By: ABP Desam | Updated at : 12 Dec 2021 04:26 PM (IST)
మానస్ ని ప్రశ్నించిన పింకీ..
ఈరోజు బిగ్ బాస్ షో నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతుండడంతో ఎపిసోడ్ పై ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించి ఓ ప్రోమో విడుదల కాగా.. అందులో హౌస్ మేట్స్ తో ఫన్నీ గేమ్ ఆడించారు నాగార్జున. తాజాగా మరో ప్రోమో విడుదలైంది. అందులో ఎక్స్ హౌస్ మేట్స్ లో కొందరు ప్రెజంట్ హౌస్ మేట్స్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు.
ముందుగా జెస్సీ.. 'షన్ను చాలా సీరియస్ గా అడుగుతున్నాను. నీకు సిరికి ఎలాంటి బాండింగ్ ఉందో.. వేరే జనాలు ఏం అనుకుంటున్నారో.. నువ్ ఎప్పుడైనా ఆలోచించావా..?' అని ప్రశ్నించాడు. తరువాత ప్రియాంక.. 'హాయ్ మానస్.. నేను నిన్నొకటి అడగాలని అనుకుంటున్నాను. ఇన్ని హౌస్ లో నువ్ నన్ను భరించావా..? లేక నటించావా..?' అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న విన్న మానస్ ఎక్స్ ప్రెషన్స్ మారిపోయాయి.
జెస్సీ.. షణ్ముఖ్ తో పాటు సిరిని కూడా ప్రశ్నించాడు. 'నువ్ బిగ్ బాస్ హౌస్ లోకి గేమ్ ఆడడానికి వెళ్లావ్ కదా సిరి.. ఎమోషనల్ కనెక్ట్ అయిపోతున్నాను.. అది కనెక్ట్ అయిపోతున్నాను.. ఇది కనెక్ట్ అయిపోతున్నాను అని పిచ్చెక్కిపోతున్నావ్. అవసరమా నీకు..?' అని గట్టిగానే నిలదీశాడు.
ఆ తరువాత హౌస్ మేట్స్ ఇతర ఇంటి సభ్యుల ఫొటోలతో ఉన్న బోర్డులను మెడలో వేసుకొని వారిలా మాట్లాడడం మొదలుపెట్టారు. ముందుగా శ్రీరామ్.. కాజల్ ని ఇమిటేట్ చేస్తూ నవ్వించాడు. షణ్ముఖ్ ఫొటో బోర్డు మెడలో వేసుకున్న కాజల్ ని 'షణ్ముఖ్.. కాజల్ పై నీ అభిప్రాయం' అని అడిగారు నాగ్. దానికి ఆమె 'కాజల్ చాలా మంచిది సార్.. కాజల్ ఆలోచనా విధానం, నా ఆలోచనా విధానం ఒకేలా ఉంటాయి' అని తనను తాను పొగుడుకుంది. దానికి నాగార్జున 'అంటే నువ్ బ్రహ్మ, కాజల్ బ్రహ్మియా..?' అని ప్రశ్నించారు. ఆ తరువాత సన్నీ ఫొటో బోర్డు మెడలో వేసుకున్న షణ్ముఖ్ నవ్వించే ప్రయత్నం చేశాడు.
Ex-housemates nundi questions..Answers ento chuddam!#BiggBossTelugu5 today at 9 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/tNFJXGFuJZ
— starmaa (@StarMaa) December 12, 2021
Also Read: రజనీకాంత్ పవర్ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Also Read: బిగ్ బాస్ కంటెస్టెంట్ కి కవల పిల్లలు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss Promo: బ్యాంక్ గా మారిన బిగ్ బాస్ హౌస్- నాలుగో పవర్ అస్త్ర కోసం పోటీ!
Bigg Boss Season 7 Day 22 Updates: చెల్లి, అక్కా అని పిలుస్తా, నీ పేరు ఎత్తితే చెప్పుతో కొట్టు - రతికతో పల్లవి ప్రశాంత్ లొల్లి
Bigg Boss Sivaji: ‘బిగ్ బాస్’ హౌస్‌కు శివాజీ గెస్టా? ఆడేది తక్కువ అజమాయిషీ ఎక్కువ - పిల్ల గ్యాంగ్‌తో మైండ్ గేమ్!
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
Bigg Boss Season 7: శుభశ్రీపై టిష్యూ విసిరేసిన అమర్దీప్ - ఆమె స్థానంలో ప్రియాంక ఉంటే?
Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !
ACB Court Case : అక్టోబర్ నాలుగో తేదీకి ఏసీబీ కోర్టులో విచారణలు వాయిదా - కస్టడీ, బెయిల్ పిటిషన్లూ అప్పుడే !
IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్ఇండియా టార్గెట్ 353
Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్‌కు మలయాళ సినిమా '2018'
/body>