By: ABP Desam | Updated at : 09 Aug 2021 02:51 PM (IST)
ఆన్ టైమ్ కు ఆర్ఆర్ఆర్ వస్తుందా
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమాలకు ఇంటర్నేషనల్ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది. ఆయన ఏ సినిమా తీసినా.. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. 'బాహుబలి' సినిమాతో తన స్టామినాను ప్రపంచానికి తెలిసేలా చేసిన రాజమౌళి తాజాగా రూపొందిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీమ్ గా కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చి టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా వచ్చిన మేకింగ్ వీడియో.. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా విడుదల చేసిన 'దోస్తీ' సాంగ్ కు ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. యూట్యూబ్ లో ఈ పాటకు మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. ఒక్కో భాషలో ఒక్కో సింగర్ తో ఈ పాటను పాడించి సినిమాపై హైప్ మరింత పెంచారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ ఉక్రెయిన్ లో జరుగుతోంది.
Also Read : RRR Movie: ఎన్టీఆర్ తలకు గాయం.. జక్కన్న షూట్ చేస్తుంటే కట్ చెప్పిన రామ్ చరణ్
రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాయి. ఉక్రెయిన్ లో చిత్రబృందం ఏం చేస్తుంది..? అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుంది ఇలాంటి విషయాలను తెలియజేస్తూ.. నేటి నుండి 'ఆర్ఆర్ఆర్' ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ లు చేయనున్నట్లు ఎన్టీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా తాజాగా ఆయనొక వీడియో రిలీజ్ చేశారు.
ఇందులో రామ్ చరణ్ కొంత అసహనానికి గురైనట్లు కనిపిస్తున్నారు. 'చరణ్ డ్రమ్స్ ప్రాక్టీస్ అయిందా..?' అని ఎన్టీఆర్ అడగగా.. టేబుల్ పైనే వాయిందా 'అయిపోయింది' అంటారు. ఆ తరువాత రామ్ చరణ్.. కార్తికేయను చూపిస్తూ 'నిజమైన డ్రమ్స్ ఎక్కడ.. కాస్ట్యూమ్ లేదు.. ఏం లేదు.. పొద్దుపొద్దునే తీసుకొచ్చి కూర్చోబెట్టారు.. అసలు దసరాకు రిలీజ్ చేయాలా..? వద్దా..?' అంటూ చరణ్ సరదాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న కార్తికేయ.. 'వస్తున్నాయి.. రెండు నిముషాలు' అని నవ్వుతూ బదులిచ్చారు. ఎన్టీఆర్ పోస్ట్ తొలి వీడియోనే ఇలా ఉంటే ఇక రాబోయే వీడియోలు ఏ రేంజ్ లో ఉంటాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Modern Love Hyderabad: అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'మోడర్న్ లవ్ హైదరాబాద్' - ట్రైలర్ చూశారా?
Sardar Movie: నాగార్జున చేతికి కార్తీ 'సర్ధార్' సినిమా - రిలీజ్ ఎప్పుడంటే?
Manchu Manoj: మంచు మనోజ్ సినిమా నుంచి డైరెక్టర్ వాకౌట్!
Srilanka Crisis : శ్రీలంకలో పెట్రోల్ సెలవులు - ఎప్పటి వరకో తెలియదు!
Mahindra Scorpio N Launched: తక్కువ ధరతో, సూపర్ ఫీచర్లతో కొత్త స్కార్పియో - మహీంద్రా మళ్లీ కొట్టిందిగా!
PSLV C-53 Launch : ఈ నెల 30న నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శ్రీహరికోటలో ప్రయోగ ఏర్పాట్లు షురూ
Mohammed Zubair Arrested : జర్నలిస్ట్ మహ్మద్ జుబేర్ అరెస్ట్, ఓ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపణలు