By: ABP Desam | Updated at : 10 Aug 2021 05:06 PM (IST)
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కు గాయాలు..
ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు ప్రమాదం జరిగింది. ఆయన కింద పడిపోవడంతో దెబ్బలు తగిలినట్లు తెలుస్తోంది. అయితే ఆ గాయాలకు సర్జరీ చేయాల్సి రావడంతో ఆయన హైదరాబాద్ కు పయనమైనట్లు తెలుస్తోంది. తన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డి తనను బాగా చూసుకుంటారని.. ఆయన ఆధ్వర్యంలోనే సర్జరీ చేయించుకోబోతున్నట్లు ప్రకాష్ రాజ్ వెల్లడించారు. చిన్న ఫాక్చర్ అయిందని.. కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
ప్రస్తుతం తను క్షేమంగా ఉన్నట్లు అభిమానులతో వెల్లడించారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎక్కడ చోటుచేసుకుందనే విషయం మాత్రం చెప్పలేదు. షూటింగ్ లో జరిగిందా..? మరి ఇంకెక్కడైనా జరిగిందా అనే విషయంలో క్లారిటీ లేదు. ధనుష్ సినిమా షూటింగ్ లో ఇలా జరిగిందనే మాటలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆయన మాత్రం క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ నటుడిగా వరుస సినిమాలు సైన్ చేస్తున్నారు. తెలుగులో కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాలో నటిస్తున్నారు. అలానే పూరి జగన్నాథ్ రూపొందిస్తోన్న 'లైగర్' సినిమాలో నటిస్తున్నారు. ఓ పక్క నటుడిగా ఎంత బిజీగా ఉన్నా.. రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. ఇప్పుడు 'మా' ఎలెక్షన్స్ లో కూడా పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.
ప్రకాష్ రాజ్ కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అందుకే ఆయన ఇప్పుడు 'మా' ఎలెక్షన్స్ లో అధ్యక్షుడిగా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు పోటీగా మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ ఇలా చాలా మంది పోటీ చేయబోతున్నారు. మరికొద్దిరోజుల్లోనే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి.
A small fall.. a tiny fracture.. flying to Hyderabad into the safe hands of my friend Dr Guruvareddy for a surgery. I will be fine nothing to worry .. keep me in your thoughts 😊😊😊🤗🤗🤗
— Prakash Raj (@prakashraaj) August 10, 2021
Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత
Ram Charan New Look: మళ్ళీ కొత్త లుక్లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్
Netizens Reaction To VD Nude Poster: ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ
Bollywood Horror Movies: ఈ హిందీ హర్రర్ సినిమాల్లోని ఈ ఘటనలు నిజంగానే జరిగాయ్!
Sita Ramam 2nd Song: సీత అంత అందంగా 'సీతా రామం'లో పాట - ప్రోమో చూడండి
Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్లైన్లో ఉన్నప్పటికీ!
Udaipur Murder : అమరావతిలో ఉదయ్పూర్ తరహా హత్య - రంగంలోకి ఎన్ఐఏ !
Sleep With Lights: రాత్రివేళ లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు తప్పవు!
Stuart Broad 35 Runs Over: బ్రాడ్కి బాక్స్ బద్దలు - ఒకే ఓవర్లో 35 పరుగులు - ఈసారి కొట్టింది ఎవరో తెలుసా?