Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
టీవీలో 'సుడిగాలి' సుధీర్ ఓ స్టార్. ఆయనకు ఫాలోయింగ్ బావుంది. అందుకు తగ్గట్టు షోస్ చేసే అవకాశాలు వస్తున్నాయి. అయితే... ఇప్పుడు ఆయనకు అవకాశాలు తగ్గుతున్నాయా?
![Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం... Sudigali Sudheer lost one TV show and coming to one more show... Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్‌కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/11/5b5740488526c296fb55a0fd84a5c38b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'సుడిగాలి' సుధీర్ టీవీ ఇండస్ట్రీలో స్టార్. అతడు ప్లేబాయ్ అన్నట్టు టీవీ కార్యక్రమాల్లో అందరూ అతడి మీద పంచ్ డైలాగులు, జోకులు వేస్తారు. సుధీర్ కూడా వాటిని ఎంజాయ్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తాడు. టీవీలో కామెడీ చేయడం కోసమే అనేది అతడికి తెలుసు కాబట్టి. ఆ ఇమేజ్, కామెడీతో వచ్చిన క్రేజ్ అతడికి బాగా హెల్ప్ అయ్యింది. వరుసగా అవకాశాలు వచ్చాయి.
కామెడీ షో 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో 'సుడిగాలి' సుధీర్ టీమ్ లీడర్. 'ఆటో' రామ్ ప్రసాద్, 'గెటప్' శ్రీనుతో కలిసి ఏడేళ్లుగా స్కిట్లు చేస్తున్నాడు. ఇకపై 'ఎక్స్ట్రా జబర్దస్త్'లో అతడి టీమ్ కనిపించదని, ముగ్గురూ మానేస్తున్నారని ప్రచారం జరిగింది. దాన్ని కూడా వాళ్లు స్కిట్ కోసం వాడుకున్నారు. ఈ వారం ప్రసారమైన ఎపిసోడ్ ప్రోమోలో 'ఎక్స్ట్రా జబర్దస్త్' విడిచి వెళుతున్నట్టు కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేశారు. కొంత మంది నిజం అని అనుకున్నారు. మరి కొందరు టీఆర్పీ రేటింగ్ కోసం చేసిన పని ఊహించారు. అదే నిజమైంది. 'ఎక్స్ట్రా జబర్దస్త్' నుంచి 'సుడిగాలి' సుధీర్ టీమ్ బయటకు వెళ్లడం లేదు. కానీ, 'ఢీ' నుంచి మాత్రం అతడు తప్పుకొన్నాడు.
అవును... 'ఢీ 13' షో బుధవారం ముగిసింది. వచ్చే బుధవారం నుంచి 'ఢీ 14' స్టార్ట్ కానుంది. రీసెంట్‌గా ప్రోమో రిలీజయింది. అందులో 'సుడిగాలి' సుధీర్ లేరు. ఆయనతో పాటు 'ఢీ 13' షోలో చేసిన టీమ్ లీడర్‌గా చేసిన 'హైపర్' ఆది 'ఢీ 14'లో ఉన్నారు. 'బిగ్ బాస్' ఫేమ్ అఖిల్ సార్థక్‌ను మరో టీమ్ లీడర్ చేశారు. సుధీర్‌ను పూర్తిగా తప్పించారో? లేదంటే... తర్వాత తీసుకొస్తారో? చూడాలి. గతంలో ఒక సీజన్ అప్పుడు రష్మీ బదులు భానుశ్రీను తీసుకున్నారు. రెండు మూడు ఎపిసోడ్స్ తర్వాత భానుశ్రీ బదులు మళ్లీ రష్మీని తీసుకొచ్చారు. ఈసారి కూడా అటువంటిది ఏమైనా జరుగుతుందా? లేదంటే... 'హైపర్' ఆది, అఖిల్ సార్థక్‌తో కంటిన్యూ చేస్తారా? వెయిట్ అండ్ సీ. ప్రస్తుతం సుధీర్ లేకపోవడంతో అతడి క్రేజ్ తగ్గుతుందా? లేదంటే తగ్గించే ప్రయత్నం చేస్తారా? అనే డౌట్ నెటిజన్స్ కొందరిలో మొదలైంది.
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Also Read: టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఫ్రెండ్స్‌తో ఎన్టీఆర్ మాట్లాడతారా?
Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
Also Read: దేవిశ్రీ ఆ సాంగ్‌ను కాపీ కొట్టాడా? ఊ అంటారా... ఉఊ అంటారా?
Also Read: 'నయీం డైరీస్'పై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం... టీమ్ ఏమంటోందంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)