది ఇరుగురి దూరం
ఉంటారా ఇకపై ఇలాగ
వైరమే కూరిమయ్
నడిచేది ఒకటే దారై
వెతికేది మాత్రం వేరై
తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై
తొందరపడి పడి ఊరకలెత్తే
ఉప్పెన పరుగులహో
ముందుగా తెలియదు
ఎదురు వచ్చే తప్పని మలుపులే ఓ
ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం
ప్రాణానికి ప్రయాణం ఇస్తుందో తీస్తుందో

దర దందర దందర దం దం
దర దందర దందర దం దం
దర దందర దందర దం దం
దందర దం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తి
విధిరాతకి ఎదురీతకి దోస్తి
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

దర దందర దందర దం దం
దర దందర దందర దం దం
దర దందర దందర దం దం
దందర దం దం దందం

బడబాగ్నికి జడివానకి దోస్తి
విధిరాతకి ఎదురీతకి దోస్తి
పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

Also read: నాలుగు రోజులుగా సిరివెన్నెల ప్రాణం నిలిచింది ‘ఎక్మో’పైనే... ఎక్మో అంటే? అదెలా ఆయన ప్రాణాలు నిలిపింది?

Also Read: సిరివెన్నెల దృష్టిలో 'క్లిష్టమైన పాట..'
Also Read: 'సిరివెన్నెల'కు ముందు సీతారామ శాస్త్రి జీవితం ఇదీ...

Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!

Also Read: తొలిపాటకే 'నంది' అందుకున్న సిరివెన్నెల.. రాయడానికి ఎన్నిరోజులు పట్టిందంటే.. 

Published at : 30 Nov 2021 06:29 PM (IST) Tags: Sirivennela Seetharama Sastry Sirivennela death సిరివెన్నెల పాటలు Sirivennela last songs RRR song Dosthi

సంబంధిత కథనాలు

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

The Conjuring House: ‘ది కంజూరింగ్’ హౌస్, ఆ దెయ్యాల కొంపను రూ.11 కోట్లకు అమ్మేశారు, చరిత్ర తెలిస్తే షాకవుతారు!

Crocodile vs Lions: వీడియో - ఒక మొసలి, మూడు సింహాలు - వామ్మో, ఫైట్ మామూలుగా లేదు!

Crocodile vs Lions: వీడియో - ఒక మొసలి, మూడు సింహాలు - వామ్మో, ఫైట్ మామూలుగా లేదు!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

Chilli Eating Record: ఓ మై గాడ్, ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయను చాక్లెట్‌లా తినేశాడు

Chilli Eating Record: ఓ మై గాడ్, ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయను చాక్లెట్‌లా తినేశాడు

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

Bermuda Triangle Tour: డెడ్లీ ఆఫర్, నౌకలో బెర్ముడా ట్రయాంగిల్‌కు టూర్, తిరిగి రాకపోతే ఫుల్ రిఫండ్!

టాప్ స్టోరీస్

IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?

IPL 2022 Final Prize Money: ఐపీఎల్ ప్రైజ్‌మనీ వివరాలు ఇవే - ఆటగాళ్లపై కనకవర్షం - ఎవరికి ఎంత లభించనుందంటే?

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

UIDAI Update: మాస్క్‌ ఆధార్‌ వినియోగంపై కేంద్రం వెనక్కి! తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Southwest Monsoon : కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, మరో వారంలో తెలుగు రాష్ట్రాలకు

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?

Infinix Note 12 Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ నోట్ 12 సేల్ ప్రారంభం - అదిరిపోయే ఫీచర్లు - ఎలా ఉందో చూశారా?