Pushpa: 'పుష్ప' బిజినెస్.. రూ.250 కోట్లకు పైమాటే..
'పుష్ప' సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి రూ.250 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
మరికొన్ని రోజుల్లో 'పుష్ప' సినిమా విడుదల కాబోతుంది. దీంతో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాల జోరు పెంచింది. ఇప్పటికే సినిమాలో పాటలు, ట్రైలర్ ను విడుదల చేశారు. నిన్న విడుదలైన ఐటెం సాంగ్ సైతం యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను సంపాదిస్తోంది. ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కి తగ్గట్లే బిజినెస్ కూడా జరుగుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి రూ.250 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
అన్ని భాషల్లో థియేట్రికల్ రైట్స్ కి భారీ రేటు పలికిందట. అలానే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఎక్కువ మొత్తంలో డీల్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా.. ఆడియో, శాటిలైట్ రైట్స్ ఎలానూ ఉంటాయి. మొత్తంగా సినిమా బిజినెస్ రూ.250 కోట్లు దాటేసింది అంటున్నారు. 'అల.. వైకుంఠపురములో' లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత బన్నీ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.
అలానే సుకుమార్ కూడా 'రంగస్థలం' తరువాత చాలా కాలంగా ఈ సినిమాపైనే ఉండిపోయారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమా రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. తొలిసారి ఈ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు అల్లు అర్జున్. ఇప్పటివరకు అల్లు అర్జున్ కెరీర్ లో తెరకెక్కిన సినిమాల్లో కాస్ట్లీ ప్రాజెక్ట్ 'పుష్ప' అనే చెప్పాలి.
రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు.
#PushpaTrailer Out Now 🔥
— Pushpa (@PushpaMovie) December 6, 2021
DEC 17th #ThaggedheLe 🤙
▶️ https://t.co/3BkEDzUIXL#PushpaTheRise #PushpaTheRiseOnDec17 @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/jLNic8VHny
Also Read: 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్.. రేటెంతో తెలుసా..?
Also Read: 'సుడిగాలి' సుధీర్కు ఓ షో పోయింది! మరో షోలో మాత్రం...
Also Read: ఫన్నీ వీడియో: బ్రహ్మీతో ‘ఊ అంటావా..’ స్పూఫ్ సాంగ్.. దేవీశ్రీ ప్రసాద్ స్పందన ఇది!
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Also Read: టికెట్ రేట్లపై ఏపీ ప్రభుత్వంలో ఉన్న ఫ్రెండ్స్తో ఎన్టీఆర్ మాట్లాడతారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి