అన్వేషించండి

Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌

Hydra Commissioner Ranganath : హైడ్రా కూల్చివేతలపై ఎలాంటి వెనుకడుగు వేసేది లేదని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. జూలైకి ముందు కట్టిన ఏ ఒక్క నిర్మాణాన్ని తాము కూల్చమన్నారు.

Hydra Commissioner Ranganath : చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గత కొన్ని నెలలుగా హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ఏర్పాటైన హైడ్రా.. భవిష్యత్తు తరాలకు ఓ మంచి నగరాన్ని అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో నిర్మాన అనుమతితో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు 27 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టి సంచలనం సృష్టించిన రంగనాథ్.. పలు జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలనే అభ్యర్థనపై ఆయన స్పష్టమైన వివరణిచ్చారు.

ఆ భవనాలకు ఎలాంటి ప్రమాదం లేదు

హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయని, ఆ నిర్మాణాలను కూల్చబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎఫ్‌టీఎల్‌లో ప్రజలు నివాసం ఉంటున్న భవనాలు కూల్చమని తెలిపారు. ప్రజలు నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలు కూల్చబోమన్న ఆయన అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలు ఉంటాయని అన్నారు. 

హైడ్రా పోలీస్ స్టేషన్

గుండ్లపోచంపల్లి చెరువులోకి ఓ ప్రైవేటు సంస్థ కలుషిత జలాలను విడుదల చేస్తుందంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్.. నెల రోజుల్లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటవుతుందని చెప్పారు. ఇప్పటికైతే కాలుష్య నియంత్రణ మండలికి కంప్లైంట్ చేయండని సూచించారు.

హైడ్రా మొబైల్ యాప్

ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లపై క్లారిటీ రాగానే హైడ్రా మొబైల్ యాప్ అందుబాటులోకి తెస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మీరెక్కడున్నా సరే మీ ప్రాంతం చెరువులో ఉందా, లేదా అన్న విషయాన్ని సులువుగా తెలుసుకోవచ్చారు. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా బఫర్‌జోన్‌లు తెలుసుకునే అవకాశం ఇస్తామని చెప్పారు.

సఫిల్ గూడ, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లోని చెరువుల ఆక్రమణలపై వచ్చిన ప్రశ్నకు కమిషనర్.. బఫర్ జోన్ లో అయినా, ఎఫ్టీఎల్ లో అయినా జూలై 2024 కు ముందు కట్టిన ఇళ్లను కూల్చేస్తామన్నారు. కొత్తగా ఆక్రమణలు జరగకుండా హైడ్రా కాపాడుతుందన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమిస్తే అది ఎవరైనా సరై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చెరువులు ధ్వంసం కాకుండా చూసుకోవడమనే తమ లక్ష్యమని, కర్తవ్యమని చెప్పారు. అలా అని కూల్చవేతలనూ ఆపమని స్పష్టం చేశారు. కూలగొట్టడం ఒక్కటే హైడ్రా పని కాదని 12 చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నట్లు వివరించారు.

జిల్లాల్లో హైడ్రా

పలు జిల్లాల్లో హైడ్రాను ఏర్పాటు చేయాలనే దానిపై కొందరు ప్రశ్నించగా.. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీస్తున్నారని కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం రాజధానిలోని ఓఆర్ఆర్ పరిధిలోనే హైడ్రా పని చేస్తుందని స్పష్టం చేశారు.

ఫిర్యాదులు పంపండిలా

ఆక్రమణలపై హైడ్రాకు ఇప్పటికే 6 వేలకు పైగా ఫిర్యాదులందాయని రంగనాథ్ చెప్పారు. 2025 నుంచి ప్రతి సోమవారం ట్యాంక్‌బండ్‌ బుద్ధభవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1.30గంట నుంచి 3.30గంటల మధ్య తాను ఫిర్యాదులను స్వీకరిస్తున్నామన్నారు. తాను అందుబాటులో లేకపోతే 7207923085 నెంబర్‌కు వివరాలు పంపొచ్చునని కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేసారు.

Also Read : Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్

టాప్ హెడ్ లైన్స్

Telangana Family Register: ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget