అన్వేషించండి

Notice to Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసుల నోటీసులు, శుక్రవారం పీఎస్‌లో విచారణ

Telangana News | హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని బంజారాహిల్స్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.

Police issues notice to BRS MLA Padi Kaushik Reddy | హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం (డిసెంబర్ 27)న ఉదయం విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొన్నారు. ఇటీవల బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సందర్భంలో స్టేషన్‌లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరపణలతో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడం తెలిసిందే. విచారణలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పోలీసులు బుధవారం నాడు నోటీసులు ఇచ్చారు.

పీఎస్‌లో పోలీసులతో వాగ్వాదం కేసులో నోటీసులు

ఇటీవల బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో అధికారులతో వాగ్వాదానికి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశార. పీఎస్‌కు వెళ్లిన కౌశిక్ రెడ్డి పోలీసులను దూషించారని, విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి అరెస్టున అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డి నివాసానికి చేరకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ నేతల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. 


ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డి 
చక్రధర్ అనే కాంగ్రెస్ నేత ఫిర్యాదుతో ఇటీవల మాజీ మంత్రి హరీష్‌రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు అయింది. చక్రధర్ చేసిన ఫిర్యాదులో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఉద్దేశపూర్వకంగానే పోలీసులు, ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేశారని పాడి కౌశిక్ రెడ్డి కౌంటర్ ఎటాక్ చేశారు. తన ఫోన్ ట్యాప్ అయిందని, అందుకు బాధ్యుతలైన కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ, సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేసి ట్రాక్ చేస్తున్నారని ఆరోపించారు.  

బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రేవంత్, ఇంటెలిజెన్స్ ఐజీపై ఫిర్యాదు చేస్తా అన్నారు. చెప్పినట్లుగానే కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌కు వెళ్లగా.. అప్పటికే ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోయనట్టు చెప్పారు. తనను మళ్లీ రావాలని చెప్పి వెళ్లిపోవడం ఏంటని పోలీస్ సిబ్బందిపై కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు తీసుకోవాలని సీఐకి చెప్పారు. అయితే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు తీసుకునేందుకు ఐసీ నిరాకరించడంతో ఆయనతో, పోలీస్ సిబ్బందితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి ఫిర్యాదు చేస్తే మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు చేశారు కానీ ఎమ్మెల్యే వచ్చి ఫిర్యాదు తీసుకోకపోవడం నిర్లక్ష్యమే అన్నారు. ప్రజా ప్రతినిధి ఇచ్చే ఫిర్యాదును పట్టించుకోరా అని కౌశిక్ రెడ్డి గట్టిగానే నిలదీశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు డ్యూటీలో ఉన్న పోలీసులను దూషించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నోటీసులు ఇచ్చారు.

Also Read: Hyderabad Police Warning: సంధ్య థియేటర్ ఘటనపై దుష్ప్రచారం, కఠిన చర్యలు తప్పవన్న హైదరాబాద్ పోలీసులు

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget