RRR Movie Updates: 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ లో 'దోస్తులు'.. ఎంజాయ్ చేస్తున్నారుగా..
దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ దసరా కానుకగా ఆర్ఆర్ఆర్ మూవీని తీసుకొచ్చే పనిలో జక్కన్న బిజీగా ఉన్నాడని తెలిసిందే.
దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఎలాంటి సినిమా చేయబోతున్నారని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. దానికి తగ్గట్లే టాలీవుడ్ నుండి ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లను తీసుకొని 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నారు. నిజానికి ఈపాటికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది.
ఎట్టకేలకు ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు కన్ఫామ్‌గా చెబుతున్నారు. అప్పుడెప్పుడో ఈ తేదీని అనౌన్స్ చేసినా.. జనాలకు మాత్రం నమ్మకం రాలేదు. దీంతో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు అంచనాలను పెంచేశాయి. రీసెంట్ గా వచ్చిన 'దోస్తీ' సాంగ్ కి ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే అక్కడ షూటింగ్ ఎలా జరుగుతుందనే సంగతులు తెలియజేస్తూ.. 'ఆర్ఆర్ఆర్' ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఎన్టీఆర్ పోస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్‌కి సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ వీడియో బాగా ట్రెండ్ అయింది. తాజాగా మరో వీడియో పోస్ట్ చేశారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కారులో షూటింగ్ కు వెళ్తున్నారు. వెళ్తూ అలా కారులో 'దోస్తీ' సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పాట ప్లే అవుతుంటే తను కూడా గొంతు కలిపాడు. ఈ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీమ్ గా కనిపించనున్నారు.
View this post on Instagram
Also Read : RRR : ఆన్ టైమ్ కు ఆర్ఆర్ఆర్ వస్తుందా..? చరణ్ ఎందుకు అలా అన్నాడు..?
RRR Movie: ఎన్టీఆర్ తలకు గాయం.. జక్కన్న షూట్ చేస్తుంటే కట్ చెప్పిన రామ్ చరణ్