News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Sirivennela Sitarama Sastry: తొలి పాటకే ‘నంది’ అవార్డు.. ఆ సాహిత్యం కోసం ఆయన పడిన కష్టం ఇదే!

తొలిపాటకే నంది అవార్డు అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి...ఆ పాట ప్రత్యేకత ఏంటి..రాయడానికి ఎన్నిరోజులు పట్టిందో చూద్దాం...

FOLLOW US: 
Share:

సంగీతం అంటే ఒక ధ్వని, నాదం మాత్రమేనా. ఒక పాట మన మనసు లోతులను కదిలించి స్పందించేలా చేస్తుందంటే అందుకు కారణం ఆపాటలో సాహిత్యం. అలాంటి పాటల్లో తప్పనిసరిగా చోటుదక్కించుకునే పాట సిరివెన్నెల సినిమాలో విరించినై విరచించితిని ఈ కవనం పాట. ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్ర కలం నుంచి జాలువారిన మొదటిపాట. 

తెలుగు భాషపై మంచి పట్టుండడంతో  MA చదువుతుండగానే  సిరివెన్నెలకు అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ వెతికి పట్టుకున్న ఆణిముత్యం సీతారామ శాస్త్రి. సిరివెన్నెల సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని ఆయనకే ఇచ్చారు విశ్వనాథ్. ఆ నమ్మకాన్ని ఎంతలా నిలబెట్టుకున్నారంటే ఆయన రాసిన తొలిపాటకే నంది అందుకునేంతగా. మొదటగా రాసిన పాటే ‘విధాత తలపున ప్రభవించినది’. ఈపాట రాసేందుకు వారం రోజులు సమయం పట్టింది.

ఆపాట ఇక్కడ చూడండి.

పాటకు అర్థం ఇదే..
విధాత = బ్రహ్మ, సృష్టికర్త యొక్క
తలపున = ఊహలో
ప్రభవించినది = మెరిసినది
అనాది = మొదలు లేని
జీవన వేదం = ఈ సృష్టికి మూలమైన వేదం 
ప్రాణ నాడులకు = మనలో ప్రాణానికి మూలమైన నాడుల్లో
స్పందన నొసగిన = ఆ ప్రాణాన్ని తట్టి లేపిన
ఆది ప్రణవ నాదం = తొలి ఓంకారము
కనుల కొలనులో = కళ్ళే కొలనులు అయితే
ప్రతిబింబించిన = ఆ కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం = ఈ సృష్టి యొక్క రూప ఆవిష్కరణ
ఎద కనుమలలో = గుండె అనే పర్వత శ్రేణిలో
ప్రతిధ్వనించిన = మారుమ్రోగిన
విరించి = బ్రహ్మ యొక్క
విపంచి = వీణ
గానం = సంగీతం
సరస = నవరసాలు
స్వర = సంగీత స్వరం
సురఝరీ = దేవనది, గంగ
గమనమౌ = ప్రవాహము ఐనట్టి
సామవేద సారమిది = సామవేదం యొక్క సారాంశం ఇది
నే పాడిన జీవన గీతం ఈ గీతం = నే పాడిన ఈ పాట జీవిత గీతం
విరించినై = నేనే బ్రహ్మనై
విరచించితిని = రచించితిని
ఈ కవనం = ఈ కవిత్వం
విపంచినై = వీణనై
వినిపించితిని = వినిపిస్తున్నా
ఈ గీతం - ఈ పాట

ప్రాగ్దిశ వీణియ పైన = తూర్పు దిక్కు అనే వీణ మీద
దినకర మయూఖ తంత్రుల పైన = సూర్యకిరణాలనే తీగలు మీటుతూ
జాగృత విహంగ తతులే += నిద్రలేచిన పక్షి గుంపులు
వినీల గగనపు వేదిక పైన = నీలాకాశం అనే స్టేజి మీద
పలికిన కిలకిల స్వనముల = పలికిన కిల కిల ధ్వనులు
స్వరజతి = స్వరముల అమరిక, కృతి కీర్తన జావళి లాగా ఇది కూడా ఒక లాంటి పాట
జగతికి = ప్రపంచానికి , విశ్వానికి
శ్రీకారము కాగా = మొదలు కాగా
విశ్వకావ్యమునకి = విశ్వమనే కావ్యానికి
ఇది భాష్యముగా = వివరణగా

జనించు = పుట్టిన
ప్రతి శిశు గళమున పలికిన = ప్రతి శిశువు గొంతున పలికిన
జీవన నాద తరంగం = జీవితమనే ధ్వనికెరటం, అల
చేతన = చైతన్యం, అచ్తివషన్
ధ్వనించు = శబ్దం
హృదయ మృదంగ ధ్వానం - హృదయం మృదంగం వలె ధ్వనిస్తుంది.
అనాది = మొదలు లేని, చాలా పాతదైన, ఎప్పణ్ణించో ఉన్న
ఆది తాళం = ఆది తాళం
అనంత జీవన వాహినిగా = అంతం లేని జీవితమనే నదిలా
సాగిన సృష్టి విలాసమునే = సాగిపోయిన సృష్టి క్రీడ, ఆట, నాట్యం

నా ఉచ్చ్వాసం = పీల్చే ఊపిరి, గాలి
కవనం = కవిత్వం
నా నిశ్వాసం = వదిలే ఊపిరి,గాలి
గానం = పాట

Published at : 30 Nov 2021 05:11 PM (IST) Tags: Sirivennela Sitarama Sastry Sitarama Sastry is no more Sirivennela movie Vidhata Talapuna

ఇవి కూడా చూడండి

Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్

Mrunal Thakur: అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా - ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మృణాల్

Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

Animal Movie: 'యానిమల్' బడ్జెట్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ - 'దిల్' రాజుకు ప్రాఫిట్ తెచ్చే సినిమాయేనా?

Rocky Aur Rani Ki Prem Kahaani: రణవీర్ సింగ్ ‘రీల్’ ఇంట్లో హత్య - ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ రాంధావ ప్యారడైజ్‌లో దుర్ఘటన

Rocky Aur Rani Ki Prem Kahaani: రణవీర్ సింగ్ ‘రీల్’ ఇంట్లో హత్య - ‘రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ రాంధావ ప్యారడైజ్‌లో దుర్ఘటన

TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?

TS Election Voting: ఉదయమే ఓటు వేసిన చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ - క్యూ లైనులో స్టార్స్, మరి మీరు?

Naga Panchami November 30th Episode: 'నాగ పంచమి' సీరియల్: తల్లైతేనే ఇంట్లో ఉంటావ్ - పంచమిని హెచ్చరించిన మోక్ష, గెటప్ మార్చేసిన కరాళి!

Naga Panchami November 30th Episode: 'నాగ పంచమి' సీరియల్: తల్లైతేనే ఇంట్లో ఉంటావ్ - పంచమిని హెచ్చరించిన మోక్ష, గెటప్ మార్చేసిన కరాళి!

టాప్ స్టోరీస్

Election Tensions in Telangana: మొదలైన ఘర్షణలు! ఈ ప్రాంతాల్లో కొట్లాటలు - లాఠీలకు పని చెప్పిన పోలీసులు

Election Tensions in Telangana: మొదలైన ఘర్షణలు! ఈ ప్రాంతాల్లో కొట్లాటలు - లాఠీలకు పని చెప్పిన పోలీసులు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన, పోలింగ్ బూత్ బయటే - ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

Nagarjuna Sagar News: నాగార్జున సాగర్ టెన్షన్స్‌‌పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు

Nagarjuna Sagar News: నాగార్జున సాగర్ టెన్షన్స్‌‌పై నేతలు ఏమీ మాట్లాడొద్దు - వికాస్ రాజ్ ఆదేశాలు

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం