Allu Arjun: 'ఐకాన్' సినిమా అటకెక్కినట్లే.. ఇదిగో క్లారిటీ..
'ఐకాన్' సినిమా హోల్డ్ లో పడినట్లు తెలుస్తోంది. దీనిపై పరోక్షంగా క్లారిటీ కూడా ఇచ్చేశారు 'పుష్ప' నిర్మాతలు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 'పుష్ప' పార్ట్ 1 తరువాత పార్ట్ 2 పూర్తి చేయడానికి ముందు బన్నీ ఐదారు నెలలు గ్యాప్ తీసుకుంటాడని అన్నారు. ఆ గ్యాప్ లో అల్లు అర్జున్ వేరే సినిమాలో నటిస్తారని.. ఆ సినిమా పూర్తయ్యాక 'పుష్ప 2' సెట్స్ పైకి వస్తారని వార్తలు వచ్చాయి. ఈ గ్యాప్ లో ఆయన చేయబోయే సినిమా 'ఐకాన్' అని కూడా బన్నీ సన్నిహిత వర్గాల నుంచి లీకులు వచ్చాయి.
'ఐకాన్' ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టినట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే మరోసారి 'ఐకాన్' సినిమా హోల్డ్ లో పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై పరోక్షంగా క్లారిటీ కూడా ఇచ్చేశారు 'పుష్ప' నిర్మాతలు. ఇటీవల 'పుష్ప 2' గురించి మాట్లాడిన చిత్రనిర్మాతలు ఫిబ్రవరి నుంచే షూటింగ్ మొదలుపెడుతున్నట్లు చెప్పారు.
అంటే 'పుష్ప' పార్ట్ 1 విడుదలైన తరువాత బన్నీకి మరో సినిమా చేసే ఉద్దేశం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. వచ్చే రెండు నెలలు బన్నీ తన ఫ్యామిలీతో సమయం గడపాలని అనుకుంటున్నారు. 'పుష్ప' లుక్ ను కూడా బన్నీ అలానే మెయింటైన్ చేస్తారని తెలుస్తోంది. జుట్టు, గడ్డం తీసేస్తే.. మళ్లీ అంత గుబురుగా రావడానికి చాలా సమయం పట్టేస్తుంది. అందుకే ప్రస్తుతం ఉన్న లుక్ ని అలానే కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు. మధ్యలో మరో సినిమా చేయాలనుకోవడం లేదు.
అంటే.. 'ఐకాన్' సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదన్నమాట. 'పుష్ప 2' సినిమా తరువాతే బన్నీ తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. బోయపాటి శ్రీను, కొరటాల శివ లాంటి దర్శకులు బన్నీతో సినిమాలు చేయాలనుకుంటున్నారు. మరి ఆయన ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి!
Also Read: 'నువ్ నన్ను భరించావా..? లేక నటించావా..?' మానస్ ని ప్రశ్నించిన పింకీ..
Also Read: రజనీకాంత్ పవర్‌ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ కి కవల పిల్లలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి