Srinivasa Mangapuram : మోహన్ బాబు @ వెంకటప్పయ్య నాయుడు - శ్రీనివాస మంగాపురంలో పవర్ ఫుల్ లుక్
Mohan Babu : ఘట్టమనేని వారసుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్న 'శ్రీనివాస మంగాపురం' నుంచి మరో ఇంట్రెస్టింగ్ రోల్ రివీల్ అయ్యింది. మూవీలో మోహన్ బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు.

Mohan Babu First Look From Srinivasa Mangapuram Movie : ఘట్టమనేని వారసుడు, మహేష్ బాబు మేనల్లుడు జయకృష్ణ టాలీవుడ్ డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం' నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. మూవీలో కీ రోల్‌ను ఇంట్రడ్యూస్ చేశారు మేకర్స్.
కీ రోల్‌లో మోహన్ బాబు
ఈ మూవీలో కీలక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారు. 'వెంకటప్పాయ నాయుడు'గా ఆయన లుక్ అదిరిపోయింది. పోస్టర్‌లో మోహన్ బాబు సాధారణ తెల్లటి కుర్తా - ధోతి ధరించగా... యాక్షన్ మోడ్‌లో గంభీరమైన లుక్ హైప్ క్రియేట్ చేస్తోంది. 'పవర్, గర్వం నిండిన పాత్రలో మోహన్ బాబును చూసేందుకు మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి' అంటూ రాసుకొచ్చారు. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
చాలా కాలం తర్వాత మోహన్ బాబు ఇలాంటి రోల్ చేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్'లోనూ శికంజి మాలిక్‌గా మోహన్ బాబు నటిస్తున్నారు. ఇది కూడా నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ అని తెలుస్తోంది.
View this post on Instagram
Also Read : రణబాలి వెడ్స్ జయమ్మ - చూడముచ్చటగా కొత్త జంట... విరోష్ కపుల్ వెడ్డింగ్ గిఫ్ట్
మూవీలో ఘట్టమనేని జయకృష్ణ సరసన బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగులో ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. 'మంగ' పాత్రలో ఆమె కనిపించనుండగా... రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది. తెలుగింటి సంప్రదాయంతో రషా తడానీ న్యూ లుక్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
ఈ మూవీకి 'RX100', 'మంగళవారం' మూవీస్ ఫేం అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా... ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్‌తో యాక్షన్ ఓరియెంటెడ్ జానర్‌లో మూవీ రూపొందుతుండగా ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్ అదిరిపోయాయి. వైజయంతీ మూవీస్ అధినేత సమర్పణలో 'చందమామ కథలు' బ్యానర్‌పై పి.కిరణ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్‌తో పాటు ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.
























