By: ABP Desam | Updated at : 12 Aug 2021 09:03 AM (IST)
'ది డెవిల్ ఈజ్ బ్యాక్..' షూటింగ్ కి రెడీ..
ప్రముఖ సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. 'మా' ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం, ప్యానెల్ మీటింగ్స్ అంటూ తెగ హడావిడి చేశారు. తాజాగా మరోసారి అయన వార్తలు నిలిచారు. ఓ సినిమా షూటింగ్ లో ఆయనకు గాయం అయిందంటూ ఆయన స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. కోలీవుడ్ హీరో ధనుష్ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రకాష్ రాజ్ ఫ్లోర్ మీద జారి పడ్డారు. దీంతో ఆయనకు ఫ్రాక్చర్ అయింది.
Also Read : Prakash Raj : షూటింగ్ లో ప్రకాష్ రాజ్ కు గాయాలు.. సర్జరీ కోసం హైదరాబాద్ కు..
ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కు వెళ్తున్నట్లు చెప్పారు. తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. తాను గాయం నుండి కోలుకున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు సర్జరీ అయిన ఫోటోను ట్వీట్ చేసిన ఆయన.. 'ది డెవిల్ ఈజ్ బ్యాక్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సర్జరీ విజయవంతంగా పూర్తయిందని.. ఆయన స్పష్టం చేశారు.
ఆయనకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ గురువారెడ్డికి.. తను త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. త్వరలోనే మళ్లీ షూటింగ్ లో పాల్గొంటాను అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ నటుడిగా వరుస సినిమాలు సైన్ చేస్తున్నారు. తెలుగులో కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నారు. అలానే పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న 'లైగర్' సినిమాలో నటిస్తున్నారు.
The 👿 devil is back… successful surgery.. thank you dear friend Dr #guruvareddy and 🤗🤗🤗 thank you all for your love n prayers.. back in action soon 💪😊 pic.twitter.com/j2eBfemQPn
— Prakash Raj (@prakashraaj) August 11, 2021
F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్
Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
Shekar Review: శేఖర్ రివ్యూ: రాజశేఖర్ కొత్త సినిమా ఎలా ఉందంటే?
NTR30: బన్నీ నో చెప్పిన కథలో ఎన్టీఆర్ నటిస్తున్నారా?
NTR31: ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ - ప్రశాంత్ నీల్ సినిమాలో ఎన్టీఆర్ లుక్
Konaseema Name Change: అట్టుడుకుతున్న కోనసీమ, జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన ఉధృతం - పెట్రోల్ పోసుకుని యువకుడు ఆత్మాహత్యాయత్నం
Afghan Taliban Rules : టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే - తాలిబన్ల కొత్త రూల్ !
Allegations On Jeevita : జీవిత ప్రమాదకరమైన లేడీ - డబ్బులు ఎగ్గొట్టి ఆరోపణలు చేస్తున్నారన్న గరుడవేగ నిర్మాతలు !
Police Jobs 2022: పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయో పరిమితి 2 ఏళ్లు పెంచిన తెలంగాణ ప్రభుత్వం