అన్వేషించండి
Advertisement
Sirivennela Sitarama Sastry: సిరివెన్నెల దృష్టిలో 'క్లిష్టమైన పాట..'
తెలుగు సాహిత్యం పట్ల ఎంతో ఇష్టం, అనుభవం ఉన్న సిరివెన్నెల ఓ సినిమాలో పాటలు రాయడానికి మాత్రం కాస్త ఇబ్బందిపడ్డారట.
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది గేయరచయితలు ఉన్నారు. వారిలో కొద్దిమంది మాత్రమే తమ సాహిత్యంతో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. అటువంటి గొప్ప గేయ రచయితల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒకరు. అటువంటి వ్యక్తి ఈరోజు సాయంత్రం అనారోగ్యంతో కన్నుమూశారు. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో మే 20, 1955 వ తేదీన శ్రీ డా.సి.వి.యోగి, శ్రీమతి సుబ్బలక్ష్మి గార్లకు జన్మించారు చేంబోలు సీతారామశాస్త్రి. చదువుకుంటున్న రోజుల్లోనే ఆయనకు పాటలు రాసే అవకాశం రావడంతో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. తన కెరీర్ లో మూడు వేలకు పైగా పాటలు రాశారాయన.
తెలుగు సాహిత్యం పట్ల ఎంతో ఇష్టం, అనుభవం ఉన్న సిరివెన్నెల ఓ సినిమాలో పాటలు రాయడానికి మాత్రం కాస్త ఇబ్బందిపడ్డారట. ఆ సినిమా ఏంటో తెలుసా..? 'స్వర్ణకమలం'. ఓ సందర్భంలో సిరివెన్నెల స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. చాలా మంది తనను మీకు నచ్చిన పాట ఏంటి అని అడిగేవారని.. ఏ పాటనైనా.. ఇష్టంతోనే రాసేవాడినని అంటారు సిరివెన్నెల. ఇక కష్టంగా భావించిన పాటలేమైనా ఉన్నాయా అంటే మాత్రం.. అది కూడా ఓ చిక్కు ప్రశ్న అని అనేవారు సిరివెన్నెల.
క్లిష్టమైన పాట వేరు.. కష్టమైన పాట వేరని అంటారు సిరివెన్నెల. తగినంత సమయం దొరక్క.. అక్కడ ఆ పాట ఎందుకు ఉండాలో.. దాంట్లో చెప్పాల్సినంత గొప్ప విషయం ఏంటో తెలియక, తేలక చాలా పాటలు కష్టపడి రాయాల్సి వచ్చిందని అన్నారు. తన దృష్టిలో మాత్రం 'స్వర్ణకమలం' సినిమాలో రాసిన పాటలు చాలా క్లిష్టమైనవి అని.. కనుక ఆ పాటలంటే తనకు చాలా ఇష్టమని చెప్పేవారాయన.
కవిగా తన సత్తా చూపించే ఛాన్స్ వచ్చినప్పుడు ఆనందం కలుగుతుందని సిరివెన్నెల అంటారు. అలాంటి సినిమానే 'స్వర్ణకమలం' అని చెప్పేవారు. ఆ సినిమా కథకు పాటలు రాయడం కత్తిమీద సాములాంటిదని.. సినిమా కథ అసాధారణమని అని ఓసారి చెప్పారు.
సినిమా 'ఆకాశంలో ఆశల హరివిల్లు' అనే పాట.. హీరోయిన్ భానుప్రియ పాత్రను చెబుతోంది. పుట్టుకతో ఆమెకి డాన్స్ అబ్బిందే తప్ప.. డాన్స్ చేయడానికి ఆమె ఎంతమాత్రం ఇష్టం ఉండదు. ఓ పక్క తండ్రి, మరోపక్క హీరో ఆమెని డాన్స్ చేయమని వేధించుకు తింటుంటారు. అలాంటి పాత్ర కోసం పాట రాయడం ఓ ఛాలెంజ్ అని అనేవారు. 'ఘల్లు ఘల్లు' అనే పాత్రలో కూడా హీరోయిన్ పాత్ర లక్షణం చెప్పాలి. మొదటి పాటను, రెండో పాటకు ఆమె పాత్ర స్వభావం మారిపోదు కదా.. అంటే మళ్లీ చెప్పిందే చెప్పాలి. ఇదొక క్లిష్టమైన అంశమని సిరివెన్నెల అనేవారు.
ఈ సినిమాలో పాటలన్నీ తనను ఛాలెంజ్ చేసేవని.. అయితే ఆ ఛాలెంజ్ ను ఎదుర్కోవడంలో ఇష్టముండేదని చెప్పేవారు సిరివెన్నెల. ఒక్కో పాట రాయడానికి పదిహేను రోజుల పాటు టైమ్ ఇచ్చే విశ్వనాథ్ గారి వారి దర్శకులుండడం.. అటువంటి వారి వద్ద పనిచేసే అదృష్టం రావడం ఎంత గొప్ప అనేవారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
న్యూస్
ఆటో
విశాఖపట్నం
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion