IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
IRCTC Compensation : ప్రైవేట్ రైళ్ల ఆలస్యంపై ప్రయాణికులకు పరిహారం ఇచ్చే పథకాన్ని నిలిపివేనట్టు IRCTC తెలిపింది. ఐదేళ్ల క్రితం నుంచే ఈ ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పింది.
IRCTC Compensation : ప్రైవేట్ రైళ్ల ఆలస్యంపై ప్రయాణికులకు పరిహారం ఇచ్చే పథకాన్ని ఐదేళ్ల క్రితమే నిలిపివేసినట్లు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద వార్తా సంస్థ పీటీఐ దాఖలు చేసిన దరఖాస్తుకు ప్రతిస్పందనగా ఈ సమాచారం అందింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రైల్వే మంత్రిత్వ శాఖ ద్వారా రైల్వే మొత్తం క్యాటరింగ్ అండ్ టూరిజం కార్యకలాపాలను నిర్వహించే ప్రాథమిక లక్ష్యంతో స్థాపించింది. ఇది ప్రస్తుతం టిక్కెట్ బుకింగ్, ప్రైవేట్ రైళ్లను కూడా నిర్వహిస్తోంది.
IRCTC ప్రకారం, ఈ పథకం కింద, అక్టోబర్ 4, 2019 నుండి ఫిబ్రవరి 16, 2024 వరకు ప్రయాణీకులకు రూ.26లక్షలు పరిహారంగా అందించింది. అందిన సమాచారం ప్రకారం, 2023-24 సంవత్సరంలో ప్రయాణీకులకు మొత్తం రూ.15.65 లక్షల పరిహారం అందించింది. IRCTC, ఆర్టీఐకి ప్రతిస్పందిస్తూ, “ప్రైవేట్ రైళ్ల ఆలస్యంపై పరిహారం అందించే పథకం ఫిబ్రవరి 15, 2024 నుండి నిలిపివేశాం” అని స్పష్టం చేసింది. అందుకు గల కారణాలు గోప్యంగా ఉంచామని, వెల్లడించలేమని తెలిపింది.
ఆర్టీఐ ప్రత్యుత్తరం ప్రకారం, IRCTC రెండు తేజస్ రైళ్లను నడుపుతోంది. అందులో ఒకటి న్యూఢిల్లీ నుండి లక్నో (అక్టోబర్ 4, 2019 నుండి), మరొకటి అహ్మదాబాద్ నుండి ముంబైకి (జనవరి 17, 2020 నుండి).
2019 నుంచి IRCTC అందించిన నష్ట పరిహారం
2019-20లో రూ.1.78 లక్షలు, 2020-21లో సున్నా, 2021-22లో రూ.96,000, 2022-23లో రూ.7.74 లక్షలు, 2023-24లో రూ.15.65 లక్షలు ప్రయాణికులకు అందించినట్లు కార్పొరేషన్ తెలిపిందని ఆర్టీఐ చెప్పింది. రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఎంత పరిహారం అందుతుందన్న ప్రశ్నపై.. 60 నుంచి 120 నిమిషాల ఆలస్యానికి రూ.100,120 నుంచి 240 నిమిషాలు ఆలస్యమైతే రూ.250 పరిహారంగా అందజేశామని తెలిపింది. IRCTC రూల్స్ ప్రకారం, ట్రైన్ క్యాన్సిల్ అయితే, ప్రయాణీకులకు పూర్తి ఛార్జీలు తిరిగి చెల్లిస్తారు. ఆలస్యమైతే మాత్రం ప్రయాణీకులకు ఆహారం, నీటి సౌకర్యాలు కూడా అందిస్తారు.
ట్రైన్ లో జర్నీ చేసేటప్పుడు ఇండియన్ రైల్వే అనేక సౌకర్యాలను అందిస్తుంది. దీని గురించి చాలా మంది ప్రయాణికులకు తెలియకపోవచ్చు. రైలు టిక్కెట్‌తోనే మీరు అనేక ఉచిత సౌకర్యాలను కూడా పొందవచ్చు. భారతీయ రైల్వే స్టేషన్‌లో ఆహారం నుండి ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేస్తుంది. అయితే వివిధ కేటగిరీల్లో ప్రయాణించే ప్రయాణికులు వివిధ రకాల సౌకర్యాలను పొందుతారు. అందులో ఫ్రీ బెడ్‌రోల్, మెడికల్ టెస్ట్, ఫుడ్, వెయిటింగ్ రూమ్ లాంటివి ఉంటాయి.
ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు మరింతగా విస్తరించాయి. వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందిస్తూ ముందుకుసాగుతున్నాయి. ఈ ఏడాది పలు రూట్లలో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని ప్రాంతాలను కవర్ చేస్తున్నాయి. వందేభారత్ రైళ్ల ద్వారా ప్రజలు సరికొత్త ప్రయాణ అనుభూతిని పొందుతున్నారు. భారతీయ రైల్వే సంస్థ 2024లో ఏకంగా 30కి పైగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. 2024 చివరి నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 136 వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లు దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, ప్రాంతాలను అనుసంధానిస్తున్నాయి.
Also Read : Year Ender 2024: ఈ ఏడాది ఉద్యోగాల కోతను చూస్తే భయమేస్తుంది - గ్లోబల్ కంపెనీల్లో మేజర్ లేఆఫ్స్