Pawan Kalyan: 'నా సినిమాలు ఫ్రీగా ఆడిస్తా..' టికెట్ రేట్స్ పై మరోసారి మండిపడ్డ పవన్..
సినిమా టికెట్లు, థియేటర్ల వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
'రిపబ్లిక్' సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ ఏపీలో టికెట్ రేట్స్ ఇష్యూ గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వంతో పాటు ఇండస్ట్రీ పెద్దల తీరుని కూడా ప్రశ్నించారు పవన్. ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. పవన్ చేసిన కామెంట్స్ కి తమకు ఎలాంటి సంబంధం లేదంటూ ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్లి ఏపీ మంత్రుల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ.. టికెట్ రేట్స్ విషయంలో ఇండస్ట్రీకి అనుకూలంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వం డిసైడ్ చేసే రేట్లకే టికెట్లను అమ్మాలని.. అది కూడా ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థలోనే టికెట్స్ బుక్ చేయాల్సి ఉంటుందని జీవో జారీ చేసింది.
ఇప్పటికీ ఈ విషయంపై అప్పుడప్పుడు దర్శకనిర్మాతలు, హీరోలు మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి ఈ ఇష్యూని రైజ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు చేపట్టిన పోరాటానికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్షకు దిగారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ దీక్ష చేపట్టారు. ఇదే సమయంలో ఆయన సినిమా టికెట్లు, థియేటర్ల వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తన సినిమాలను ఆపి ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోందని పవన్ ఆరోపణలు చేశారు. అలాంటి బెదిరింపులకు తాను భయపడనని పవన్ స్పష్టం చేశారు. తనతో పంతానికి దిగితే తన సినిమాలను ఫ్రీగా ఆడిస్తానంటూ పవన్ ప్రకటించారు. సినిమా టికెట్స్ విషయంలో ట్రాన్స్పరన్సీ లేదంటున్నారని.. మరి ప్రభుత్వం అమ్మే మద్యానికి ట్రాన్స్పరన్సీ ఉందా అని ప్రశ్నించారు పవన్. ప్రస్తుతం పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?
Also Read: ఇక సహించేదే లేదు.. శిక్ష పడేవరకు పోరాడతా.. రవి సీరియస్..
Also Read: 'ఐకాన్' సినిమా అటకెక్కినట్లే.. ఇదిగో క్లారిటీ..
Also Read: 'నువ్ నన్ను భరించావా..? లేక నటించావా..?' మానస్ ని ప్రశ్నించిన పింకీ..
Also Read: రజనీకాంత్ పవర్‌ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి