అన్వేషించండి

MAA Godava : "మా"కు తక్షణమే ఎన్నికలు పెట్టాలని చిరంజీవి డిమాండ్..! కృష్ణంరాజుకు లేఖ..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై కృష్ణంరాజుకు చిరంజీవి లేఖ రాశారు. తక్షణం ఎన్నికలు పెట్టాలని కోరారు.


మెగాస్టార్ చిరంజీవి మొదటి సారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై బహిరంగంగా స్పందించారు. తక్షణం ఎన్నికలు పెట్టాలని కోరుతూ "మా" క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు.   ప్రస్తుత కమిటీ పదవి కాలం ముగిసిందని.. దీని వల్ల సభ్యుల కోసం చేపట్టాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని లేఖలో చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఇబ్బంది "మా" సభ్యులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలపై ఇప్పటికే అనేక మంది సభ్యులు బహిరంగంగా అనేక ప్రకటనలు చేస్తున్నారని.. దీని వల్ల చెడ్డపేరు వస్తోందని చిరంజీవి లేఖలో అన్నారు. 

 వెంటనే జరపకపోతే వివాదాలు మరింత ముదిరే అవకాశముందని..అందుకే వెంటనే ఎన్నికలు జరిపేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణంరాజును కోరారు. " పరిశ్రమలో పెద్దవారు. మీకు మొదటి నుంచి జరుగుతున్న విషయాలన్నీ తెలుసు. సంస్థ ప్రతిష్ఠను మసకబారుస్తున్న వారెవ్వరిని మీరు ఉపేక్షించవద్దు. వారిపై క్రమశిక్షణాచర్యలు తీసుకోండి" అని కూడా చిరంజీవి లేఖలో కృష్ణంరాజుకు సిఫార్సు చేశారు. వివాదాలు అన్నీ ముగిసిపోయి ఓ కుటుంబంలా కలిసి పనిచేసే రోజులు త్వరలోనే వస్తాయనే ఆశాభావాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు. 

కొద్ది రోజులుగా "మా" ఎన్నికల అంశం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతోంది. ప్రకాష్ రాజ్ ప్యానల్‌ను ప్రకటించిన తర్వాత.. ఎన్నికలు ఎప్పుడు అనిపదే పదే అడుగుతూ వస్తున్నారు. ప్రస్తుత కార్యవర్గంలో పదిహేను మంది తక్షణం ఎన్నికలు పెట్టారని కృష్ణంరాజుకు రెండుసార్లు లేఖలు రాశారు. దీంతో వచ్చే నెల 12వ తేదీన ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారన్న ఓ ప్రచారం బయటకు వచ్చింది. కానీ అసలు ఎన్నికలే పెట్టే ఉద్దేశంలో లేరని.. కొంత మంది అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో హేమ.. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌పై సంచలన ఆరోపణలు చేస్తూ ఆడియోవిడుదల చేశారు. ఇది దుమారం రేపింది. 

రాను రాను "మా" ఎన్నికల అంశం.. సినిమా స్టోరీలాగా మారిపోతూండటంతో..  మరింత రచ్చ కాకుండా ఉండటానికి చిరంజీవి రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అయితే చిరంజీవి తల్చుకుంటే.. ఏకగ్రీవం అవుతుందని టాలీవుడ్‌లోని కొంతమంది చెబుతూ ఉంటారు. కానీ ఎన్నికల కోసమే చిరంజీవి లేఖ రాశారు. దీంతో ఎన్నికలు ఖాయమని చెప్పుకోవచ్చంటున్నారు. మొత్తం మా ఎన్నికల బరిలో ఐదుగురు అధ్యక్ష అభ్యర్థులు ఉన్నారు. ప్రకాష్ రాజ్ పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. ఆయనకు చిరంజీవి మద్దతిస్తున్నారన్న ప్రచారం ఉంది. మంచు విష్ణు కూడా రంగంలోకి దిగుతున్నారు. పెద్దలంతా మద్దతిస్తే ఏకగ్రీవానికి సహకరిస్తానంటున్నారు. కానీ వివాదం ముదిరి పాకాన పడుతోంది. చిరంజీవి స్పందనతో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 

 


MAA Godava :
MAA Godava :

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today October 20th: 'గోదావరి' సీరియల్: జాను ఫంక్షన్‌ని రెడీ రావడానికి ఓకే చెప్పిన శారద! సింహాద్రి గిఫ్ట్ వెనక సీక్రెట్!
'గోదావరి' సీరియల్: జాను ఫంక్షన్‌ని రెడీ రావడానికి ఓకే చెప్పిన శారద! సింహాద్రి గిఫ్ట్ వెనక సీక్రెట్!
Jayammu Nischyammu Raa : అరేంజ్డ్ ప్లస్ లవ్ మ్యారేజ్ - పంజాగుట్ట ఫ్లాట్‌లో గోల్డెన్ మెమొరీస్... త్రివిక్రమ్ సునీల్ తమన్ ఏం చెప్పారంటే?
అరేంజ్డ్ ప్లస్ లవ్ మ్యారేజ్ - పంజాగుట్ట ఫ్లాట్‌లో గోల్డెన్ మెమొరీస్... త్రివిక్రమ్ సునీల్ తమన్ ఏం చెప్పారంటే?
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Varanasi Story : తండ్రీ కొడుకుల ఎమోషన్ విత్ క్యూట్ లవ్ స్టోరీ - అతి పెద్ద సవాల్ అదే?... వారణాసి స్టోరీ లీక్ చేసిన రాజమౌళి
తండ్రీ కొడుకుల ఎమోషన్ విత్ క్యూట్ లవ్ స్టోరీ - అతి పెద్ద సవాల్ అదే?... వారణాసి స్టోరీ లీక్ చేసిన రాజమౌళి

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
Nagole Road Accident: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
Andhra Pradesh Rains: ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Thalassemia in Kids : చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
TG High Court Verdict: చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Aadarsha Kutumbam Maala Song : నీ ఒంట్లో ఉంది కరెంటు... వెలిగించవే నా ఫిలమెంటు - వెంకీ నివేదా రొమాంటిక్ సాంగ్ లిరిక్స్
నీ ఒంట్లో ఉంది కరెంటు... వెలిగించవే నా ఫిలమెంటు - వెంకీ నివేదా రొమాంటిక్ సాంగ్ లిరిక్స్
Embed widget