By: ABP Desam | Updated at : 11 Dec 2021 07:55 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
గాలి వానలో సాయికుమార్, రాధికా శరత్ కుమార్
బీబీసీ స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో 'గాలివాన' అనే ఒరిజినల్ సిరీస్‌ను జీ5 నిర్మిస్తోంది. బీబీసీ స్టూడియోస్ నిర్మించిన ఒక యూరోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి 'గాలివాన'గా తెరకెక్కిస్తున్నారు.
ఇందులో సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్, హీరో సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 50 ఏళ్ళ క్రితం మొదలయిన తన కెరీర్‌లో సాయి కుమార్ బాలనటుడిగా, హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా ఎన్నో సినిమాలు చేశారు.
అలాగే, ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కథానాయికగా నటించిన రాధికా శరత్ కుమార్ తనదైన నటనాశైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బుల్లితెరపై కూడా విజయాలు అందుకున్నారు. సినిమాలు, సీరియళ్లు చేసిన రాధికా శరత్ కుమార్ ఓటీటీ కోసం షో చేస్తుండటం ఇదే తొలిసారి.
ఇటీవలి కాలంలో డైరెక్టర్ కామెంటరీతో 'రిపబ్లిక్' సినిమాను జీ5 విడుదల చేసింది. ప్రజల్ని చైతన్యపరిచే కథతో రూపొందిన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది. అంతే కాకుండా 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' కూడా సక్సెస్ అయింది.
"ఇటీవలే ఈ ఒరిజినల్ సిరీస్ షూటింగ్ మొదలు పెట్టాం. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఒక బ్రిటిష్ షోను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాం. ఈ వెబ్ సిరీస్‌తో బీబీసీ రీజనల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లోకి అడుగు పెడుతోంది." అని నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్, 'జీ5' సంస్థలు తెలిపాయి. 'తిమ్మరుసు' ఫేమ్ శరణ్ కొప్పిశెట్టి ఈ ఒరిజినల్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా, సుజాత సిద్ధార్థ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
Also Read: 'పుష్ప' బిజినెస్.. రూ.250 కోట్లకు పైమాటే..
Also Read: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Balakrishna: బాలయ్యకు కోవిడ్ నెగెటివ్ - నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ షురూ
NTR: ఎన్టీఆర్ అభిమాని ఆరోగ్య పరిస్థితి విషమం.. ఫోన్ చేసి మాట్లాడిన హీరో!
Pranitha On Udaipur Murder: ఆ అరుపులు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయ్ - ఉదయ్‌పుర్ ఘటనపై ప్రణీత స్పందన
Khushbu Sundar: మీనా భర్త మృతిపై తప్పుడు ప్రచారం - నటి ఖుష్బూ ఫైర్!
Aamir Khan: అసోం ప్రజల కోసం విరాళం ప్రకటించిన అమీర్ ఖాన్, ఆ మంచి మనసును మెచ్చుకోవాల్సిందే
TS SSC Results 2022: ఇవాళే తెలంగాణ పదోతరగతి ఫలితాలు - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే
Maharashtra Political Crisis: సుప్రీం కోర్టు తీర్పుతో మారిన మహారాష్ట్ర పొలిటికల్ సీన్- కొత్త ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్!
Relief For Amaravati Employees : మరో రెండు నెలలు ఉచిత వసతి - అమరావతి ఉద్యోగులకు సర్కార్ చివరి నిమిషంలో రిలీఫ్ !
Rohit Sharma: ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నుంచి రోహిత్ అవుట్ - కెప్టెన్ చాన్స్ ఎవరికంటే?